IDBI Deal | కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను తమ వ్యక్తిగత ఆస్తిలా వాడుకుంది
IDBI Deal | ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రభుత్వ, ఎల్‌ఐసీలకు చెందిన 60.72 శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు విక్రయించేందుకు కేంద్రం ఆమోదం తెలపడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
- ఐడీబీఐ బ్యాంక్ వాటాల విక్రయంపై రాజకీయ రగడ
- రాహుల్ వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- రూ.53వేల కోట్ల డీల్‌పై మాటల యుద్ధం
IDBI Deal | ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ప్రభుత్వ, ఎల్‌ఐసీలకు చెందిన 60.72 శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు విక్రయించేందుకు కేంద్రం ఆమోదం తెలపడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకును ఎందుకు అమ్ముతున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నించగా.. కాంగ్రెస్ హయాంలో జరిగిన అక్రమ రుణాలే బ్యాంకు దుస్థితికి కారణమంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎదురుదాడికి దిగారు.
ప్రజల ఆస్తులను అమ్మేస్తున్నారన్న రాహుల్
ప్రభుత్వ రంగ బ్యాంకులు అమ్మకానికి పెట్టే ఆస్తులు కావని, దేశ నిర్మాణంలో కీలకమైన సాధనాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగులు తమ కష్టంతో సంస్థను లాభాల బాట పట్టిస్తే.. ఇప్పుడు విదేశీ సంస్థకు ఎందుకు విక్రయిస్తున్నారని ప్రశ్నించారు. గతేడాది మార్చిలో పార్లమెంట్ ఆవరణలో బ్యాంకు ఉద్యోగులను కలిసిన విషయాన్ని గుర్తుచేశారు. బ్యాంకు ఉద్యోగులు, ఖాతాదారుల ప్రయోజనాలను ఎలా కాపాడతారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విక్రయానికి సరైన కారణాలను కేంద్రం వెల్లడించడం లేదని విమర్శించారు.
ఫోన్‌బుక్ బ్యాంకింగ్ అన్న నిర్మలమ్మ
రాహుల్ విమర్శలకు నిర్మలా సీతారామన్ ఘాటుగా బదులిచ్చారు. యూపీఏ పాలనలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలను వ్యక్తిగత ఆస్తుల్లా చూశారని ఎక్స్ వేదికగా ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లతో కాంగ్రెస్ నేతలకు సన్నిహితంగా ఉన్న వీడియోకాన్, విన్‌సమ్, ఏబీజీ షిప్‌యార్డ్, కింగ్‌ఫిషర్ వంటి సంస్థలకు భారీగా రుణాలు ఇప్పించారని విమర్శించారు. ఆ రుణాలే తర్వాత నిరర్థక ఆస్తులుగా (ఎన్‌పీఏలు) మారాయని పేర్కొన్నారు. 1976లో ఇందిరాగాంధీ హయాంలో ఎస్‌బీఐ ఛైర్మన్ ఆర్‌కే తల్వార్ ఉదంతాన్ని సైతం ప్రస్తావించారు. సంజయ్ గాంధీకి సంబంధించిన సంస్థకు రుణాల విషయంలో వెసులుబాటు కల్పించేందుకు నిరాకరించడంతో ఆయనను పదవి నుంచి తొలగించారని గుర్తుచేశారు. అప్పట్లో ఫోన్‌బుక్ బ్యాంకింగ్ నడిచేదని, ఇప్పుడు నిబంధనల ప్రకారమే పారదర్శక బ్యాంకింగ్ జరుగుతోందని వ్యాఖ్యానించారు.
రూ.25వేల కోట్లతో పునరుజ్జీవం
ఐడీబీఐ బ్యాంకు ఎన్‌డీఏ ప్రభుత్వానికి అప్పగించే సమయానికి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని ఆర్థికమంత్రి తెలిపారు. వృత్తిపరమైన యాజమాన్యం, కఠిన నియంత్రణలు, రూ.25వేల కోట్లకు పైగా మూలధన సాయం ద్వారా బ్యాంకును తిరిగి గాడిలో పెట్టామని వివరించారు. పునర్వ్యవస్థీకరణ నుంచి వాటాల విక్రయం వరకు అన్ని నిబంధనలు, విధివిధానాలను పాటించినట్లు స్పష్టం చేశారు. ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటాను ఫెయిర్‌ఫాక్స్‌కు విక్రయించేందుకు అక్టోబర్ 14న కేంద్రం ఆమోదం తెలిపింది. సుమారు రూ.53 వేల కోట్ల విలువైన ఈ లావాదేవీ భారత బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఒప్పందంగా నిలవనుంది. ఐడీబీఐ బ్యాంక్‌లో కేంద్రం వాటా 30.48శాతం.. సుమారు రూ.26,620 కోట్లు కాగా.. ఎల్‌ఐసీ వాటా 30.24 శాతం.. సుమారు రూ.26,440 కోట్లు. ఆర్‌బీఐ సహా సంబంధిత నియంత్రణ సంస్థల అనుమతులు లభించిన అనంతరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ ఒప్పందం పూర్తయ్యే అవకాశం ఉంది.
బ్యాంకింగ్ సంస్కరణలకు కీలక మలుపు
ఐడీబీఐ బ్యాంకు విక్రయం ప్రభుత్వ రంగ బ్యాంకుల వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు కొత్త ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ స్థాయి నిర్వహణ నైపుణ్యానికి మార్గం సుగమం అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, ప్రభుత్వ ఆస్తుల విక్రయంగా విపక్షాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆర్‌బీఐ తుది అనుమతులు, ఒప్పందం పూర్తయ్యే తేదీపై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ponguleti Srinivas Reddy | మియాపూర్ భూములు అమ్మి.. పేదింటి ఆడబిడ్డలకు ఇళ్లు కట్టిస్తాం
- ●Meta | మెటా నుంచి ఏఐ ఫ్యాషన్ యాప్.. మీ దగ్గరున్న దుస్తులతోనే కొత్త లుక్స్..
- ●Kollywood | కోలీవుడ్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమూత - అదుర్స్‌లో ఎన్టీఆర్ బామ్మగా...
- ●Arshdeep Singh | టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత!
- ●Chanagani Dayakar | మియాపూర్ భూముల తీర్పు కేసీఆర్‌కు చెంప పెట్టు లాంటిది: చనగాని దయాకర్
- ●Stock Markets | ఐటీ, ఫార్మా షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Ponguleti Srinivas Reddy | మియాపూర్ భూములు అమ్మి.. పేదింటి ఆడబిడ్డలకు ఇళ్లు కట్టిస్తాం

Meta | మెటా నుంచి ఏఐ ఫ్యాషన్ యాప్.. మీ దగ్గరున్న దుస్తులతోనే కొత్త లుక్స్..

Kollywood | కోలీవుడ్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమూత - అదుర్స్‌లో ఎన్టీఆర్ బామ్మగా...

Arshdeep Singh | టీ20ల్లో అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనత!





