Rahul Gandhi | బీజేపీ అంతు చూస్తాం.. పార్టీని కూల్చేస్తాం, నాశనం చేస్తాం
300 మంది ఎంపీలతో ఎన్నికల సంఘం ఆఫీసు వైపు దూసుకెళ్లిన రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకోవడంతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
సంక్షిప్త సారాంశం
ఓట్ల దొంగతనం ఆరోపణలపై కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసేందుకు పార్లమెంట్ నుంచి 300 మంది ఇండియా కూటమి ఎంపీలతో రాహుల్ గాంధీ భారీ ర్యాలీ చేపట్టారు. పోలీసులు మార్చ్‌ను బారికేడ్లతో అడ్డుకోవడంతో ఆకాశవాణి భవన్ ఆవరణలో నేతలు బైఠాయించి ఆందోళనకు దిగారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ముఖ్య నేతలను ఢిల్లీ పోలీసులు కాసేపు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేశారని, ఇందుకు బాధ్యులైన వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని రాహుల్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
- రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే ఇక్కడ నిలబడ్డా
- దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేశారు
- రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
- ఢిల్లీలో హైడ్రామా
- ఈసీ కార్యాలయం ముట్టడికి 300 మంది ఎంపీలతో రాహుల్ గాంధీ మార్చ్
- పోలీసుల అడ్డగింత
- తీవ్ర ఉద్రిక్తత
Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈవీఎంలు, ఎన్నికల్లో జరిగినట్లు చెబుతున్న "ఓట్ల దొంగతనం" వ్యవహారంపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను నిలదీసేందుకు విపక్ష ఇండియా కూటమి భారీ ఆందోళనకు దిగింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సుమారు 300 మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు పార్లమెంట్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి నిరసన ర్యాలీ చేపట్టారు. అయితే, ఈసీ కార్యాలయానికి కొద్ది దూరంలోనే పోలీసులు భారీ బందోబస్తు, బారికేడ్లతో వారిని అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
मेरे भारत के साथ जो किया गया है, वो देशद्रोह है।
चाहे वो नरेंद्र मोदी हो, अमित शाह हो, ज्ञानेश कुमार हो या मोहन भागवत हो - कोई बच कर नहीं भाग पाएगा। https://t.co/G1F4EF447t
— Rahul Gandhi (@RahulGandhi) October 6, 2026
'మాపై బెదిరింపులేంటి?' – రాహుల్ ఆగ్రహం
పోలీసుల వైఖరిపై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "మేము కోట్ల మంది భారతీయ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఎన్నికల కమిషనర్లు మమ్మల్ని కలవడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు? శాంతియుతంగా వెళ్తున్న ఎంపీలను ఢిల్లీ పోలీసులు ఎందుకు ఆపుతున్నారు? మమ్మల్ని ఎందుకు బెదిరిస్తున్నారు?" అని సూటిగా ప్రశ్నించారు.
More than 300 Opposition MPs marched from Parliament to the Election Commission today to meet the Election Commissioners.
We represent crores of Indians.
- Why aren't the Election Commissioners meeting us?
- Why is the police stopping and threatening us? https://t.co/tlIck8WoZX— Rahul Gandhi (@RahulGandhi) October 6, 2026
ఆకాశవాణి భవన్‌లో బైఠాయింపు.. బారికేడ్ ఎక్కిన రాహుల్
