త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maheshkumar Goud | కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి: మ‌హేశ్‌కుమార్‌గౌడ్

Maheshkumar Goud | నీట్ పరీక్ష వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ రాజీనామా చేయాలని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మ‌హేశ్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్ర‌ధాని చేత‌గానిత‌నం వ‌ల్ల ల‌క్ష‌లాది మంది విద్యార్థులు రోడ్డున ప‌డే ప‌రిస్థితి దాపురించింద‌ని ఆవేద‌న చెందారు.

S

Hyderabad | Published On Jun 6, 2026, 1.44 pm IST

Maheshkumar Goud | కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి: మ‌హేశ్‌కుమార్‌గౌడ్
Advertisement
  • ప్ర‌ధాని చేత‌గానిత‌నం వ‌ల్ల విద్యార్థులు రోడ్డున ప‌డ్డారు
  • వారికి కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటుంది
  • లిబ‌ర్టీ స‌ర్కిల్ ధ‌ర్నాలో టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్‌గౌడ్‌

Maheshkumar Goud | త్రినేత్ర‌.న్యూస్‌: నీట్ పరీక్ష వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ రాజీనామా చేయాలని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మ‌హేశ్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్ర‌ధాని చేత‌గానిత‌నం వ‌ల్ల ల‌క్ష‌లాది మంది విద్యార్థులు రోడ్డున ప‌డే ప‌రిస్థితి దాపురించింద‌ని ఆవేద‌న చెందారు. కేంద్ర ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌ను వ్య‌తిరేకిస్తూ శ‌నివారం లిబర్టీ సర్కిల్‌లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ఆయ‌న ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. ఐదు రాష్ట్రాలు ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్‌ ధ‌ర‌లు పెంచి సామాన్యుల న‌డ్డి విరిచింద‌న్నారు.

ప‌రీక్ష ర‌ద్దు కేంద్రం వైఫ‌ల్య‌మే..

ప్రధాని చేతగాని తనం వల్ల లక్షలాది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి దాపురించింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. నీట్-యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. నీట్ పరీక్ష వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని మ‌హేశ్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ అండ‌గా ఉంటుంది..

విద్యార్థులు నెలల తరబడి కష్టపడి సిద్ధమైతే, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వారి శ్రమ వృథా అయింది. చైనా వాళ్లు దేశంలోకి చొచ్చుకొని రావ‌డానికి కార‌ణం కేంద్ర ప్రభుత్వ చేతగాని తన‌మే. కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత వల్లే నీట్ పరీక్షల వైఫల్యం జ‌రిగింది. నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా పాలన ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది అని టీపీసీసీ చీఫ్ మ‌హేశ్‌కుమార్ గౌడ్ స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement