West Asia War | పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత్‌లో భారీగా పెరగనున్న పేదరికం.. యూఎన్‌డీపీ అంచనా..
West Asia War | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, సైనిక ఉద్రిక్తతలు భారత్‌పై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి అంచనాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల కారణంగా భారత్‌లో సుమారు 25 లక్షల మంది పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని పేర్కొంది.
West Asia War | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, సైనిక ఉద్రిక్తతలు భారత్‌పై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి అంచనాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల కారణంగా భారత్‌లో సుమారు 25 లక్షల మంది పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని పేర్కొంది. అంతేకాకుండా దేశ మానవ అభివృద్ధి ప్రగతిపై కూడా కొంత ప్రభావం పడే అవకాశం ఉందని వెల్లడించింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (UNDP) విడుదల చేసిన పశ్చిమ ఆసియా సైనిక ఉద్రిక్తతలు: ఆసియా-పసిఫిక్ ప్రాంతంపై మానవ అభివృద్ధి ప్రభావాలు అనే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఘర్షణల ప్రభావం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మానవ అభివృద్ధిపై ఒత్తిడిని పెంచుతోందని నివేదిక పేర్కొంది.
ప్రపంచ వ్యాప్తంగా 88 లక్షల మంది పేదరికంలోకి..
ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, ముడి పదార్థాల వ్యయాలు పెరగడం వల్ల కుటుంబాల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. దీనితోపాటు ఆహార భద్రత సమస్యలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులు ఒత్తిడికి లోనవుతున్నాయి. జీవనోపాధులు బలహీనపడుతున్నాయని నివేదిక వివరించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 88 లక్షల మంది పేదరికంలోకి వెళ్లే ప్రమాదంలో ఉన్నారు. ఈ పశ్చిమ ఆసియా ఘర్షణ ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి మొత్తం 299 బిలియన్ డాలర్ల వరకు నష్టం కలిగించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. భారత్‌లో పేదరికంలోకి వెళ్లే వారి సంఖ్య సుమారు 4 లక్షల నుంచి 25 లక్షలకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘర్షణ కారణంగా పేదరికంలోకి వెళ్లే వారి సంఖ్య 19 లక్షల నుంచి దాదాపు 88 లక్షల వరకు పెరిగే అవకాశముందని పేర్కొంది. ఇందులో దక్షిణాసియా ప్రాంతం అత్యధిక ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని, ఈ ప్రాంతంలో 17 లక్షల నుంచి 80 లక్షలకు పైగా మంది పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని వెల్లడించింది.

భారత్‌లో పెరగనున్న పేదరికం..
చైనాలో పేదరికంలోకి వెళ్లే వారి సంఖ్య 1.15 లక్షల నుంచి 6.2 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అది మొత్తం జనాభాతో పోలిస్తే తక్కువ శాతం మాత్రమేనని నివేదిక పేర్కొంది. 28 రోజుల ఘర్షణ (తీవ్ర పరిస్థితి, 8 నెలల ప్రభావంతో) ఆధారంగా చేసిన అంచనాల ప్రకారం భారత్‌లో పేదరిక శాతం 23.9 నుంచి 24.2 కు పెరిగే అవకాశం ఉందని తేలింది. దీంతో సుమారు 24,64,698 మంది అదనంగా పేదరికంలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని వెల్లడైంది. మొత్తం పేదరికంలో జీవించే జనాభా 351 మిలియన్ల నుంచి 354 మిలియన్లకు పెరిగే అవకాశముందని తెలిపింది. ఈ ఘర్షణ మానవ అభివృద్ధి సూచిక (HDI)పై కూడా ప్రభావం చూపుతుందని UNDP విశ్లేషణ సూచించింది. ఇరాన్‌లో HDI సుమారు 1 నుంచి 1.5 సంవత్సరాల అభివృద్ధి వెనక్కి వెళ్లే అవకాశం ఉండగా, భారత్‌లో సుమారు 0.03 నుంచి 0.12 సంవత్సరాల అభివృద్ధి తగ్గుదల ఉండొచ్చని అంచనా వేసింది. నేపాల్‌లో 0.02 నుంచి 0.09 సంవత్సరాలు, వియత్నాంలో 0.02 నుంచి 0.07 సంవత్సరాలు తగ్గుదల ఉండొచ్చని తెలిపింది. చైనాలో ప్రభావం తక్కువగా 0.01 నుంచి 0.05 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొంది.
బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపైనే..
భారత్ తన చమురు అవసరాల్లో 90 శాతానికి పైగా దిగుమతులపై ఆధారపడుతోంది. అందులో 40 శాతానికి పైగా క్రూడ్ ఆయిల్, 90 శాతం ఎల్పీజీ దిగుమతులు పశ్చిమ ఆసియా నుంచి వస్తున్నాయి. అలాగే ఎరువుల దిగుమతుల్లో 45 శాతానికి పైగా ఈ ప్రాంతం నుంచే వస్తుండగా, దేశీయ యూరియా ఉత్పత్తిలో 85 శాతం దిగుమతి ఎల్‌ఎన్‌జీపై ఆధారపడుతోంది. ఈ పరిస్థితుల్లో ఎల్‌ఎన్‌జీ ధరలు పెరగడంతో భారత్ సహా థాయిలాండ్, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశాలు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడుతున్నాయి. వ్యాపారం, సప్లై చెయిన్‌లపై కూడా తీవ్ర ప్రభావం పడుతున్నట్లు నివేదిక పేర్కొంది. 36 దేశాల్లో 25 దేశాలకు రవాణా ఖర్చులు, యుద్ధ ప్రమాద బీమా ప్రీమియంలు, మార్గమార్పులు, సరుకు ఆలస్యం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి.
ఆహార భద్రతపై ప్రభావం..
భారత్‌కు పశ్చిమ ఆసియా మార్కెట్లు 14 శాతం ఎగుమతులు, 20.9 శాతం దిగుమతుల్లో భాగం కలిగి ఉన్నాయి. బాస్మతి బియ్యం, టీ, రత్నాలు, వస్త్రాలు వంటి ఉత్పత్తుల్లో సుమారు 48 బిలియన్ డాలర్ల నాన్-ఆయిల్ ఎగుమతులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ కూడా గల్ఫ్ విమాన సర్వీసులు రద్దు కావడం వల్ల సరుకు రవాణాలో అంతరాయం ఎదుర్కొంటోంది. ఆహార భద్రతపై కూడా ప్రభావం పెరిగే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో గల్ఫ్ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు తగ్గడం వల్ల రిమిటెన్సులు తగ్గి కుటుంబాల ఆదాయంపై ప్రభావం పడవచ్చని తెలిపింది. భారత్‌లో ఈ పరిస్థితి ఖరీఫ్ పంటల సీజన్ ప్రారంభానికి సమీపంలో ఉండటం వల్ల మరింత కీలకంగా మారింది. ప్రస్తుతం యూరియా నిల్వలు 6.114 మిలియన్ టన్నులుగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక అంతరాయం ఉంటే వ్యవసాయంపై ప్రభావం తప్పదని పేర్కొంది.

