Ramchander Rao | పవన్ కల్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు: రామచందర్ రావు
Ramchander Rao | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలంగాణకు (Telangana) వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) అన్నారు. ఆయన తెలంగాణలో మీటింగ్ పెట్టుకుంటా అంటే అనవసరంగా రియాక్ట్ అయ్యారు. ఆయన సభకు అనుమతి ఇస్తే ఏమయ్యేది?
Ramchander Rao | త్రినేత్ర.న్యూస్: పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలంగాణకు (Telangana) వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) అన్నారు. ఆయన తెలంగాణలో మీటింగ్ పెట్టుకుంటా అంటే అనవసరంగా రియాక్ట్ అయ్యారు. ఆయన సభకు అనుమతి ఇస్తే ఏమయ్యేది?. ఈ ఇష్యూను బీజేపీ మీద ఎందుకు రుద్దుతున్నారు. తెలంగాణను వ్యతిరేకిందిచన వారికి మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారు? ఆంధ్ర వాళ్లకు వ్యతిరేకంగా భాగో అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. బీజేపీలో ఏ నాయకుడు, ఎన్డీయేలో ఏ నాయకుడూ తెలంగాణను, తెలంగాణ ప్రజలను ఎప్పుడూ అవమాన పరచేలేదు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీట్ దీ ప్రెస్ కార్యక్రమంలో రామచందర్‌రావు మాట్లాడారు.
`బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రజలు వారిని తిరస్కరించారు. అందుకే మళ్లీ తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ గెలిపించే వాతావరణం ఉంది కాబట్టే .. ప్రజలకు సంబంధం లేని అంశాన్ని ముందుకుతెచ్చి ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణ సెంటిమెంటును మళ్లీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ విషయంలో ఆయన సభకు అనుమతి అడిగారు. ఇస్తే అయిపోతుండే కదా?. సభ నిర్వహించుకోవడం ప్రతి ఒక్కరి హక్కు. ఆయన ఏదో మాట్లాడారు. దాన్ని తీసుకొచ్చి బీజేపీ మీద రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. నరేంద్ర మోదీ చంద్రబాబు ఇంటికి, పవన్ కల్యాణ్ ఇంటికి పోతేనే మీ గుండెల్లో ఇంత భయపడుతున్నారు. తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
సెంటిమెంటును రెచ్చగొడుతున్నారు..
తెలంగాణను వ్యతిరేకించిన, ఉద్యమంలో పాల్గొనని ఎంఐఎంతో బీఆర్ఎస్ ఎలా మద్దతు పెట్టుకుందని అడుగుతున్నా. తెలంగాణ వ్యతిరేకించిన, మిమ్మల్ని తిట్టిన కొట్టిన వారిని మీ పార్టీలో చేర్చుకుని మంత్రులను చేయలేదా? అధికారం రాగానే మీ ఇష్టం వచ్చినట్లు చేస్తారా?. ఆంధ్ర వాళ్లను జాగో, భాగో అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఏ చర్యలు తీసుకున్నారు?. ఈ రెండు పార్టీలు ప్రజల ఆంక్షాలను చేరుకోలేక, ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడంతో వారిని తిరస్కరించే పరిస్థితులు వచ్చాయి కాబట్టే తెలంగాణ సెంటిమెంటును తీసుకొచ్చి ఎవరినో ఒకరిని వాడుకుంటున్నారు. ప్రజల కోసం మేము పనిచేసుకుంటూ పోతుంటే.. రాజకీయ పబ్బం కోసం వాళ్లు ఒక వ్యక్తిని తీసుకొచ్చి తెలంగాణ సెంటిమెంటును వాడుతున్నారు.
తెలంగాణ, ఆంధ్రాలో రాజకీయ పరిస్థితులు వేరు. ఇక్కడి పరిస్థితులకు తాము ముందుకు వెళ్తాం. తమది జాతీయ పార్టీ. తాము ఎవరితో పొత్తు పెట్టుకోవాలో జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. ఎన్నికలకు ఇంకా మూడేండ్ల సమయం ఉంది. పీవీ నరసింహారావు రాంపేటలో (మహారాష్ట్ర) పోటీచేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన శరథ్ యాదవ్ బీహార్‌లో పోటీ చేశారు. కర్ణాటకకు చెందిన జార్జ్ ఫెర్నాండేజ్ బీహార్‌లో పోటీ చేసి అక్కడి నాయకుడు అయ్యారు. అందువల్ల ఈ దేశంలో ఎవరు ఎక్కడినుంచైనా పోటీ చేయొచ్చు. ప్రజలే నిర్ణయం తీసుకుంటారు.
కాక్రోచ్ పార్టీ వెనుక అర్బన్ నక్సల్స్
కాక్రోచ్ జనతా పార్టీ వెనుక అర్బన్ నక్సల్స్, కేజ్రీవాల్ లాంటి వాళ్లు ఉన్నారు. భారత దేశ ప్రజలు కాక్రోచ్‌లను హిట్‌తో చంపేస్తారు. భయపడాల్సిన పనేమీ లేదు. ఎలాంటి రాజకీయ పదవులు లేనివారే దీనికి మద్దతిస్తున్నారు. జెన్‌జీ ఎప్పుడూ ఈ దేశంతోనే ఉంటుందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ రెగ్యులర్‌గా జరిగే ప్రక్రియ అని, అది బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది కాదు. ఎలక్షన్ కమిషన్ ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నది. అయినా ఎస్ఐఆర్ ఇప్పుడే జరుగుతున్నది కాదు. దేశంలో ఇది 11వ సారి. గతంలో పార్టీలు ఎప్పుడూ దానిని వ్యతిరేకించలేదు. ఇప్పుడే మాత్రమే వ్యతిరేకిస్తున్నాయి. చివరిసారిగా 2002లో ఎస్ఐఆర్ జరిగింది. అంతకుముందు 10 సార్లు ఎస్ఐఆర్ అయింది. ఎవరూ మాట్లాడలేదు. రాహుల్ గాంధీ అప్పుడు బచ్చాగాడు. ఇప్పుడు పెద్దోడు అయ్యిండు. ఇప్పుడు అన్నీ తెలుస్తున్నయ్.
బండి భగీరథ్ విషయం పార్టీకి సంబంధం లేదు. బండి సంజయ్, ఈటల, ధర్మపురి ఆర్వింద్ మంచిగానే ఉన్నారు.
పవన్ కల్యాణ్ మీ అయ్యా జాగీరా అన్నరో? లేదో? మేము వినలే. మాకు తెల్వదు. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ మంత్రి ‘తెలంగాణ ఆయన జాగీరా’ అన్నట్లుగా విన్నాను. దానికి సమాధానంగానే సదరు వ్యక్తి ‘తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల జాగీరు’ అని అన్నారు. తెలంగాణను ఎవరు అవమాన పరిచినా, తెలంగాణ మనోభావాలను ఎవరు దెబ్బతీసినా దానిని బీజేపీ వ్యతిరేకిస్తుంది.` అని రామచందర్ రావు అన్నారు.
Live : State President Sri @N_RamchanderRao Garu’s Meet the Press at Press Club, Somajiguda https://t.co/5ulfZv4Z0t
— BJP Telangana (@BJP4Telangana) June 4, 2026
సంబంధిత వార్తలు

