Annamalai | బీజేపీకి అన్నామలై రాజీనామా.. ఆమోదించిన అధిష్ఠానం
Annamalai | తమిళనాడు బీజేపీ (BJP) మాజీ అధ్యక్షుడు అన్నామలై (Annamalai) ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి ఇప్పటికే పంపిచగా, తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ (Nitin Nabin) దానిని ఆమోదించారు.
Annamalai | త్రినేత్ర.న్యూస్: తమిళనాడు బీజేపీ (BJP) మాజీ అధ్యక్షుడు అన్నామలై (Annamalai) ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి ఇప్పటికే పంపిచగా, తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ (Nitin Nabin) దానిని ఆమోదించారు. కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై 2019లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. 2021 నుంచి 2025 వరకు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అక్కడ పార్టీకి కాస్తో.. కూస్తో గుర్తింపు తెచ్చిపెట్టారు. అయితే, ఉన్నఫలంగా గత ఏడాది ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన అధిష్ఠానం, ఎలాంటి పదవీ అప్పగించలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయనకు బీజేపీ సీటు ఇవ్వలేదు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన బీజేపీని వీడి, కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నది.
ఇందులో భాగంగానే ఆయన గత మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్‌కు ఐదు పేజీల లేఖను అందజేశారు. అయితే, కొంత కాలంపాటు ఓపిక పట్టాలని, పార్టీలోనే కొనసాగాలని అధిష్ఠానం ఆయనను కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తాను ఇంకా బీజేపీలోనే ఉన్నానని, కొత్త పార్టీ ఏర్పాటు ఆలోచన ఏమీ లేదని రెండు రోజుల క్రితం అన్నామలై మీడియాతో అన్నారు. అయితే ఇంతలోనే ఆయన రాజీనామాను బీజేపీ అధిష్ఠానం ఆమోదించడం గమనార్హం. త్వరలోనే ఆయన కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉంది.!
తాజావార్తలు
- ●Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి, వర్ధంతి నిర్వహణ
- ●Gongidi Sunitha | రేవంత్ రెడ్డి సీఎంగా, హోం, ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఫెయిల్
- ●Vande Mataram Controversy | వందేమాతరం వివాదం: కాంగ్రెస్ ఆ రెండు చరణాలే ఎందుకు పాడుతుంది? మిగతా వాటిల్లో ఏముంది?
- ●Ramachander Rao | కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి అర్థం కాదు
- ●DK Shivakumar | 1971 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేపట్టాలి : డీకే శివకుమార్
- ●Hollywood | రిలీజ్‌కు రెండు రోజుల ముందు హాలీవుడ్ హీరో మూవీ లీక్ - ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ట్రోల్స్

Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి, వర్ధంతి నిర్వహణ

Gongidi Sunitha | రేవంత్ రెడ్డి సీఎంగా, హోం, ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఫెయిల్

Vande Mataram Controversy | వందేమాతరం వివాదం: కాంగ్రెస్ ఆ రెండు చరణాలే ఎందుకు పాడుతుంది? మిగతా వాటిల్లో ఏముంది?

Ramachander Rao | కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి అర్థం కాదు





