Shankar Goud | ముత్తోజిపేటకు ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతదేహం.. మధ్యాహ్నం అంత్యక్రియలు
Shankar Goud | త్రినేత్ర.న్యూస్: ఆర్టీసీ సమ్మె (RTC Strike) నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ (Shankar Goud) మృతదేహం తన అల్లుడి స్వగ్రామానికి చేరుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట (Narsampet) మండలం ముత్తోజిపేటకు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు.
Shankar Goud | త్రినేత్ర.న్యూస్: ఆర్టీసీ సమ్మె (RTC Strike) నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్‌గౌడ్ (Shankar Goud) మృతదేహం తన అల్లుడి స్వగ్రామానికి చేరుకుంది. వరంగల్ జిల్లా నర్సంపేట (Narsampet) మండలం ముత్తోజిపేటకు ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.
సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో నర్సంపేట డిపోలో డ్రైవర్ శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకున్నారు. దీంతో 80 శాతం కాలిపోవడంతో, మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్‌లోని డీఆర్డీవో అపోలో దవాఖానకు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. దీంతో పోస్టుమార్టం పూర్తి చేసి, ఆయన మృతదేహాన్ని ముత్తోజీపేటకు పోలీసులు బందోబస్తుతో పంపించారు.

కాగా, ప్రభుత్వంతో చర్చలకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న తెలిపారు. శంకర్‌గౌడ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ద్వితీయశ్రేణి జేఏసీ నేతలు వెళ్తారన్నారు. సచివాలయంలో ఉదయం 10 గంటలకు ఉద్యోగ సంఘాలతో సీనియర్ ఐఏఎస్ కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. తొలుత ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ కమిటీ సమావేశమవుతుంది. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు.
సంబంధిత వార్తలు

Padi Kaushik Reddy | బండి సంజయ్‌ను ఎందుకు అరెస్టు చేయరు..? సీఎం రేవంత్‌ను నిలదీసిన పాడి కౌశిక్ రెడ్డి
మే 7, 2026

Revanth Reddy | ఏ ఒక్కరినీ ఉద్యోగం నుంచి తొలగించేది లేదు.. ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం రేవంత్ భరోసా
మే 2, 2026

RTC Driver | చెప్పుతో కొట్టి.. గొంతు పట్టి.. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి..
ఏప్రిల్ 26, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



