Savings Accounts | చాలా మంది ప్రజలు సేవింగ్స్ ఖాతాల్లో డబ్బును ఉంచడం లేదు.. షాకింగ్ నివేదిక..
Savings Accounts | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో ద్రవ్య విధాన సమీక్షను ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. రెపో రేట్ ను యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. అయితే అంతకు ముందే షాకింగ్ నివేదిక విడుదలైంది. యాన్యువల్ బేసిక్ స్టాటిస్టికల్ రిటర్న్ ఆన్ డిపాజిట్స్ పేరిట ఆర్బీఐ ఓ నివేదికను ప్రవేశపెట్టింది.
Savings Accounts | భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో ద్రవ్య విధాన సమీక్షను ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. రెపో రేట్ ను యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. అయితే అంతకు ముందే షాకింగ్ నివేదిక విడుదలైంది. యాన్యువల్ బేసిక్ స్టాటిస్టికల్ రిటర్న్ ఆన్ డిపాజిట్స్ పేరిట ఆర్బీఐ ఓ నివేదికను ప్రవేశపెట్టింది. ఇందులో దేశ ప్రజల పొదుపు అలవాట్లలో భారీ మార్పును గమనించినట్లు తెలిపింది. గత ఐదేళ్లలో సేవింగ్స్ అకౌంట్లపై భారతీయుల నమ్మకం గణనీయంగా తగ్గినట్లు నివేదిక తెలిపింది. ప్రజలు తమ డబ్బును సేవింగ్స్ ఖాతాల్లో ఉంచడం తగ్గించి, ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) వంటి టర్మ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెడుతున్నారని వెల్లడైంది. 2022 మార్చిలో బ్యాంకుల మొత్తం డిపాజిట్లలో సేవింగ్స్ ఖాతాల వాటా 34.6 శాతంగా ఉండగా, 2026 మార్చి నాటికి అది 28.7 శాతానికి పడిపోయింది. అదే సమయంలో టర్మ్ డిపాజిట్ల వాటా 55.2 శాతం నుంచి 61.6 శాతానికి పెరిగింది. ఇది ప్రజలు అధిక వడ్డీ కోసం తమ పొదుపులను ఎఫ్‌డీల వైపు మళ్లిస్తున్నారని సూచిస్తోంది.
సేవింగ్స్ ఖాతాల్లో తక్కువ వడ్డీ అయినందునే..
సేవింగ్స్ ఖాతాల్లో వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉండటం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐలో సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపై ప్రస్తుతం కేవలం 2.5 శాతం వడ్డీ మాత్రమే లభిస్తోంది. గత పదేళ్లలో ఈ రేటు సుమారు 6-7 శాతం వరకు తగ్గినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎస్‌బీఐలో ఒక సంవత్సరం ఎఫ్‌డీపై 6.25 శాతం, రెండు సంవత్సరాల ఎఫ్‌డీపై 6.45 శాతం వరకు వడ్డీ అందుతోంది. ప్రైవేట్ రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి బ్యాంకుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సేవింగ్స్ ఖాతాలపై లభించే వడ్డీ రేట్లు రిటైల్ ద్రవ్యోల్బణం కంటే తక్కువగా ఉండటంతో వాస్తవ రాబడి (రియల్ రిటర్న్) ప్రతికూలంగా మారుతోంది. ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతంగా నమోదైంది. ఆర్‌బీఐ లక్ష్య పరిధి 2 నుంచి 6 శాతం మధ్యలో ఉంటుంది.
భారీగా పెరిగిన టర్మ్ డిపాజిట్ల వాటా..
2022 మార్చి నుంచి 2026 మార్చి మధ్యకాలంలో సేవింగ్స్ డిపాజిట్ల వాటా 34.6 శాతం నుంచి 28.7 శాతానికి పడిపోగా, టర్మ్ డిపాజిట్ల వాటా 55.2 శాతం నుంచి 61.6 శాతానికి పెరిగింది. అయితే బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లలో ఇప్పటికీ గృహ రంగం (హౌస్‌హోల్డ్ సెక్టార్) ఆధిపత్యం కొనసాగుతోంది. మొత్తం బ్యాంకు డిపాజిట్లలో 59.3 శాతం వాటా గృహ రంగానిదే. మరోవైపు 2026 మార్చి త్రైమాసికం ముగిసే నాటికి నాన్-ఫైనాన్షియల్ సెక్టార్ డిపాజిట్ల వాటా 17.7 శాతం నుంచి 18.5 శాతానికి పెరిగింది. ఫైనాన్షియల్ కార్పొరేషన్ల వాటా 6.8 శాతం నుంచి 7.8 శాతానికి పెరిగింది. టర్మ్ డిపాజిట్లలో పెద్ద మొత్తాల డిపాజిట్లు ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. మొత్తం టర్మ్ డిపాజిట్లలో రూ.1 కోటి లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ల వాటా 46.3 శాతంగా ఉంది. రూ.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన డిపాజిట్ల వాటా 34.8 శాతంగా నమోదైంది. ఇక రూ.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ విలువ కలిగిన డిపాజిట్ల వాటా కేవలం 17.8 శాతమే ఉండటం గమనార్హం.
3 ఏళ్ల టర్మ్ డిపాజిట్లపై ఆసక్తి..
టర్మ్ డిపాజిట్ల కాలపరిమితి విషయంలో కూడా ప్రజల అభిరుచిలో మార్పు కనిపిస్తోంది. ఒకటి నుంచి మూడు సంవత్సరాల మెచ్యూరిటీ కలిగిన టర్మ్ డిపాజిట్ల వాటా 2022 మార్చిలో 50.4 శాతంగా ఉండగా, 2026 మార్చి నాటికి అది 69.8 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఒక సంవత్సరం కంటే తక్కువ కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్ల వాటా 16.7 శాతం నుంచి 8.8 శాతానికి పడిపోయింది. కాగా ఆర్‌బీఐ రెపో రేట్‌ను పెంచితే బ్యాంకులు కూడా డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది. దీంతో ఎఫ్‌డీలపై పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయమైన రాబడులు లభిస్తాయి. అలాగే ద్రవ్యోల్బణం తగ్గుతున్న సమయంలో ఆర్‌బీఐ రెపో రేట్‌ను తగ్గించకుండా కొనసాగిస్తే, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లు బలంగా ఉండే అవకాశం ఉంది. దీంతో డిపాజిటర్లకు లభించే వాస్తవ రాబడి మరింత మెరుగుపడుతుంది. ఈ కారణంగానే ప్రస్తుతం సేవింగ్స్ ఖాతాల కంటే ఎఫ్‌డీల వైపు ప్రజలు వేగంగా మొగ్గు చూపుతున్నట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.
సంబంధిత వార్తలు

