BJP Manifesto | మహిళలకు నెలకు రూ.2 వేలు, ఏడాదికి 3 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు.. తమిళనాట బీజేపీ హామీల వర్షం
BJP Manifesto | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఎలాగైన అధికారంలోకి రావాలని చూస్తున్న కమలం పార్టీ అక్కడ ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా గెలుపే లక్ష్యంగా హామీల వర్షం కురిపిస్తోంది.
BJP Manifesto | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఎలాగైన అధికారంలోకి రావాలని చూస్తున్న కమలం పార్టీ అక్కడ ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా గెలుపే లక్ష్యంగా హామీల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఎన్నికల కోసం బీజేపీ తన మేనిఫెస్టోను (BJP Manifesto) ఇవాళ విడుదల చేసింది. ప్రజా సంక్షేమం, మెరుగైన వైద్యం, రైతులు, మహిళల కోసం కీలక హామీలు ప్రకటించింది. “లోటస్ ప్రామిస్ 2026” పేరుతో ఈ మేనిఫెస్టోను పార్టీ మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు.
ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. మహిళలకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం, ఏడాదికి 3 ఉచిత LPG సిలిండర్లు, ప్రతీ కుటుంబానికి ఒకసారి రూ. 10,000 సాయం, అర్హులైన మహిళలు ఈ-స్కూటర్లు కొనుగోలు చేయడానికి రూ. 25,000 సబ్సిడీ, స్వయం సహాయక సంఘాలు, MSME లకు రూ. 50 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, సంప్రదాయ జల్లికట్టు కోసం ఎద్దులను పెంచే వారికి నెలకు రూ. 2,000 ఆర్థిక సాయం, జల్లికట్టులో పాల్గొని మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇళ్లు కొనుగోలు చేసే మహిళలకు 3 శాతం స్టాంప్ డ్యూటీ రాయితీ, ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ₹5 లక్షల ఉచిత వైద్య సహాయం, గృహోపకరణాల కొనుగోలు కోసం రూ. 8,000 విలువైన కూపన్ల పంపిణీ వంటి హామీల వర్షం కురిపించింది.
అంతేకాదు, కేంద్ర పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆల్రెడీ రూ.6000 ఇస్తున్నారు. ఇప్పుడు అదనంగా మరో రూ.3వేల అంటే మొంత్తం రూ.9,000 ఇస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థినులు, మహిళల భద్రత కోసం బస్సులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, జీరో ఎఫ్ఐఆర్ విధానం అమలు, నేర విచారణలు వెంటనే జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల్లో స్థానిక నివాసితుల కోసం ప్రతిరోజూ రెండు గంటల పాటూ ప్రత్యేక దర్శన స్లాట్‌లను కేటాయిస్తామని హామీ బీజేపీ హామీ ఇచ్చింది. తిరుపరంకుండ్రం కొండపై దీపారాధనతో సహా కార్తీక దీపం ఆచారాలను యథావిధిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. తమిళ నూతన సంవత్సరం రోజున మేనిఫెస్టోను విడుదల చేయడం శుభసూచికం అని ఈ సందర్భంగా నడ్డా తెలిపారు.
Also Read..
ఆర్ఆర్ఆర్ తర్వాత మరో తెలుగు సినిమాలో ఆలియా - ఎన్టీఆర్ డ్రాగన్‌పై క్రేజీ రూమర్ వైరల్
బర్గర్ ఆర్డర్ చేసిన ట్రంప్.. డెలివరీ చేసిన వ్యక్తికి టిప్‌గా ఎంత ఇచ్చారంటే..?
అల్లర్ల వేళ యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కార్మికుల వేతనాలు 21 శాతం పెంపు
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

MK Stalin | విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
మే 19, 2026

MK Stalin | పేరు ప్రస్తావించకుండానే.. విజయ్‌పై విమర్శల దాడిని ప్రారంభించిన స్టాలిన్..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