భారీగా తగ్గిన రిమిటెన్సులు..
రిమిటెన్సులు, వలస కార్మికులపై కూడా ప్రభావం ఉందని నివేదిక తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం 2024 అక్టోబర్ నాటికి గల్ఫ్ దేశాల్లో 9.37 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరు భారత్‌కు వచ్చే మొత్తం రిమిటెన్సుల్లో 38-40 శాతం పంపిస్తున్నారు. ఈ ఘర్షణ కారణంగా ఉపాధి అవకాశాలు కూడా ప్రభావితమవుతున్నాయి. ముఖ్యంగా దిగుమతి ఇంధనం, ముడి పదార్థాలపై ఆధారపడే ఎంఎస్‌ఎంఈ రంగాలు, గల్ఫ్ మార్కెట్లపై ఆధారపడే వ్యాపారాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. భారత్‌లో సుమారు 90 వాతం ఉపాధి అసంఘటిత రంగంలో ఉండటంతో ప్రభావం మరింత తీవ్రతరం కానుంది. హాస్పిటాలిటీ, ఫుడ్ ప్రాసెసింగ్, నిర్మాణ సామగ్రి, ఉక్కు పరిశ్రమలు, వజ్రాలు-రత్నాల రంగాల్లో చిన్న సంస్థలు అధిక ఖర్చులు, సరఫరా సమస్యలు, ఆర్డర్ ఆలస్యం వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఉద్యోగాల కోత, పనిగంటల తగ్గింపు, వ్యాపార అంతరాయాలు సంభవిస్తాయి.
దీర్ఘకాలిక స్థిరత్వం పెంపొందించుకునే అవకాశం..
అదేవిధంగా హోర్ముజ్ జలసంధి పరిణామాల కారణంగా మెడికల్ పరికరాల ముడి పదార్థాల ఖర్చు సుమారు 50 శాతం వరకు పెరగవచ్చని, ఔషధాల హోల్‌సేల్ ధరలు ఇప్పటికే 10-15 శాతం పెరిగాయని నివేదిక తెలిపింది. అయితే ఈ సంక్షోభం దేశాలకు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని పెంపొందించుకునే అవకాశాలను కూడా కల్పిస్తుందని UNDP ఆసియా-పసిఫిక్ ప్రాంత డైరెక్టర్ కన్నీ విగ్నరాజా తెలిపారు. సామాజిక రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రాంతీయ సప్లై చెయిన్‌లను అభివృద్ధి చేయడం, ఇంధనం, ఆహార వ్యవస్థలను విభిన్నీకరించడం ద్వారా భవిష్యత్ ప్రమాదాలను తగ్గించవచ్చని ఆమె పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

OMC Shares | పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఎఫెక్ట్.. భారీగా పతనమైన ఓఎంసీల షేర్లు..
మే 15, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