Savings Account | ఐటీ నోటీసులు రావొద్దంటే బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో గరిష్టంగా ఎంత పొదుపు చేయవచ్చు..?
ఆగస్టు 10, 2026

SBI Clerk Recruitment | 1538 పోస్టులతో ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్.. తెలంగాణలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే?
ఆగస్టు 9, 2026

Pilot Rohith Reddy | పైలట్ రోహిత్‌రెడ్డికి షాక్.. చెక్ బౌన్స్ కేసులో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
ఆగస్టు 8, 2026
తాజావార్తలు
- ●Kishan Reddy | సింగరేణి నుంచి గ్యాసిఫికేషన్‌పై ప్రతిపాదన రాలేదు
- ●Kiran Abbavaram | ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - పౌరాణిక సినిమాతో పాన్ ఇండియన్ లీగ్‌లోకి ఎంట్రీ!
- ●van swept away | నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యాన్.. తొమ్మిది మంది మృతి
- ●Lava Smart 4 | రూ.8,499కే లావా స్మార్ట్‌ఫోన్.. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16..
- ●Inflation | 1970ల నాటి ద్రవ్యోల్బణం మళ్లీ రానుందా.. బంగారం ధరలు భారీగా పెరగనున్నాయా..?
- ●Minister Vakiti Srihari | 4.21 లక్షల మంది మత్స్యకారులకు రూ.5లక్షల ప్రమాద బీమా : మంత్రి వాకిటి శ్రీహరి

Kishan Reddy | సింగరేణి నుంచి గ్యాసిఫికేషన్‌పై ప్రతిపాదన రాలేదు

Kiran Abbavaram | ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - పౌరాణిక సినిమాతో పాన్ ఇండియన్ లీగ్‌లోకి ఎంట్రీ!

van swept away | నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యాన్.. తొమ్మిది మంది మృతి

Lava Smart 4 | రూ.8,499కే లావా స్మార్ట్‌ఫోన్.. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16..



