త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Strait of Hormuz | హ‌ర్మూజ్‌లో వాణిజ్య నౌక‌పై దాడి.. 11 మంది భార‌తీయుల‌కు గాయాలు

Strait of Hormuz | హ‌ర్మూజ్ జ‌ల‌సంధి (Strait of Hormuz)లో మ‌రో వాణిజ్య నౌక‌పై దాడి జ‌రిగింది. ఈ దాడిలో 12 మంది సిబ్బందికి గాయాల‌య్యాయి. వారిలో 11 మంది భార‌తీయ నావికులు (Indian sailors) ఉన్న‌ట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) వెల్ల‌డించింది.

D

National | Published On Oct 6, 2026, 4.52 pm IST

Strait of Hormuz | హ‌ర్మూజ్‌లో వాణిజ్య నౌక‌పై దాడి.. 11 మంది భార‌తీయుల‌కు గాయాలు
Advertisement

Strait of Hormuz | త్రినేత్ర న్యూస్ : హ‌ర్మూజ్ జ‌ల‌సంధి (Strait of Hormuz)లో మ‌రో వాణిజ్య నౌక‌పై దాడి జ‌రిగింది. ఒమన్ (Oman) తీరంలోని హ‌ర్మూజ్ జలసంధి గుండా పనామా జెండాతో (Panama-flagged commercial vessel) ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఎమ్మెట్ ఆన్ పీస్ (MT On Peace) పై క్షిప‌ణి దాడి జ‌రిగింది. ఈ దాడిలో 12 మంది సిబ్బందికి గాయాల‌య్యాయి. వారిలో 11 మంది భార‌తీయ నావికులు (Indian sailors) ఉన్న‌ట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) వెల్ల‌డించింది.

గాయ‌ప‌డిన సిబ్బందిని ఒమ‌న్ అధికారుల సాయంతో సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించిన‌ట్లు పేర్కొంది. ఒమన్‌లోని ఖాస‌బ్ (Khasab) న‌గ‌రంలో వారికి వైద్య చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ దాడిని విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌక‌ల‌పై వ‌రుస‌గా జ‌రుగుతున్న దాడులు తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ట్లు పేర్కొంది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం స‌రికాద‌ని.. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా దాడుల‌కు తక్షణమే ఆపేయాల‌ని కోరింది. కాగా, దాడి స‌మ‌యంలో నౌక‌లో మొత్తం 19 మంది సిబ్బంది ఉన్న‌ట్లు రాయిట‌ర్స్ నివేదించింది. వారిలో 17 మంది భార‌తీయ నావికులేన‌ని పేర్కొంది.

Also Read..

బీజేపీ అంతు చూస్తాం.. పార్టీని కూల్చేస్తాం, నాశనం చేస్తాం

భౌతిక‌శాస్త్రంలో ఫ్రాన్సిస్ హాల్జ‌న్‌కు నోబెల్‌

ఎల్‌నినో ఎఫెక్ట్.. బీర్ల ఉత్ప‌త్తిపై లేనే లేదు

Advertisement
Advertisement