త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramayana | రామాయ‌ణ సెట్‌లో అగ్నిప్ర‌మాదం – నిలిచిపోయిన బాలీవుడ్ సినిమా షూటింగ్‌లు

ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న రామాయ‌ణ మూవీ సెట్స్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ అగ్ని ప్ర‌మాదం తాలూకు దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించారు.

N

Entertainment | Published On Oct 5, 2026, 7.29 pm IST

Ramayana | రామాయ‌ణ సెట్‌లో అగ్నిప్ర‌మాదం – నిలిచిపోయిన బాలీవుడ్ సినిమా షూటింగ్‌లు
Advertisement

Ramayana | రామాయ‌ణ మూవీ సెట్‌లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న‌తో ఫిల్మ్‌సిటీలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగ‌డంతో సినిమా యూనిట్ స‌భ్యుల‌తో పాటు ఫిల్మ్ సిటీ సిబ్బంది ప‌రుగులు తీశారు. స‌కాలంలో అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డికి చేరుకొని మంట‌లు ఆర్ప‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది.

సోమ‌వారం సాయంత్రం...

ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న రామాయ‌ణ పార్ట్ వ‌న్‌ ఈ ఏడాది దీపావ‌ళికి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ మైథాల‌జీ మూవీకి నితీష్ తివారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రామాయ‌ణ సినిమా కోసం ముంబైలోని ఫిల్మ్ సిటీలో ఓ సెట్ వేశారు. ఈ సెట్‌లో సోమ‌వారం సాయంత్రం అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాద తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో ఫిల్మ్‌సిటీ మొత్తం పొగ‌తో అములుకుంది. అగ్నికిల‌లు ఎగిసిప‌డ‌టంతో భ‌యాందోళ‌న‌ల‌ను నెల‌కొన్నాయి.

షూటింగ్‌ల‌కు బ్రేక్‌...

స‌కాలంలో అక్క‌డికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను ఆర్పివేశారు. అగ్నికిల‌లు ఇత‌ర సెట్స్‌కు వ్యాపించ‌కుండా అడ్డుకున్నారు. అగ్నిమాప‌క సిబ్బంది అప్ర‌మ‌త్త‌తతో భారీ ముప్పు త‌ప్పింది. ఈ అగ్నిప్ర‌మాదంలో రామాయ‌ణ సెట్స్‌లోకి కొన్ని విలువైన వ‌స్తువులు కాలిపోయిన‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికి ఎలాంటి గాయాలు కాలేద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.
ఈ ప్ర‌మాదం కార‌ణంగా ఫిల్మ్‌సిటీలో జ‌రుగుతోన్న ఇత‌ర సినిమాల షూటింగ్‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. అగ్నిప్ర‌మాదం తాలూకు వీడియోలు, ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

నాలుగు వేల కోట్ల బ‌డ్జెట్‌...

దాదాపు నాలుగు వేల కోట్ల బ‌డ్జెట్‌తో రెండు పార్ట్‌లుగా రామాయ‌ణ మూవీ రూపొందుతోంది. ర‌ణ‌భీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి సీతారాముడి పాత్ర‌ల్లో న‌టిస్తోన్న ఈ సినిమాలో య‌శ్ రావ‌ణాసురుడిగా క‌నిపించ‌బోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Advertisement
Advertisement