త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi court | న్యాయ‌మూర్తి నోట Floccinaucinihilipilification ప‌దం.. అస‌లు దీని అర్థ‌మేంటి..?

Delhi court | ఢిల్లీ కోర్టు (Delhi court) న్యాయ‌మూర్తి ఉప‌యోగించిన ఓ ఆంగ్ల ప‌దం (long English word) ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. ఎక్క‌డ చూసినా న్యాయ‌మూర్తి ప‌లికిన‌ 29 అక్ష‌రాలు ఉన్న ఆంగ్ల ప‌దం 'Floccinaucinihilipilification' గురించే విప‌రీతంగా చ‌ర్చ న‌డుస్తోంది.

D

National | Published On Apr 2, 2026, 3.47 pm IST

Delhi court | న్యాయ‌మూర్తి నోట Floccinaucinihilipilification ప‌దం.. అస‌లు దీని అర్థ‌మేంటి..?
Advertisement

Delhi court | విచారణ సందర్భంగా న్యాయమూర్తులు (Judges) కోర్టులో వివిధ రకాల చట్టపరమైన పదాలు, ఆదేశాలను ఉపయోగిస్తుంటారు. అవి కొన్ని మ‌న‌కు తెలిసిన‌వి కాగా, మ‌రికొన్ని ప‌దాలు కొత్త‌గా అనిపిస్తుంటాయి. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ (Nirmala Sitharaman)పై న‌మోదైన ప‌రువు న‌ష్టం కేసు విచార‌ణ సంద‌ర్భంగా ఢిల్లీ కోర్టు (Delhi court) న్యాయ‌మూర్తి ఉప‌యోగించిన ఓ ఆంగ్ల ప‌దం (long English word) ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. ఎక్క‌డ చూసినా న్యాయ‌మూర్తి ప‌లికిన‌ 29 అక్ష‌రాలు ఉన్న ఆంగ్ల ప‌దం 'Floccinaucinihilipilification' గురించే విప‌రీతంగా చ‌ర్చ న‌డుస్తోంది. చాలా మంది ఈ ప‌దానికి అర్థ‌మేంటి..? దీన్ని ఎలా ప‌ల‌కాలి..? ఏ సంద‌ర్భంలో ఈ ప‌దాన్ని వాడుతారు..? అని తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీని గురించి గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.

ఏదైనా విష‌యం విలువ‌లేనిద‌ని, దానికి అంత ప్రాముఖ్య‌త లేద‌ని చెప్ప‌డానికి ఫ్లోసినాసినిహిలిపిలిఫికేషన్ ప‌దాన్ని ఉప‌యోగిస్తార‌ట‌. లాటిన్ మూలాల నుంచి ఈ ప‌దం వ‌చ్చింది. flocci, nauci, nihili, pili.. ఈ నాలుగు ప‌దాల‌ను క‌లిపి దీన్ని (Floccinaucinihilipilification) రూపొందించారు. దీనికి ఏమాత్రం విలువ లేద‌ని అర్థం. ఏదైనా వాద‌న‌కు విలువ లేద‌ని నొక్కి చెప్ప‌డానికి ఈ 29 అక్ష‌రాల ప‌దాన్ని ఉప‌యోగిస్తారు. ఇది చాలా పొడ‌వుగా, ప‌లికేందుకు క‌ష్టంగా ఉండ‌టంతో రోజూవారీ సంభాష‌ణ‌ల్లో ఈ ప‌దాన్ని ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం లేదు. అందుకే దీని గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. గ‌తంలో కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ ఓ సంద‌ర్భంలో ఈ ప‌దాన్ని ఉచ్ఛ‌రించారు.

ఇప్పుడు ఎందుకు ఈ ప‌దం తెర‌పైకి వ‌చ్చిందంటే..?

నిర్మ‌లా సీతారామ‌న్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ నేత భార్య ప‌రువు న‌ష్టం దాఖ‌లు చేశారు. ఓ కార్య‌క్ర‌మంలో నిర్మ‌ల‌మ్మ మాట్లాడుతూ.. త‌న ప‌రువుకు న‌ష్టం క‌లిగించేలా అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ ఆరోపించారు. ఈ మేర‌కు ఢిల్లీ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై కోర్టు విచార‌ణ జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా ఇది ఏమాత్రం విలువ లేని చిన్న విష‌యంగా కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఈ మేర‌కు “ఫ్లోసినాసినిహిలిపిలిఫికేషన్” అనే పదాన్ని న్యాయ‌మూర్తి ఉప‌యోగించారు. దీంతో ఈ ప‌దం ఇప్పుడు తెరపైకి వ‌చ్చింది. ఇది ప‌లికేందుకు చాలా క‌ష్టంగా ఉండ‌టంతో ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించింది.

Also Read..

ఐఫోన్ల‌తో చంద్రుడి వ‌ద్ద‌కు వెళ్లిన వ్యోమ‌గాములు.. చ‌రిత్ర‌లో తొలిసారి

చిక్కుల్లో న‌టి సోనాలి బింద్రే.. త‌న భూమిని క‌బ్జా చేశారంటూ రైతు ఫిర్యాదు

ఏప్రిల్ 16 నుంచి 18 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. లోక్‌సభ స్థానాలు 816కు పెంపు, మహిళలకు 273 సీట్లు..!

Advertisement
Advertisement