DK Shivakumar | డీకే కేబినెట్‌లో కొత్త ట్విస్ట్.. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే మంత్రి రాజీనామా
DK Shivakumar | డీకే శివకుమార్ (DK Shivakumar) నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే మంత్రివర్గంలో (DKS cabinet) ముసలం మొదలైంది. ఓ మంత్రి తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తితో మంత్రి పదవికి రాజీనామా చేయడం హాట్‌టాపిక్ అవుతోంది.
DK Shivakumar | కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీకే శివకుమార్ (DK Shivakumar) నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరిన రెండు రోజుల్లోనే మంత్రివర్గంలో (DKS cabinet) ముసలం మొదలైంది. ముఖ్యంగా మత్రులకు శాఖల కేటాయింపు విషయం రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. తాజాగా ఓ మంత్రి తనకు కేటాయించిన శాఖపై తీవ్ర అసంతృప్తితో మంత్రి పదవికి రాజీనామా చేయడం హాట్‌టాపిక్ అవుతోంది.
కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా రెండు రోజుల క్రితం డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో డీకేతోపాటూ మొత్తం 14 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వారికి శాఖలు కేటాయించారు. అయితే, తనకు కేటాయించిన శాఖ (portfolio)పై సీనియర్ నేత, మంత్రి రామలింగారెడ్డి (Ramalinga Reddy) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రెండోరోజే కేబినెట్ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా రామలింగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వంలో తాను ఎప్పుడూ కీలక పదవులు ఆశించలేదన్నారు. కానీ తనకు బెంగళూరు డెవలప్‌మెంట్ శాఖను ఇస్తానని డీకే శివకుమార్ స్వయంగా రెండుసార్లు హామీ ఇచ్చారని రెడ్డి చెప్పారు. ఆ తర్వాత తనకు సాగునీటి శాఖను కేటాయించారని.. ఇది తనకు నచ్చలేదని ఆయన పేర్కొన్నారు. "డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు మా ఇంటికి వచ్చారు. నాకు బెంగళూరు డెవలప్‌మెంట్ శాఖను కేటాయిస్తానని చెప్పారు. నేను ముఖ్యమంత్రిని ఏ శాఖా అడగలేదు. ఆయనే స్వయంగా ఈ ప్రతిపాదన చేశారు. అందుకు నేను కూడా సరే అని అన్నాను. ఆ తర్వాత నాకు సాగునీటి శాఖను కేటాయించారు. ఇది నాకు నచ్చలేదు. అందుకే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను" అని రామలింగారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
సమస్యను పరిష్కరిస్తా.. డీకే
ఇక రామలింగారెడ్డి రాజీనామాపై ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ఆయన సీనియర్ నేత అని సమస్యను ఆయనతో మాట్లాడి పరిష్కరించుకుంటామని చెప్పారు. "రామలింగారెడ్డి సీనియర్ నాయకుడు.. నా ఆప్తమిత్రుడు. సమస్యను పరిష్కరిస్తాము" అని డీకే శివకుమార్ పేర్కొన్నారు.
Also Read..
బీజేపీకి అన్నామలై రాజీనామా.. ఆమోదించిన అధిష్ఠానం
స్పామ్ కాల్స్‌కు చెక్.. ఇలా చేస్తే వేధింపులకు బ్రేక్..
లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. కీలక వడ్డీ రేట్లు మూడోసారీ యథాతథం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి
- ●Bhagyashri Borse | అప్పుడు గెస్ట్ రోల్...ఇప్పుడు హీరోయిన్ - బాలీవుడ్ వయలెంట్ లవ్‌స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే?
- ●TRP Free Coaching | నిరుద్యోగ యువతకు టీఆర్పీ వరం.. కరీంనగర్లో 100 రోజుల ఉచిత కోచింగ్
- ●Rakesh Kumar | విలువైన పాలిటెక్నిక్ కాలేజీల భూముల కోసమే జీవో 97 : చిరుమళ్ల రాకేశ్ కుమార్
- ●Reliance Industries | ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 30 ఏళ్లలో రూ.2.73 లక్షల కోట్లు..

Stock Markets | స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్ల ఉత్సాహం.. భారీ లాభాల్లో ముగిసిన సూచీలు..

Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

Bhagyashri Borse | అప్పుడు గెస్ట్ రోల్...ఇప్పుడు హీరోయిన్ - బాలీవుడ్ వయలెంట్ లవ్‌స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే?

TRP Free Coaching | నిరుద్యోగ యువతకు టీఆర్పీ వరం.. కరీంనగర్లో 100 రోజుల ఉచిత కోచింగ్





