త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Sanjay | ద‌క్షిణాది ప్ర‌జ‌ల్లో సీఎం రేవంత్ విద్వేషం ర‌గిలిస్తున్నాడు : బండి సంజ‌య్

Bandi Sanjay | డీలిమిటేష‌న్, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి ద‌క్షిణాది ప్ర‌జ‌ల్లో విద్వేషం ర‌గిలిస్తున్నాడ‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ నిప్పులు చెరిగారు. ఇవాళ రాజ్యాంగానికి అనుగుణంగా న‌డుస్తున్న పార్టీ, ప్ర‌భుత్వం బీజేపీ అని ఆయ‌న పేర్కొన్నారు.

S

Telangana | Published On Apr 14, 2026, 2.52 pm IST

Bandi Sanjay | ద‌క్షిణాది ప్ర‌జ‌ల్లో సీఎం రేవంత్ విద్వేషం ర‌గిలిస్తున్నాడు : బండి సంజ‌య్
Advertisement

Bandi Sanjay | త్రినేత్ర‌.న్యూస్ : డీలిమిటేష‌న్, మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి ద‌క్షిణాది ప్ర‌జ‌ల్లో విద్వేషం ర‌గిలిస్తున్నాడ‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ నిప్పులు చెరిగారు. ఇవాళ రాజ్యాంగానికి అనుగుణంగా న‌డుస్తున్న పార్టీ, ప్ర‌భుత్వం బీజేపీ అని ఆయ‌న పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై బండి సంజ‌య్ ఈ విధంగా స్పందించారు.

బండి సంజ‌య్ ఏమ‌న్నారంటే..?

'డీలిమిటేష‌న్, మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌కు సంబంధించి భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఎక్క‌డ పేరు వ‌స్త‌దో అని భ‌య‌ప‌డి ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రాల ప్ర‌జ‌ల్లో లోప‌ల ఒక విద్వేషం ర‌గిలించే ప్ర‌య‌త్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. డీలిమిటేష‌న్ వ‌ల్ల జ‌రిగే న‌ష్టం ఏంటో ఇప్ప‌టికే రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేయ‌డం లేదు. బీజేపీని, న‌రేంద్ర మోదీని విమ‌ర్శించ‌డం, కిష‌న్ రెడ్డిని త‌న‌ను ఆడిపోసుకుంటున్నారు.

అన్ని రాష్ట్రాల్లో 50 శాతం సీట్ల‌ను పెంచ‌డాన్ని మీరు వ్య‌తిరేకిస్తారా..? వెనుక‌బ‌డ్డ పాల‌మూరు, ఆదిలాబాద్ జిల్లాల్లో సీట్లు పెంచ‌డం త‌ప్పా.? దేశ వ్యాప్తంగా ఒక‌టే క్రైటేరియా తీసుకుంటున్నాం. తెలంగాణ‌కు ఒక‌ర‌కంగా, ఏపీకి ఒక‌రకంగా, ముంబైకి ఒక‌ర‌కంగా తీసుకోవ‌డం లేదు. అంటే మీ ఉద్దేశం ఏంటి ముంబైలో సీట్లు పెర‌గొచ్చు కానీ.. తెలంగాణ సీట్లు పెర‌గొద్ద‌నేది మీ ఉద్దేశ‌మా..? చెప్పండి.

ఈ దేశానికి ర‌క్ష‌ణ, దిశ‌ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ అందించిన రాజ్యాంగం అని మీరు గుర్తుంచుకోండి. అంబేద్క‌ర్ సిద్ధాంతాన్ని చంపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అంబేద్క‌ర్ బ‌తికున్న‌ప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆయ‌న‌ను అవ‌మాన‌ప‌రిచింది. అంబేద్క‌ర్ ర‌చించిన రాజ్యాంగంలో ఓటు హ‌క్కు, డీలిమిటేష‌న్ గురించి చ‌ద‌వండి.. ఇప్ప‌టికైనా వాస్త‌వాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయండి. రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్న పార్టీ బీజేపీ. అలాంటి ప్ర‌భుత్వం ఇవాళ న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం. కాబ‌ట్టి అన్ని రాష్ట్రాల‌ను స‌మానంగా చూడాల‌నే దృక్ప‌థంతో శ‌క్తివంత‌మైన భార‌త‌దేశ నిర్మాణం కోసం ఇవాళ న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం ముందుకు వ‌స్తున్న విష‌యాన్ని మీరు గుర్తుంచుకోవాలి' అని బండి సంజ‌య్ అన్నారు.

Advertisement
Advertisement