DMK | రాహుల్ జీ.. తమిళనాడులో ఓట్ల తొలగింపుపై మీ వైఖరేంటి..? : డీఎంకే
DMK | రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి డీఎంకే (DMK) కీలక ప్రశ్నలు సంధించింది. "తమిళనాడులో సర్ (SIR) ద్వారా ఓట్ల తొలగింపుపై రాహుల్ గాంధీ వైఖరి ఏంటి..?" అంటూ ప్రశ్నించింది.
DMK | త్రినేత్ర న్యూస్ : సర్ (SIR) వివాదం, సీఈసీకి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండీ కూటమి (INDIA bloc) భారీ నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసనల వేళ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి డీఎంకే (DMK) కీలక ప్రశ్నలు సంధించింది. "తమిళనాడులో సర్ (SIR) ద్వారా ఓట్ల తొలగింపుపై రాహుల్ గాంధీ వైఖరి ఏంటి..?" అంటూ ప్రశ్నించింది.
"సర్ తర్వాత ఎన్నికైన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయాలన్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను రాహుల్ ఎందుకు సమర్థించడం లేదు..? తమిళనాడులో SIR గురించి మాట్లాడటానికి సీఎం విజయ్‌ని చూసి ఆయన భయపడుతున్నారా..?" అంటూ డీఎంకే నేత శరవణ అన్నాదురై ప్రశ్నించారు.
కాగా, తమిళనాట హస్తం పార్టీ డీఎంకేతో పొత్తులో ఉంటూనే గత ఎన్నికల్లో గెలిచిన టీవీకే విజయ్ పార్టీకి మద్దతివ్వడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. రాజకీయ లబ్ధి కోసం హస్తం పార్టీ తమను వెన్నుపోటు పొడిచిందంటూ డీఎంకే ఆరోపించింది. ఆ తర్వాత కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుంది. ఈ వివాదం నేపథ్యంలో గత వారం జరిగిన కీలక ఇండీ కూటమి సమావేశాన్ని కూడా డీఎంకే బహిష్కరించింది. అయితే, ఈ అంశంపై కూటమికి తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేసింది.
Also Read..
హర్మూజ్‌లో వాణిజ్య నౌకపై దాడి.. 11 మంది భారతీయులకు గాయాలు
సంబంధిత వార్తలు

Rahul Gandhi | బీజేపీ అంతు చూస్తాం.. పార్టీని కూల్చేస్తాం, నాశనం చేస్తాం
అక్టోబర్ 6, 2026

Jaya Bachchan | విలేకరుని కసురుకున్న జయా బచ్చన్.. మైక్‌ను పక్కకు నెట్టేసి
అక్టోబర్ 6, 2026

Priyank Kharge | నిబంధనల ప్రకారం జరిగుంటే.. ఆ 16 లక్షల మంది ఓటర్ల వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచారు..?
అక్టోబర్ 6, 2026
తాజావార్తలు
- ●GST 2.0 Reforms | జీఎస్టీ 2.0 : ఏడాదికి ఒక్కసారే పన్నుల మార్పు.. వ్యాపారులకు ఇక మరింత ఊరట
- ●Facebook | ఫేస్‌బుక్‌లో భారీ మార్పు.. ఇక ఓపెన్ చేస్తే రీల్సే..
- ●Sumithranand | నిజమేదో అబద్దమేదో రేవంతే మీడియా ముందు చెప్పాలి
- ●Union Cabinet | రవాణా రంగానికి ‘ఇంటిగ్రేటెడ్’ బూస్ట్
- ●Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కళ్యాణం రిలీజ్లో కొత్త ట్విస్ట్ - రష్మిక మందన్నతో పోటీ!
- ●Strait of Hormuz | హర్మూజ్‌లో వాణిజ్య నౌకపై దాడి.. 11 మంది భారతీయులకు గాయాలు

GST 2.0 Reforms | జీఎస్టీ 2.0 : ఏడాదికి ఒక్కసారే పన్నుల మార్పు.. వ్యాపారులకు ఇక మరింత ఊరట

Facebook | ఫేస్‌బుక్‌లో భారీ మార్పు.. ఇక ఓపెన్ చేస్తే రీల్సే..

Sumithranand | నిజమేదో అబద్దమేదో రేవంతే మీడియా ముందు చెప్పాలి

Union Cabinet | రవాణా రంగానికి ‘ఇంటిగ్రేటెడ్’ బూస్ట్



