Donald Trump | మోదీ నాకు గుడ్ ఫ్రెండ్.. భారత్‌తో త్వరలోనే బిగ్ డీల్ : ట్రంప్
Donald Trump | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తనకు మంచి మిత్రుడని (good friend) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. భారత్-అమెరికా మధ్య త్వరలోనే కీలక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
International | Published On Jun 5, 2026, 1.55 pm IST
Donald Trump | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తనకు మంచి మిత్రుడని (good friend) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. మోదీ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అదే సమయంలో భారత్ అమలు చేస్తున్న సుంకాల విధానంపై ట్రంప్ విమర్శలు గుప్పించారు.
ఎన్నో ఏళ్లుగా అమెరికాపై అధిక సుంకాలు విధించి భారత్ చాలా లబ్ధి పొందిందన్నారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందన్నారు. అందుకే 'అమెరికా ఫస్ట్' విధానంలో భాగంగానే తాము కూడా ప్రతిగా సుంకాలు విధించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌తో జరిగే వాణిజ్యంలో అమెరికా గణనీయమైన ప్రయోజనాలు పొందుతోందని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంగా భారత్-అమెరికా మధ్య త్వరలోనే కీలక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం కీలక చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ చర్చలు ఇప్పటికే 99 శాతం పూర్తైనట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) ఇటీవలే ప్రకటించారు కూడా.
Also Read..
జాతీయ పార్టీలపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు
కొత్త రాజకీయ ఉద్యమాన్ని మొదలు పెట్టబోతున్నా.. అన్నామలై కీలక ప్రకటన
మరో 1597 పోస్టులతో నోటిఫికేషన్లు.. సిద్ధమవుతున్న టీజీపీఎస్సీ!
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- ●Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- ●Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..
- ●BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్
- ●Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని
- ●Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్

Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..

BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్






