త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MK Stalin | ఇదే నా చివ‌రి హెచ్చ‌రిక‌.. బిల్లుపాసైతే త‌మిళ‌నాడు స్తంభించిపోతుంది.. కేంద్రానికి సీఎం స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్‌

MK Stalin | డీలిమిటేష‌న్ అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్ర హెచ్చ‌రిక‌లు చేశారు.

D

National | Published On Apr 14, 2026, 2.55 pm IST

MK Stalin | ఇదే నా చివ‌రి హెచ్చ‌రిక‌.. బిల్లుపాసైతే త‌మిళ‌నాడు స్తంభించిపోతుంది.. కేంద్రానికి సీఎం స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్‌
Advertisement

MK Stalin | చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ (Delimitation) బిల్లుల ఆమోదం కోసం కేంద్రంలోని మోదీ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందుకోసం ఏప్రిల్ 16,17,18 తేదీల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తోంది. దీంతో ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఈ బిల్లుల‌పై తీవ్రంగా చ‌ర్చ న‌డుస్తోంది. ముఖ్యంగా సౌత్ స్టేట్స్‌లో డీలిమిటేష‌న్ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేప‌థ్యంలో డీలిమిటేష‌న్ అంశంపై కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్ర హెచ్చ‌రిక‌లు చేశారు.

త‌మిళ‌నాడు, బెంగాల్ ఎన్నిక‌ల్లో ల‌బ్ధి కోస‌మే కేంద్ర ప్ర‌భుత్వం డీలిమిటేష‌న్‌ను తెర‌పైకి తెచ్చింద‌ని స్టాలిన్ ఆరోపించారు. దీని వ‌ల్ల కుటుంబ నియంత్ర‌ణ పాటించిన ద‌క్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా న‌ష్ట‌పోతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లును కేంద్ర ప్ర‌భుత్వం బ‌ల‌వంతంగా ఆమోదించాల‌ని భావిస్తోంద‌ని మండిప‌డ్డారు. ఈ మేర‌కు కేంద్రంలోని మోదీ స‌ర్కార్‌కు తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లు పాస్ చేస్తే భారీ ఎత్తున ఉద్య‌మం చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు.

"కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. రెండు రోజుల్లో జరగబోయే పార్లమెంటు ప్ర‌త్యేక‌ సమావేశాల్లో మా ఎంపీలు పాల్గొంటారు. ఈ స‌మావేశాల్లో ద‌క్షిణాది రాష్ట్రాల‌కు న‌ష్టం క‌లిగించే నిర్ణ‌యాలు తీసుకుంటే మేము మౌనంగా ఉండ‌ము. త‌మిళ‌నాడు స్తంభించిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున‌ నిర‌స‌న‌ను తీవ్రం చేస్తాం. ప్ర‌తీ కుటుంబం వీధుల్లోకి వ‌స్తుంది. 1960 నాటి డీఏంకేను మళ్లీ పరిచయం చేస్తాం. కేంద్రానికి, ప్ర‌ధానికి ఇదే నా చివ‌రి హెచ్చ‌రిక" అని స్టాలిన్ తీవ్ర స్వ‌రంతో హెచ్చ‌రించారు. ఈ మేర‌కు ఎక్స్‌లో వీడియో సందేశం పంచుకున్నారు.

Also Read..

ద‌క్షిణాది ప్ర‌జ‌ల్లో సీఎం రేవంత్ విద్వేషం ర‌గిలిస్తున్నాడు : బండి సంజ‌య్

ప‌శ్చిమాసియా యుద్ధం వ‌ల్ల భారత్‌లో భారీగా పెర‌గ‌నున్న పేద‌రికం.. యూఎన్‌డీపీ అంచ‌నా..

మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.2 వేలు, ఏడాదికి 3 ఉచిత ఎల్పీజీ సిలిండ‌ర్లు.. త‌మిళ‌నాట బీజేపీ హామీల వ‌ర్షం

Advertisement
Advertisement