ACB Raids | ప్రైవేట్ ఆసుపత్రి తెరిచేందుకు రెండు లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన డీఎంహెచ్‌వో
ACB Raids | ఏసీబీ రైడ్స్, పట్టుబడిన రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి, రెండు లక్షల లంచం డిమాండ్, ఇవీ వివరాలు..
ACB Raid | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలో ఇటీవల అవినీతి అధికారులు పదుల సంఖ్యలో ఏసీబీకి పట్టుబడుతున్నా అధికారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. కుక్క తోక వంకర అనే చందంగా వ్యవహరిస్తూ వక్ర బుద్ధిని చాటుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి ఏసీబీ వలకు చిక్కారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు అనుకూలంగా వ్యవహరించేందుకు రెండు లక్షల లంచం డిమాండ్ చేశారు.
రూ.2 లక్షల్లో భాగంగా రూ.లక్ష ఇవ్వాలని స్వర్ణకుమారి కోరినట్లు బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం మాటు వేశారు. బాధితుడు రూ.లక్షను హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌కు అందజేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం శ్రీనివాస్ ఆ నగదును డీఎంహెచ్‌వో డ్రైవర్ కృష్ణయ్యకు ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ డబ్బులు కారులో పెట్టేందుకు వెళ్తున్న సమయంలో కృష్ణయ్యను పట్టుకున్నారు.
ఈ వ్యవహారంలో డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి, హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డ్రైవర్ కృష్ణయ్య పాత్రపై విచారణ చేపట్టారు. ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రానున్నాయి.
తాజావార్తలు
- ●Rahul Gandhi | బీజేపీకి మేలు చేసేందుకే : ఫారం 6 ను ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా మార్చారు
- ●Ramayana | రామాయణ సెట్లో అగ్నిప్రమాదం - నిలిచిపోయిన బాలీవుడ్ సినిమా షూటింగ్‌లు
- ●Form 6 Supreme Court | ఫారం-6 మార్పులకు మేం ఓకే చెప్పలేదు: ఎన్నికల సంఘం వాదనను కొట్టిపారేసిన సుప్రీంకోర్టు
- ●ACP Suspend | అవినీతి ఆరోపణలు.. డ్యూటీలో చేరగానే ఏసీపీపై వేటు
- ●Jailer 2 Trailer | టైగర్ ముత్తువేల్ ఈజ్ బ్యాక్ - యాక్షన్ విత్ వయలెన్స్ - రజనీకాంత్ జైలర్ 2 ట్రైలర్ రిలీజ్
- ●TGSRTC MahaLakshmi Scheme | దూసుకెళ్తున్న 'మహాలక్ష్మి': 3 నెలల్లోనే 35.65 కోట్ల మహిళల ప్రయాణం

Rahul Gandhi | బీజేపీకి మేలు చేసేందుకే : ఫారం 6 ను ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా మార్చారు

Ramayana | రామాయణ సెట్లో అగ్నిప్రమాదం - నిలిచిపోయిన బాలీవుడ్ సినిమా షూటింగ్‌లు

Form 6 Supreme Court | ఫారం-6 మార్పులకు మేం ఓకే చెప్పలేదు: ఎన్నికల సంఘం వాదనను కొట్టిపారేసిన సుప్రీంకోర్టు

ACP Suspend | అవినీతి ఆరోపణలు.. డ్యూటీలో చేరగానే ఏసీపీపై వేటు





