Nora Fatehi | కోర్టు అంటే తమాషా అనుకున్నావా – నోరా ఫతేహికి ఝలక్
బాలీవుడ్ నటి నోరా ఫతేహికి ఢిల్లీ కోర్టు షాకిచ్చింది. కోర్టు విచారణను తేలిగ్గా తీసుకోవద్దంటూ హెచ్చరించింది. సుఖేష్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఆమె విచారణకు హాజరుకాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Entertainment | Published On Nov 2, 2026, 3.59 pm IST
Nora Fatehi | బాలీవుడ్ నటి నోరా ఫతేహిపై ఢిల్లీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు విచారణ అంటే తమాషా అనుకుంటున్నావా అంటూ హెచ్చరించింది. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్‌తో నోరా ఫతేహికి సంబంధాలు ఉన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ ఆరోపణలపై నోరా ఫతేహి రియాక్ట్ అయ్యింది. తాను నిందితురాలిని కాదని, బాధితురాలిని మాత్రమేనని చెప్పింది. తనకు సుఖేష్‌తోగానీ, ఈ కేసుతో గానీ ఎలాంటి సంబంధాలు లేవని చెప్పింది.
సాక్షిగా...
సుఖేష్ కేసులో ఈడీ అధికారులు నోరా ఫతేహి పేరును ప్రధాన సాక్షిగా చేర్చారు. నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని ఇటీవల ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. కానీ ఈ బాలీవుడ్ నటి మాత్రం కోర్టులో కనిపించలేదు. వ్యక్తిగత కారణాల వల్ల నోరా రాలేదని, కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆమె తరపు లాయర్లు వాదించారు. వారి వాదనను కోర్టు తిరస్కరించింది.
ఆగ్రహం...
బాలీవుడ్ నటి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించింది. కోర్టు అంటే తమాషా అనుకోవద్దని తెలిపింది. సాక్షిగా ఉన్న ఆమె విచారణకు అన్ని విధాల సహకరించాలని చెప్పింది. ప్రవర్తన మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సివస్తుందని కోర్టు అన్నది. నోరా ఫతేహికి మరోసారి సమన్లు జారీ చేసింది. నవంబర్ 6న కోర్టు ముందు ఖచ్చితంగా హాజరుకావాలని ఆదేశించింది.
సుఖేష్‌తో సంబంధం...
2020లో సుఖేష్ చంద్రశేఖర్ భార్య ఓ ఈవెంట్‌కు నోరా ఫతేహి ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమెకు సుఖేష్ ఖరీదైన లగ్జరీ కారుతో పాటు కొన్ని బహుమతులు అందించారు. అప్పటి నుంచే వీరి మధ్య బంధం కొనసాగినట్లు వార్తలొచ్చాయి. సుఖేష్ కేసులో నోరా ప్రమేయం ఉందని జోరుగా ప్రచారం జరిగింది. ఈడీ అధికారుల విచారణలో నోరాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని తేలింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cyclone Murasu | ముంచుకొస్తున్న మురాసు.. అర్ధరాత్రి ఏపీలో తీరం దాటనున్న తుపాను
- ●SEBI | విదేశీ పెట్టుబడిదారులకు భారీ ఊరట.. మూలధన లాభాల పన్ను ఇక ఉండదు..?
- ●Ponguleti Srinivas Reddy | సరిహద్దు పంచాదులుండొద్దిగ.. జాయింట్ సర్వే చేయండి
- ●Supreme Court | గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
- ●2027 UP Assembly Elections | హ్యాట్రిక్‌పై గురి.. యూపీ ఎన్నికలకు బీజేపీ త్రిముఖ వ్యూహం
- ●Hyderabad Metro Phase-2 | మెట్రో ఫేజ్-2కు మహర్దశ.. రూ.275 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

Cyclone Murasu | ముంచుకొస్తున్న మురాసు.. అర్ధరాత్రి ఏపీలో తీరం దాటనున్న తుపాను

SEBI | విదేశీ పెట్టుబడిదారులకు భారీ ఊరట.. మూలధన లాభాల పన్ను ఇక ఉండదు..?

Ponguleti Srinivas Reddy | సరిహద్దు పంచాదులుండొద్దిగ.. జాయింట్ సర్వే చేయండి

Supreme Court | గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..






