Vladimir Putin | భారత్‌పై ఆంక్షలు పెడితే.. అవతలివారికే నష్టం : పుతిన్
Vladimir Putin | భారత్ (India)పై రష్యా అధ్యక్షుడు (Russian President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ప్రశంసలు కురిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతదేశాన్ని ఆంక్షల పేరుతో ఇబ్బంది పెట్టాలని చూస్తే.. అది అవతలివారికే నష్టమంటూ పరోక్షంగా అమెరికాకు చురకలంటించారు.
International | Published On Jun 6, 2026, 10.29 am IST
Vladimir Putin | భారత్ (India)పై రష్యా అధ్యక్షుడు (Russian President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా న్యూఢిల్లీ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని గట్టిగా సమర్థించారు. భారత్ ఓ సార్వభౌమ దేశమని.. రక్షణ, ఆర్థిక భాగస్వాములను ఎంచుకునే హక్కు దానికి ఉందన్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న ఆర్థికసదస్సులో పుతిన్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ‘ఇండియా టుడే’ ప్రతినిధి గీతా మోహన్ అడిగిన పలు ప్రశ్నలకు పుతిన్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతదేశాన్ని ఆంక్షల పేరుతో ఇబ్బంది పెట్టాలని చూస్తే.. అది అవతలివారికే నష్టమంటూ పరోక్షంగా అమెరికాకు చురకలంటించారు. "ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఎప్పుడూ ఒక సార్వభౌమ దేశంగానే వ్యవహరిస్తుంది. ఆంక్షల ద్వారా భారత్‌ను ఒత్తిడికి గురిచేసే ఏ ప్రయత్నమైనా బెడిసికొడుతుంది. భారత్ ఓ సార్వభౌమ దేశం.. రక్షణ, ఆర్థిక భాగస్వాములను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది" అని పుతిన్ చెప్పుకొచ్చారు.
రష్యాతో సంబంధాల విషయంలో బాహ్య ఒత్తిళ్లు ఉన్నప్పటికీ.. భారత్ ఎప్పుడూ జాతి ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరించిందని, భవిష్యత్‌లోనూ అదే కొనసాగిస్తుందని పుతిన్ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు రాజకీయ పరిస్థితులకు అతీతమని, పరస్పర విశ్వాసంపై నిర్మితమైనవని చెప్పారు.
భారత్ గ్లోబల్ ఐటీ లీడర్..
భారతదేశ ప్రతిభ, విద్యా ప్రమాణాలపై కూడా పుతిన్ ప్రశంసలు కురిపించారు. భారతీయులు అత్యంత విద్యావంతులని, ముఖ్యంగా సమాచార సాంకేతిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నైపుణ్యాలను కలిగి ఉన్నారని అన్నారు. ప్రపంచ సాఫ్ట్‌వేర్ మార్కెట్‌లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. భారత యువతకు ఉన్న నైపుణ్యాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆసియా మార్కెట్లతో పాటు భారత్‌కు కూడా రష్యా సరఫరాలను పెంచుతోందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని భాగస్వామ్య దేశాలతో పంచుకుంటోందని తెలిపారు.
Also Read..
శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న భారత్ ఎయిర్ డిఫెన్స్ కోట!
వర్షాభావ పరిస్థితులు..పంటల మార్పిడి చేయండి.. రైతులకు సీఎం రేవంత్ సూచన
సహారా ఎడారిలో చెడిపోయిన లారీ.. నీరు దొరక్క దూపతో 49 మంది మృతి
తాజావార్తలు
- ●CS Jaju | ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశం..
- ●ఆపరేషన్ సిందూర్ వేళ సైబర్ దాడులు: రామగుండం సహా 5 ప్రాంతాల్లో NIA మెరుపు సోదాలు.. అసలు లింకేంటి?
- ●Urea price impact Telangana | రైతన్నలూ.. తక్కువ ధరకు దొరికే యూరియాను వాడకండి.. నేల ఆరోగ్యం దెబ్బతింటుంది
- ●Revanth Reddy | మూసీ భూసేకరణలో వేగం పెంచండి.. చిక్కులు రావొద్దు
- ●Tamannaah | హీరోతో గొడవలు - సినిమా నుంచి తప్పుకున్న దర్శకుడు - చిక్కుల్లో తమన్నా బాలీవుడ్ మూవీ?
- ●Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్

CS Jaju | ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎస్ సంజయ్ జాజు ఆదేశం..

ఆపరేషన్ సిందూర్ వేళ సైబర్ దాడులు: రామగుండం సహా 5 ప్రాంతాల్లో NIA మెరుపు సోదాలు.. అసలు లింకేంటి?

Urea price impact Telangana | రైతన్నలూ.. తక్కువ ధరకు దొరికే యూరియాను వాడకండి.. నేల ఆరోగ్యం దెబ్బతింటుంది

Revanth Reddy | మూసీ భూసేకరణలో వేగం పెంచండి.. చిక్కులు రావొద్దు






