త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajya Sabha polls | రాజ్యసభ ఎన్నికలు.. అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీజేపీ.. సిట్టింగుల‌కు షాక్‌

Rajya Sabha polls | ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల (Rajya Sabha polls) కోసం బీజేపీ (BJP) ఎనిమిది మంది పేర్ల‌తో కూడిన జాబితాను సోమ‌వారం ప్ర‌క‌టించింది. రాధాకాంత్ ఓజా, ప్రకాష్ పాల్, ధరంపాల్ సింగ్, విద్యాసాగర్ సోంకర్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, గోపి కృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, శృతి గంగ్వార్‌లను ఎన్నిక‌ల బ‌రిలో దింపింది.

D

National | Published On Oct 5, 2026, 5.41 pm IST

Rajya Sabha polls | రాజ్యసభ ఎన్నికలు.. అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బీజేపీ.. సిట్టింగుల‌కు షాక్‌
Advertisement

Rajya Sabha polls | త్రినేత్ర న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల (Rajya Sabha polls) కోసం బీజేపీ (BJP) అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. ఎనిమిది మంది పేర్ల‌తో కూడిన జాబితాను సోమ‌వారం ప్ర‌క‌టించింది. రాధాకాంత్ ఓజా, ప్రకాష్ పాల్, ధరంపాల్ సింగ్, విద్యాసాగర్ సోంకర్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, గోపి కృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, శృతి గంగ్వార్‌లను ఎన్నిక‌ల బ‌రిలో దింపింది. యూపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం ముగియనున్న కేంద్ర మంత్రి హర్‌‌దీప్ సింగ్ పూరీకి ఈ సారి బీజేపీ అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఆయ‌న‌తోపాటూ ఇత‌ర సిట్టింగ్ ఎంపీలు బీఎల్‌ వర్మ, అరుణ్ సింగ్, సీమా ద్వివేది, నీరజ్ శేఖర్, బ్రిజ్ లాల్, గీతా శాక్యకు మొండి చేయి చూపించింది. యూపీలోని 10 రాజ్య‌స‌భ స్థానాల‌కు అక్టోబ‌ర్ 16న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న పలు రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం (EC) అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని 10 స్థానాలు, ఉత్తరాఖండ్‌లోని ఒక స్థానానికి ద్వైవార్షిక ఎన్నికలు (Biennial Elections) నిర్వహించనుండగా.. పశ్చిమ బెంగాల్‌లో ఖాళీగా ఉన్న మరో స్థానానికి ఉప ఎన్నికను ప్రకటించింది. ఈ నేప‌థ్యంలో పశ్చిమ బెంగాల్‌ (Bengal) రాజ్య‌స‌భ స్థానానికి రుక్మిణి మల్లిక్, ఉత్తరాఖండ్‌ నుంచి దినేశ్‌ ఆర్యను బీజేపీ పోటీకి దింపింది.

Also Read..

బీజేపీ నేతలు.. ఫాం-7 ద్వారా ముస్లిం ఓట్లను ఎలా తొలగిస్తున్నారంటే...

ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తే.. ఏనుగు చంపేసింది

విద్య‌కు పార్ట్‌టైమ్ డ్యూటీ స‌రిపోదు.. విద్యాశాఖ మంత్రిని పెట్టండి

Advertisement
Advertisement