Vaazha 2 Review | వాలా 2 రివ్యూ – 10 కోట్ల బడ్జెట్ – 200 కోట్ల కలెక్షన్స్ – మలయాళం బ్లాక్‌బస్టర్ మూవీ ఎలా ఉందంటే?
ఈ ఏడాది మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన వాలా 2 అదే పేరుతో తెలుగులో రిలీజైంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Entertainment | Published On Apr 24, 2026, 10.09 am IST
Vaazha 2 Review | ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా వాలా 2 నిలిచింది. కొత్త హీరోలతో కేవలం పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిన్న సినిమా ఏకంగా 210 కోట్లకుపైగా వసూళ్లతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వాలా 2 సినిమా అదే పేరుతో శుక్రవారం తెలుగులో రిలీజైంది. సోషల్ మీడియా స్టార్స్ హషీర్, అలెన్, వినాయక్, అజీన్ హీరోలుగా నటించిన ఈ మూవీకి సావిన్ దర్శకత్వం వహించాడు. ఈ మలయాళం మూవీ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
నలుగురు కుర్రాళ్ల కథ....
హషీర్, అలెన్, అజిన్, వినాయక్ ఒకే స్కూల్‌లో ట్వెల్త్ స్టాండర్డ్ చదువుతుంటారు. గొడవలతో మొదలై వారి బంధం ప్రాణ స్నేహంగా మారుతుంది. చదువును పక్కనపెట్టి నలుగురు స్నేహితులు జల్సాలు చేస్తుంటారు. అందరితో గొడవలు పడుతుంటారు. ఓ రోజు స్కూల్‌లో టీచర్ తలపగలగొడతారు. ఆ తగాదా పోలీస్ స్టేషన్ వరకు వెళుతుంది. గంజాయి బ్యాచ్ అంటూ ఊరివాళ్లంతా నలుగురిని ఎగతాళి చేస్తుంటారు. కష్టపడి ట్వెల్త్ స్డాండర్డ్ పాసై ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లాలని నిర్ణయించుకుంటారు. వారి కల తీరిందా? హషీర్‌ను వదిలిపెట్టి అలెన్, వినాయక్ యూకే, అజిన్...దుబాయ్‌కు ఎందుకు వెళ్లారు? విదేశాల్లో వారికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? షైనాను ఇష్టపడిన హషీర్ తన ప్రేమను ఎందుకు త్యాగం చేశాడు అన్నదే ఈ మూవీ కథ.
సోషల్ మీడియాలో ఫేమస్...
టీనేజ్ కుర్రాళ్ల సరదాలు, గొడవలు, ప్రేమకథలతో తెలుగుతో పాటు ఇతర భాషల్లో చాలానే సినిమాలు వచ్చాయి. వాలా 2 కూడా అలాంటి కథనే. వాలా మూవీకి సీక్వెల్‌గా దర్శకుడు సావిన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఫిక్షనల్ స్టోరీగా కాకుండా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన నలుగురు కుర్రాళ్లనే హీరోలుగా...వారి జీవితాలనే కథగా ఎంచుకొని ఈ సినిమాను రూపొందించారు.
చెడు వ్యసనాల బారిన పడి...
టీనేజ్ ఏజ్‌లో డ్రగ్స్, సిగరెట్ వంటి చెడు వ్యసనాల బారిన పడి చదువును నిర్లక్ష్యం చేసిన ఓ నలుగురు కుర్రాళ్లు చివరకు తమ తప్పులను సరిదిద్దుకున్నారు? తోబుట్టువుల కోసం ఎలాంటి త్యాగాలు చేశారన్నది ఎమోషనల్‌గా ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థుల వ్యథలను వాస్తవిక కోణంలో ఈ సినిమాలో చూపించారు.
సందేశం...
హషీర్, అలెన్, అజిన్, వినాయక్ అల్లరి పనులతో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంది. వారి లవ్‌స్టోరీస్ క్యూట్‌గా నడిపించారు డైరెక్టర్. తల్లిదండ్రులకు తెలియకుండా నలుగురు స్నేహితులు చేసే చిలిపి పనులు నవ్విస్తాయి. కామెడీ మాత్రమే కాకుండా విద్యార్థులు చెడు మార్గాల వైపు మళ్లకుండా చూడటంలో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు బాధ్యత కూడా ఉంటుందనే సందేశాన్ని ఇచ్చారు.
సెకండాఫ్‌లో జీవితంలో స్థిరపడే క్రమంలో నలుగురు కుర్రాళ్లు ఎదుర్కొనే సంఘర్షణ , ఆటుపోట్ల చుట్టూ సాగుతుంది. చదువుల కోసం విదేశాలకు వెళ్లిన యువకులు పార్ట్‌టైమ్ జాబ్‌ల కోసం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు? కుటుంబాలకు దూరమై వారు పడే తపనను ఎమోషనల్‌గా చూపించారు. ఆ సీన్లలో కొన్ని వాస్తవికతకు దూరంగా సాగినట్లుగా అనిపిస్తాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో మాదిరిగా క్లైమాక్స్‌లో హీరోల కష్టాలన్నీ తొలగిపోయినట్లుగా కాకుండా నిజాయితీగా తాను ఏం అనుకున్నారో అదే చూపించడం బాగుంది.
నాచురల్ యాక్టింగ్....
హషీర్, అలెన్, అజిమ్, వినాయక్ నాచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. సినిమాలా కాకుండా వారి నిజజీవితాలనే చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. నలుగురి నటన బాగుంది. ఆల్పోన్స్ పుత్రేన్, అజు వర్గీస్, విజయ్ బాబు పాత్రల నిడివి తక్కువే అయినా తమ పరిధుల మేర మెప్పించారు. బీజీఎమ్, సినిమాటోగ్రఫీ కథకు ప్రాణం పోశాయి. తెలుగు డబ్బింగ్ విషయంలో మేకర్స్ చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన చాలా మీమ్స్‌ను వాడేసి నవ్వించారు.
అదే మైనస్....
వాలా 2 యువతరాన్ని మెప్పించే ఫన్ మూవీ. నవ్విస్తూనే ఆలోచనను రేకెత్తిస్తుంది. తెలుగు ఆడియెన్స్‌కు తెలిసిన నటులు ఎవరూ లేకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారింది.
సంబంధిత వార్తలు

Sathi Leelavathi Review | సతీ లీలావతి రివ్యూ – మెగా కోడలి రొమాంటిక్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
మే 8, 2026

Malayalam OTT | ఓటీటీలోకి మలయాళం బ్లాక్‌బస్టర్ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ – 5 కోట్లతో తీస్తే నలభై కోట్లు వచ్చాయి…
మే 3, 2026

Dhanush Kara Review | కర రివ్యూ – ధనుష్, మమితా బైజు యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
ఏప్రిల్ 30, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



