త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hybrid Funds | నెల‌కు రూ.1000 సిప్ (SIP) వేస్తే రూ.15 ల‌క్ష‌లు రాబ‌డి.. మార్కెట్ ఎలా ఉన్నా లాభం ప‌క్కా..

Hybrid Funds | స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ఉన్న‌ప్పుడు మ్యుచువ‌ల్ ఫండ్స్ పెట్టుడిదారుల్లో ఆందోళ‌న‌లు నెల‌కొంటాయి. తాము పెట్టిన ఫండ్స్ న‌ష్టాల్లోకి చేరుకుంటాయ‌ని అనుమానాలు వ్య‌క్తం చేస్తుంటారు. అందుక‌నే అన్ని మార్కెట్ల‌కు త‌గిన విధంగా ఉండే ఫండ్స్‌ను ఎంచుకుని పెట్టుబ‌డులు పెడుతుంటారు.

S

Business | Published On Apr 24, 2026, 10.25 am IST

Hybrid Funds | నెల‌కు రూ.1000 సిప్ (SIP) వేస్తే రూ.15 ల‌క్ష‌లు రాబ‌డి.. మార్కెట్ ఎలా ఉన్నా లాభం ప‌క్కా..
Advertisement

Hybrid Funds | స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ఉన్న‌ప్పుడు మ్యుచువ‌ల్ ఫండ్స్ పెట్టుడిదారుల్లో ఆందోళ‌న‌లు నెల‌కొంటాయి. తాము పెట్టిన ఫండ్స్ న‌ష్టాల్లోకి చేరుకుంటాయ‌ని అనుమానాలు వ్య‌క్తం చేస్తుంటారు. అందుక‌నే అన్ని మార్కెట్ల‌కు త‌గిన విధంగా ఉండే ఫండ్స్‌ను ఎంచుకుని పెట్టుబ‌డులు పెడుతుంటారు. అయితే మార్కెట్ ఎలా ఉన్నా స‌రే లాభాల‌ను మాత్రం నిర్దిష్టంగా ఇచ్చే ఫండ్స్ కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ ఒక‌టి. ఇందులో నెల‌కు కేవ‌లం రూ.1000 ని SIP రూపంలో పెట్టుబ‌డి పెడితే దీర్ఘ‌కాలంలో రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు రాబ‌డిని పొందే అవ‌కాశం ఉంద‌ని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక మార్కెట్ అస్థిరంగా ఉన్న‌ప్పుడు కూడా ఈ ఫండ్‌లో మంచి లాభాలు వ‌చ్చాయి.

మార్కెట్ అస్థిరంగా ఉన్న‌ప్ప‌టికీ..

ఈ ఫండ్ ఈక్విటీ, డెట్ విభాగాల్లో స‌మ‌తుల్య పెట్టుబ‌డుల‌ను కొన‌సాగిస్తోంది. ఈక్విటీల్లో 65 నుంచి 80 శాతం వ‌ర‌కు, డెట్‌లో 20 నుంచి 30 శాతం వ‌ర‌కు పెట్టుబ‌డుల‌ను క‌లిగి ఉంది. ఈక్విటీల‌తోపాటు డెట్‌లోనూ ఫండ్స్‌ను పెట్టుబ‌డి పెడుతున్నారు క‌నుక మార్కెట్ అస్థిరంగా ఉన్న స‌మ‌యంలోనూ లాభాలు వ‌స్తాయి. పెట్టుబ‌డిదారులు ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. ఇక ఈ ఫండ్ నేరుగా ఈక్విటీలు, డెట్‌ల‌లో పెట్టుబ‌డి పెట్ట‌దు. ఇత‌ర మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెడుతుంది. అంటే ఇది ఒక ర‌కంగా చెప్పాలంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్ అన్న‌మాట‌. ఈ వ్యూహం వ‌ల్ల రిస్క్ చాలా వ‌ర‌కు త‌గ్గుతుంది. ఈ ఫండ్ 2003 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఏటా 14 శాతం రిట‌ర్న్స్‌ను అందిస్తూ వ‌స్తోంది. నిఫ్టీ200 విస్తృత సూచీ క‌న్నా ఈ ఫండ్ అధిక మొత్తంలో లాభాల‌ను ఇచ్చింది.

20 సంవ‌త్స‌రాల్లో రూ.15 ల‌క్ష‌లు..

గ‌త 10 సంవ‌త్స‌రాల్లో ఇందులో నెల‌కు రూ.1000 పెట్టుబ‌డిని SIP గా పెట్టి ఉంటే మొత్తం పెట్టుబ‌డి రూ.1.20 ల‌క్ష‌లు అయ్యేది. కానీ రాబ‌డి మాత్రం రెట్టింపు అయ్యేది. రూ.1.20 ల‌క్ష‌ల పెట్టుబ‌డికి రూ.2.1 ల‌క్ష‌ల రాబ‌డిని ఇచ్చి ఉండేది. ఇక ఇదే ఫండ్‌లో నెల‌కు రూ.1000 చొప్పున పెట్టుబ‌డిని SIP 20 సంవ‌త్స‌రాల పాటు పెట్టుబ‌డి పెడితే పెట్టిన మొత్తం రూ.2.40 ల‌క్ష‌లు అవుతుంది. అలాగే రాబ‌డి రూ.13.27 ల‌క్ష‌లు అవుతుంది. ఇలా దీర్ఘ‌కాలంలో ఈ ఫండ్ అధిక మొత్తంలో లాభాల‌ను అందిస్తుంది. కాంపౌండింగ్ శ‌క్తి వ‌ల్ల ఫండ్ దీర్ఘ‌కాలంలో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తుంది. అయితే ఏ ఫండ్స్ లో అయినా స‌రే పెట్టుబ‌డి పెట్టేముందు పూర్తి వివ‌రాల‌ను తెలుసుకోవ‌డం మంచిది. ఫండ్ ఏ ర‌కంగా పెట్టుబ‌డులు పెడుతుంది, ఫీజు ఎంత ఉంటుంది, రాబ‌డి ఎలా వ‌స్తుంది, ఫండ్‌లో ఏయే అంశాలు ఉంటాయి.. వంటి వివ‌రాల‌ను తెలుసుకున్నాకే పెట్టుబ‌డులు పెట్టాలి. ఒక వేళ అవ‌గాహ‌న లేక‌పోతే ఆర్థిక నిపుణులను సంప్ర‌దించి పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచిది. లేదంటే రిస్క్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement