త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jailer 2 Trailer | టైగ‌ర్ ముత్తువేల్ ఈజ్ బ్యాక్ – యాక్ష‌న్ విత్ వ‌య‌లెన్స్ – ర‌జ‌నీకాంత్ జైల‌ర్ 2 ట్రైల‌ర్ రిలీజ్‌

ర‌జ‌నీకాంత్ జైల‌ర్ 2 మూవీ ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 15న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. జైల‌ర్ మూవీకి సీక్వెల్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జైల‌ర్ 2 ట్రైల‌ర్ సోమ‌వారం రిలీజైంది. యాక్ష‌న్‌, వ‌య‌లెన్స్‌తో పాటు ర‌జ‌నీకాంత్ హీరోయిజం, ఎలివేష‌న్ల‌తో ఈ ట్రైల‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

N

Entertainment | Published On Oct 5, 2026, 7.03 pm IST

Jailer 2 Trailer | టైగ‌ర్ ముత్తువేల్ ఈజ్ బ్యాక్ – యాక్ష‌న్ విత్ వ‌య‌లెన్స్ – ర‌జ‌నీకాంత్ జైల‌ర్ 2 ట్రైల‌ర్ రిలీజ్‌
Advertisement

Jailer 2 Trailer |  సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మూవీ జైల‌ర్ 2. జైల‌ర్ మూవీకి సీక్వెల్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఎస్‌జే సూర్య‌, సూర‌జ్ వెంజ‌ర‌మూడు, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి విల‌న్లుగా న‌టిస్తోన్న ఈ సినిమాలో విద్యాబాల‌న్‌, ర‌మ్య‌కృష్ణ‌, మిర్నా మీన‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ముత్తువేల్ పాండియ‌న్‌...

జైల‌ర్ 2 ట్రైల‌ర్ సోమ‌వారం రిలీజైంది. మ‌రోసారి టైగ‌ర్ ముత్తువేల్ పాండియ‌న్ పాత్ర‌లో ర‌జ‌నీకాంత్ క‌నిపించ‌బోతున్నారు. ర‌జ‌నీకాంత్‌ హీరోయిజం, ఎలివేష‌న్లు, మాస్ డైలాగ్స్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. వ‌ర్మ‌ను చంపిన జైల‌ర్ కోసం చాలా మంది శ‌త్రువులు వెతుకుంతుంటారు. త‌న గురించి ఎవ‌రికి తెలియ‌కుండా సాధార‌ణ క్యాబ్ డ్రైవ‌ర్‌గా ముత్తువేల్ అజ్ఞాత జీవితాన్ని గ‌డుపుతుంటాడు. త‌న‌ను వెతుక్కుంటూ వ‌చ్చిన శ‌త్రువుల‌ను ముత్తువేల్ ఎలా ఎదుర్కొన్నాడు? అంద‌రిని ఒకే చోటు చేర్చి ఏ విధంగా దెబ్బ‌తీశాడ‌నే అంశాల‌తో జైల‌ర్ 2 రూపొందుతోన్న‌ట్లు ట్రైల‌ర్‌లో చూపించారు.

వ‌య‌లెన్స్ ఎక్కువే...

జైల‌ర్ 2లో చాలా మంది విల‌న్లు ఉండ‌బోతున్న‌ట్లు క‌నిపిస్తోంది. బోల్డ్ రోల్‌లో విద్యాబాల‌న్ ఎంట్రీ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది. పార్ట్ వ‌న్‌తో పోలిస్తే యాక్ష‌న్ అంశాలు, వ‌య‌లెన్స్ ఎక్కువ‌గానే ఉండ‌బోతున్న‌ట్లు క‌నిపిస్తోంది. జైల‌ర్‌లో గెస్ట్‌లుగా క‌నిపించిన మోహ‌న్‌లాల్‌, శివ‌రాజ్‌కుమార్‌, జాకీష్రాఫ్ కూడా ఈ సీక్వెల్‌లో క‌నిపించ‌బోతున్నారు.

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌...

దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో జైల‌ర్ 2 సినిమాను స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ తెర‌కెక్కిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఐదు వంద‌ల కోట్ల‌కుపైనే జ‌రిగిన‌ట్లు స‌మాచారం. తెలుగులో జైల‌ర్ 2 సినిమాను సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ యాక్ష‌న్ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement
Advertisement