ఈసీ ఆఫీస్ వైపు వెళ్లకుండా పోలీసులు రహదారులను మూసివేయడంతో, నాయకులు సమీపంలోని ఆకాశవాణి భవన్ గేట్లను నెట్టుకుని లోపలికి ప్రవేశించారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా, పవన్ ఖేరా, ఇమ్రాన్ ప్రతాప్‌గరీ సహా పలువురు సీనియర్ నేతలు ఆ ప్రాంగణంలోని చెట్టు కింద బైఠాయించి ధర్నాకు దిగారు. ఓ దశలో రాహుల్ గాంధీ పోలీసు బారికేడ్ పైకి ఎక్కి జాతీయ జెండాను రెపరెపలాడించడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో రాహుల్, ప్రియాంక సహా పలువురు నేతలను పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు.
Gyanesh, it’s done, bro.
Time to resign.
#IndiaAllianceMarch https://t.co/9ZB6aJfakl
— Rahul Gandhi (@RahulGandhi) October 6, 2026
"ఇది దేశద్రోహం.. ఎవరూ తప్పించుకోలేరు"
ఈ నిరసనల సందర్భంగా రాహుల్ గాంధీ బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "మేము బీజేపీని కేవలం ఎదుర్కోవడం మాత్రమే కాదు.. ఆ పార్టీని పూర్తిగా కూల్చివేస్తాం. నాశనం చేస్తాం. బీజేపీ ఏం చెబుతుందనే దాంతో నాకు సంబంధం లేదు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే నేను ఇక్కడ నిలబడ్డాను" అని స్పష్టం చేశారు.
Also Read | జ్ఞానేశ్ ఇక చాలు బ్రో.. రాజీనామా చెయ్
ఓట్ల దొంగతనంతో దేశాన్ని హైజాక్ చేశారని ఆరోపిస్తూ.. "ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేశారు. వీరికి సీఈసీ జ్ఞానేష్ కుమార్ సహకరించారు. నేను ఎంతో ఆలోచించే ఈ మాటలు చెబుతున్నాను. దేశానికి చేసిన ఈ ద్రోహానికి ఎవరూ తప్పించుకోలేరు, భవిష్యత్తులో ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు ఉంటాయి" అని రాహుల్ హెచ్చరించారు.
రాజధానిలో ప్రజాస్వామ్యం ఖూనీ: పవన్ ఖేరా
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మీడియాతో మాట్లాడుతూ.. "ఎన్నికల సంఘం ఇక్కడికి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఉంది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత ఒక వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తుంటే ఇంత దారుణంగా అడ్డుకుంటారా? దేశ రాజధాని నడిబొడ్డున ప్రజాస్వామ్యం ఏ స్థితికి చేరిందో దేశ ప్రజలు చూస్తున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి | విలేకరుని కసురుకున్న జయా బచ్చన్.. మైక్‌ను పక్కకు నెట్టేసి
చేతుల్లో త్రివర్ణ పతాకాలు, "సేవ్ డెమోక్రసీ" ప్లకార్డులు పట్టుకున్న విపక్ష ఎంపీలు.. ఈసీ, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా హోరెత్తించిన నినాదాలతో ఢిల్లీ వీధులు దద్దరిల్లాయి.
Also Read | నిబంధనల ప్రకారం జరిగుంటే.. ఆ 16 లక్షల మంది ఓటర్ల వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచారు..?

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●BRAOU | రేపు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం
- ●TGHRC | ఎడమ కన్నుకు బదులుగా కుడి కన్నుకు సర్జరీ.. నివేదిక కోరిన హెచ్ఆర్సీ
- ●MERITE | తెలంగాణలో 'మెరిట్' స్కీమ్ అమలు
- ●Trainee IPS Uday Krishna Reddy | లైంగిక ఆరోపణల కేసు.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్
- ●Break Darshan Cancelled | తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. పది బ్రేక్ దర్శనాలు రద్దు
- ●Nobel Prize 2026 | భౌతికశాస్త్రంలో ఫ్రాన్సిస్ హాల్జన్‌కు నోబెల్

BRAOU | రేపు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్నాతకోత్సవం

TGHRC | ఎడమ కన్నుకు బదులుగా కుడి కన్నుకు సర్జరీ.. నివేదిక కోరిన హెచ్ఆర్సీ

MERITE | తెలంగాణలో 'మెరిట్' స్కీమ్ అమలు

Trainee IPS Uday Krishna Reddy | లైంగిక ఆరోపణల కేసు.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్