జెన్-జీ రూట్ వేరు… పొలిటీషియన్స్ మైండ్ సెట్ వేరు: యువత ‘హాష్‌ట్యాగ్’ విప్లవాన్ని పసిగట్టడంలో పాలకుల ఘోర వైఫల్యం!
ఆగస్టు 18, 2026

CM Revanth Reddy | ప్రజాపాలనలో వైద్యానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్‌రెడ్డి
ఆగస్టు 17, 2026

BUS and Lorry Accident | కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●Traffic Restrictions | ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●KBR Park | నేటి నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే
- ●Zodiac Signs | ఈ నాలుగు రాశుల వారు.. భర్తలను అదుపులో పెడుతారట..! మరి మీ రాశి ఉందా..?
- ●Horoscope | ఆగస్టు 18 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆకస్మిక లాభాలు..!
- ●జెన్-జీ రూట్ వేరు... పొలిటీషియన్స్ మైండ్ సెట్ వేరు: యువత 'హాష్‌ట్యాగ్' విప్లవాన్ని పసిగట్టడంలో పాలకుల ఘోర వైఫల్యం!
- ●HYDRA Prajavani Complaints | హైడ్రా కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు.. పార్కులనూ వదలట్లేదు

Traffic Restrictions | ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

KBR Park | నేటి నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే

Zodiac Signs | ఈ నాలుగు రాశుల వారు.. భర్తలను అదుపులో పెడుతారట..! మరి మీ రాశి ఉందా..?

Horoscope | ఆగస్టు 18 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆకస్మిక లాభాలు..!



