Facebook | ఫేస్‌బుక్‌లో భారీ మార్పు.. ఇక ఓపెన్ చేస్తే రీల్సే..
Facebook | ఫేస్‌బుక్ తన యాప్‌లో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. భారత్‌లో కొంతమంది వినియోగదారులకు యాప్‌ను ఓపెన్ చేసిన వెంటనే సాధారణ ఫీడ్‌కు బదులుగా పూర్తి స్క్రీన్‌లో వీడియోలు కనిపించేలా రీల్స్-ఫస్ట్ అనుభవాన్ని పరీక్షించడం ప్రారంభించింది. ఫేస్‌బుక్‌లో ఎక్కువగా వీడియోలను చూడాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
Technology | Published On Oct 6, 2026, 5.13 pm IST
Facebook | ఫేస్‌బుక్ తన యాప్‌లో కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. భారత్‌లో కొంతమంది వినియోగదారులకు యాప్‌ను ఓపెన్ చేసిన వెంటనే సాధారణ ఫీడ్‌కు బదులుగా పూర్తి స్క్రీన్‌లో వీడియోలు కనిపించేలా రీల్స్-ఫస్ట్ అనుభవాన్ని పరీక్షించడం ప్రారంభించింది. ఫేస్‌బుక్‌లో ఎక్కువగా వీడియోలను చూడాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రయోగాన్ని చేపట్టింది. కొత్త ఫీచర్ లో ఫేస్‌బుక్‌లో కంటెంట్, సృష్టికర్తలు, సంభాషణలను వీడియో కేంద్రంగా మరింత దృశ్యమానంగా కనుగొనే అవకాశం ఉంటుంది. వినోదం, వ్యక్తులతో అనుసంధానం మాత్రమే కాకుండా వీడియోలు ఇప్పుడు సంభాషణలు జరిగే వేదికగా, సమూహాలు ఏర్పడే ప్రదేశంగా, వాణిజ్య కార్యకలాపాలు జరిగే స్థలంగా కూడా మారుతున్నాయని ఫేస్‌బుక్ తెలిపింది.
యాప్ తెరిస్తే రీల్స్..
ఈ కొత్త విధానంలో ఎంపిక చేసిన కొంతమంది వినియోగదారులు యాప్‌ను తెరిచినప్పుడు నేరుగా పూర్తి స్క్రీన్ వీడియో కనిపిస్తుంది. అయితే ఈ విధానం నచ్చని వారు దాన్ని నిలిపివేసి మళ్లీ సాధారణ ఫీడ్-ఆధారిత ఫీచర్‌కు తిరిగి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే పాత తరహా ఫీడ్‌ను యాప్‌లో రెండో ట్యాబ్‌గా ఉంచుతున్నారు. అంటే ఒక క్లిక్‌తో సాధారణ ఫీడ్‌కు వెళ్లవచ్చు. మెటా అధికారి టామ్ అలిసన్ ఈ ఏడాది జూలైలో కనెక్టింగ్ రియల్ పీపుల్ ఆన్ ఫేస్‌బుక్ పేరుతో రాసిన పోస్టులో ఈ మార్పులకు సంబంధించిన ప్రణాళికలను వెల్లడించారు. వినియోగదారులు యాప్‌ను ఎలా ఉపయోగిస్తున్నారు, తమ వినియోగం ద్వారా ఎలాంటి కంటెంట్ కావాలని సూచిస్తున్నారు అనే అంశాల ఆధారంగానే ఉత్పత్తిలో మార్పులు చేస్తున్నామని ఫేస్‌బుక్ తెలిపింది.
భారత్‌లోనే ఫస్ట్..
రీల్స్-ఫస్ట్ ఫీచర్‌ను ఫేస్‌బుక్ ప్రస్తుతం భారత్‌లో పరీక్షిస్తోంది. ఈ ఏడాది చివర్లో అంతర్జాతీయంగా కూడా కొత్త ఫీచర్‌ను పరీక్షించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా వీడియోలను ఎక్కువగా వినియోగించే దేశాల్లో ముందుగా ఈ పరీక్షలు ప్రారంభించనుంది. వచ్చే ఏడాది అమెరికాలో కూడా ఈ విధానాన్ని తీసుకురావడంపై ఫేస్‌బుక్ పరిశీలిస్తోంది. ఈ మార్పు ద్వారా ఫేస్‌బుక్‌లో వీడియో కంటెంట్‌కు మరింత ప్రాధాన్యం లభించనుంది. సాధారణ ఫీడ్‌కు బదులుగా యాప్‌ను తెరిచిన వెంటనే రీల్స్ కనిపించే విధానం అమల్లోకి వస్తే, వినియోగదారులు ఫేస్‌బుక్‌లో కంటెంట్‌ను చూసే విధానంలో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కళ్యాణం రిలీజ్లో కొత్త ట్విస్ట్ - రష్మిక మందన్నతో పోటీ!
- ●Strait of Hormuz | హర్మూజ్‌లో వాణిజ్య నౌకపై దాడి.. 11 మంది భారతీయులకు గాయాలు
- ●BRAOU | రేపు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం
- ●Rahul Gandhi | బీజేపీ అంతు చూస్తాం.. పార్టీని కూల్చేస్తాం, నాశనం చేస్తాం
- ●TGHRC | ఎడమ కన్నుకు బదులుగా కుడి కన్నుకు సర్జరీ.. నివేదిక కోరిన హెచ్ఆర్సీ
- ●MERITE | తెలంగాణలో 'మెరిట్' స్కీమ్ అమలు

Anupama Parameswaran | అనుపమ పరమేశ్వరన్ క్రేజీ కళ్యాణం రిలీజ్లో కొత్త ట్విస్ట్ - రష్మిక మందన్నతో పోటీ!

Strait of Hormuz | హర్మూజ్‌లో వాణిజ్య నౌకపై దాడి.. 11 మంది భారతీయులకు గాయాలు

BRAOU | రేపు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం

Rahul Gandhi | బీజేపీ అంతు చూస్తాం.. పార్టీని కూల్చేస్తాం, నాశనం చేస్తాం






