Form 6 Supreme Court | ఫారం-6 మార్పులకు మేం ఓకే చెప్పలేదు: ఎన్నికల సంఘం వాదనను కొట్టిపారేసిన సుప్రీంకోర్టు
ఓటరు నమోదు ఫారం 6లో మార్పులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈసీ వాదనను తోసిపుచ్చుతూ అసలు మార్పులు ఎవరు చేశారో తేలుస్తామని సీజేఐ హెచ్చరించారు.
సంక్షిప్త సారాంశం
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటరు నమోదు కోసం మార్చిన ‘ఫారం 6’కు సుప్రీంకోర్టు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) గతంలో సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందంటూ చేసిన వాదనలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూల్స్ సవరించకుండానే ఏకపక్షంగా మార్పులు చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషన్‌పై స్పందిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
- సీఈసీపై విచారణ పిటిషన్‌లో కీలక మలుపు
Form 6 Supreme Court | త్రినేత్ర న్యూస్ : ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు కోసం వినియోగించే 'ఫారం 6' (Form 6)లో చేసిన వివాదాస్పద మార్పులపై సుప్రీంకోర్టు అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ కోసం సవరించిన ఫారం 6కు అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి ఆమోదం తెలపలేదని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ సోమవారం కుండబద్దలు కొట్టారు.
Also Read | రాజ్యసభ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. సిట్టింగులకు షాక్
ఈ మార్పులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ ఇటీవల భారత ఎన్నికల సంఘం (ECI) చేసిన ప్రకటనల నేపథ్యంలో సీజేఐ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెను దుమారం రేపుతున్నాయి.
రికార్డులు పరిశీలించి ఎవరు మార్చారో తేలుస్తాం: సీజేఐ హెచ్చరిక
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై చట్టపరమైన విచారణ జరపాలంటూ న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఇదీ చదవండి | బీజేపీ నేతలు.. ఫాం-7 ద్వారా ముస్లిం ఓట్లను ఎలా తొలగిస్తున్నారంటే…
ఢిల్లీ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కొత్త ఫారం 6 డిక్లరేషన్‌ను ఉపయోగిస్తున్న తీరుపై సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీజేఐ.. "మేము ఎలాంటి సవరించిన ఫారం 6కు ఆమోదం తెలపలేదు. ఈ విషయంలో స్పష్టత ఉండాలి. రికార్డులను పరిశీలించి ఆ మార్పులు ఎవరు చేశారో తప్పకుండా చూస్తాం" అని వ్యాఖ్యానించారు.
అసలేంటీ ఫారం 6 డిక్లరేషన్ వివాదం?
నయా నిబంధనల ప్రకారం, కొత్తగా ఓటు నమోదు చేసుకునే వ్యక్తులు తాము గానీ, తమ తల్లిదండ్రులు గానీ గతంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియలో నమోదు అయ్యారా లేదా అనే వివరాలను డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మార్పులపై ఎన్నికల కమిషనర్లే అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 'రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960' చట్టాన్ని సవరించకుండా ఇలాంటి డిక్లరేషన్లను తీసుకురాలేమని వారు స్పష్టం చేసినా.. ఏకపక్షంగా అమలు చేసినట్లు కథనాలు వెలువడ్డాయి.
Also Read | జ్ఞానేశ్‌ను తొలగించలేం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు
దీనిపై స్పందించిన ఈసీఐ.. బీహార్ ఎస్‌ఐఆర్‌పై 2026 మే నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే ఫారం 6 తెచ్చామని సెప్టెంబర్ 26న సమర్థించుకుంది. అయితే, ఆ తీర్పు వెలువడిన తర్వాతే ఈ కొత్త నిబంధనలు రావడంతో కోర్టు వాటిని పరిశీలించే అవకాశమే లేకపోయిందని నిపుణులు ఎత్తిచూపారు. నేడు సీజేఐ ప్రకటనతో ఈసీ వాదనలు పూర్తిగా వీగిపోయాయి.
ఈసీ అధికారులపై చర్యలకు డిమాండ్
రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్, 1950 లోని సెక్షన్ 32 కింద విధుల ఉల్లంఘనకు సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మనీష్ గార్గ్, డీజీ (ఐటీ) సీమా ఖన్నాలపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. అలాగే రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఐటీ, సైబర్ సెక్యూరిటీ నిపుణులతో స్వతంత్ర జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిషన్ లేదా సిట్ (SIT) ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి | బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరగాలి : మల్లికార్జున ఖర్గే
పిటిషన్‌లోని అభ్యర్థనలు కాస్త గందరగోళంగా ఉన్నాయని ధర్మాసనం తొలుత వ్యాఖ్యానించినప్పటికీ, న్యాయవాది తమ వాదనలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేయడంతో సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈసీ నిర్ణయాలను సవాలు చేస్తూ దాఖలైన ఇతర పిటిషన్లతో దీనిని జతచేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
Also Read | దేశమంతా కదులుతుంది.. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు..?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ramayana | రామాయణ సెట్లో అగ్నిప్రమాదం - నిలిచిపోయిన బాలీవుడ్ సినిమా షూటింగ్‌లు
- ●ACP Suspend | అవినీతి ఆరోపణలు.. డ్యూటీలో చేరగానే ఏసీపీపై వేటు
- ●Jailer 2 Trailer | టైగర్ ముత్తువేల్ ఈజ్ బ్యాక్ - యాక్షన్ విత్ వయలెన్స్ - రజనీకాంత్ జైలర్ 2 ట్రైలర్ రిలీజ్
- ●ACB Raids | ప్రైవేట్ ఆసుపత్రి తెరిచేందుకు రెండు లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన డీఎంహెచ్‌వో
- ●TGSRTC MahaLakshmi Scheme | దూసుకెళ్తున్న 'మహాలక్ష్మి': 3 నెలల్లోనే 35.65 కోట్ల మహిళల ప్రయాణం
- ●RBI | ఆర్బీఐ కీలక ప్రకటన.. ఫ్లోటింగ్ రేట్ బాండ్‌పై 6.45 శాతం వడ్డీ.. ఎంత వస్తుంది..?

Ramayana | రామాయణ సెట్లో అగ్నిప్రమాదం - నిలిచిపోయిన బాలీవుడ్ సినిమా షూటింగ్‌లు

ACP Suspend | అవినీతి ఆరోపణలు.. డ్యూటీలో చేరగానే ఏసీపీపై వేటు

Jailer 2 Trailer | టైగర్ ముత్తువేల్ ఈజ్ బ్యాక్ - యాక్షన్ విత్ వయలెన్స్ - రజనీకాంత్ జైలర్ 2 ట్రైలర్ రిలీజ్

ACB Raids | ప్రైవేట్ ఆసుపత్రి తెరిచేందుకు రెండు లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన డీఎంహెచ్‌వో






