Congress | అసలు ఎలాంటి భారతదేశాన్ని నిర్మించాలనుకుంటున్నారు..? : ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఫైర్
Congress | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ (Congress) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. అసలు మోదీ ఎలాంటి భారతదేశాన్ని నిర్మించాలనుకుంటున్నారంటూ ప్రశ్నించింది.
Congress | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ (Congress) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. మోదీ ప్రభుత్వ హయాంలో దేశంలోని అన్ని వర్గాల ప్రజల హక్కులు, ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఆరోపించింది. మహిళలు, రైతులు, పేదలు, దళితులు, ఆదివాసీలు, విద్యార్థులు సహా సమాజంలోని ప్రతి వర్గం ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోతోందని ఆరోపించింది. అసలు మోదీ ఎలాంటి భారతదేశాన్ని నిర్మించాలనుకుంటున్నారంటూ ప్రశ్నించింది.
ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) రాజ్యసభ (Rajya Sabha)లో మాట్లాడిన ఓ పాత వీడియోని కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో పోస్టు చేసింది. "నరేంద్ర మోదీ దేశంలోని ప్రతి వర్గాన్ని నాశనం చేస్తున్నారు. అసలు వారు ఎలాంటి భారతదేశాన్ని నిర్మించాలనుకుంటున్నారు..? ఇది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సమానత్వం, సామాజిక న్యాయం వంటి ప్రాథమిక సూత్రాలను పూర్తిగా విస్మరించారు. ప్రజలు కట్టిన పన్ను డబ్బులతో అనేక పథకాలు ప్రారంభించి ప్రచార ఆర్భాటాలతో కొంతకాలం ప్రజలను మభ్యపెట్టొచ్చు. కానీ, మహిళలు, రైతులు, పేదలు, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, విద్యార్థుల హక్కులను తీవ్రంగా దెబ్బతీశారు. దీంతో వారు ఇప్పుడు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారు" అని ఖర్గే ఆ వీడియోలో ప్రసంగించారు.
नरेंद्र मोदी देश के हर वर्ग को तबाह कर रहे हैं
सवाल है- वे कैसा भारत बनाना चाहते हैं? pic.twitter.com/woy8arbjpa
— Congress (@INCIndia) June 6, 2026
Also Read..
ఇరాన్ వార్ వేళ.. ఆర్థిక సలహా మండలి సభ్యులతో ప్రధాని కీలక భేటీ
సీజేఐకి చేదు అనుభవం.. లండన్ కాలేజీలో కాక్రోచ్ వ్యాఖ్యలపై నిలదీత
సోషల్ మీడియాలో పోస్టులను చెరిపేయగలరేమో.. మమ్మల్ని కాదు : సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్
తాజావార్తలు
- ●TGPSC | డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టులకు అర్హత ఇదే.. టీజీపీఎస్సీ స్పష్టత
- ●Savings Accounts | చాలా మంది ప్రజలు సేవింగ్స్ ఖాతాల్లో డబ్బును ఉంచడం లేదు.. షాకింగ్ నివేదిక..
- ●Rachita Ram | కూలీ లేడీ విలన్‌కు తెలుగులో ఛాన్స్ - మెగాస్టార్ సినిమాలో కన్నడ బ్యూటీ
- ●Sourav Ganguly | ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ..? ఇందుకోసం గంగూలీ సాయం కోరిన దీదీ..? క్లారిటీ ఇచ్చిన దాదా
- ●WhatsApp | వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. స్కామ్‌లను పసిగడుతుంది..
- ●WhatsApp Status Edit | వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై పోస్ట్ చేసిన 'స్టేటస్'ను కూడా ఎడిట్ చేసుకోవచ్చు!

TGPSC | డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టులకు అర్హత ఇదే.. టీజీపీఎస్సీ స్పష్టత

Savings Accounts | చాలా మంది ప్రజలు సేవింగ్స్ ఖాతాల్లో డబ్బును ఉంచడం లేదు.. షాకింగ్ నివేదిక..

Rachita Ram | కూలీ లేడీ విలన్‌కు తెలుగులో ఛాన్స్ - మెగాస్టార్ సినిమాలో కన్నడ బ్యూటీ

Sourav Ganguly | ఎంపీగా పోటీ చేయనున్న మమతా బెనర్జీ..? ఇందుకోసం గంగూలీ సాయం కోరిన దీదీ..? క్లారిటీ ఇచ్చిన దాదా






