SIR | బీజేపీ నేతలు.. ఫాం-7 ద్వారా ముస్లిం ఓట్లను ఎలా తొలగిస్తున్నారంటే…
SIR | సర్ ప్రక్రియ ద్వారా కర్ణాటక బెలగావి (Belagavi)లో దాదాపు 198 మంది ముస్లిం ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించేందుకు కుట్ర జరిగినట్లు వెల్లడైంది.
SIR | త్రినేత్ర న్యూస్ : కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో (SIR) జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని ఫాం 7 ద్వారా పెద్ద ఎత్తున ముస్లిం ఓటర్లను తొలగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సర్ ప్రక్రియ ద్వారా కర్ణాటక బెలగావి (Belagavi)లో దాదాపు 198 మంది ముస్లిం ఓటర్ల పేర్లను అక్రమంగా తొలగించేందుకు కుట్ర జరిగినట్లు వెల్లడైంది.
బెలగావిలోని వీరభద్ర నగర్ పోలింగ్ బూత్ 195, 196 పరిధిలో నకిలీ పత్రాలు, తప్పుడు సమాచారంతో 198 మంది ముస్లిం ఓటర్ల పేర్లను తొలగించడానికి ప్రయత్నించారు. ఈ వ్యవహారంపై ప్రత్యర్థి పార్టీకి చెందిన కొందరు నాయకులు.. స్థానిక బీజేపీ నేత రవి బసలింగప్పగౌడ పాటిల్‌పై ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రకారం... ముస్లిం ఓటర్ల వివరాలు ముందుగానే ప్రింట్ చేసి ఉన్న బల్క్ ఫాం-7 (Form-7) దరఖాస్తులను కొందరు వ్యక్తులు తీసుకొచ్చి, సంతకాలు చేయాలని బీఎల్‌వోలపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. తొలగించాలనుకున్న ఆ 198 మంది ఓటర్లు వాస్తవానికి జాబితాలో చూపిన పాత చిరునామాలోనే నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే ముస్లిం ఓటర్లను తొలగించేందుకు నిందితులు ఫాం-7 దరఖాస్తులను సమర్పించారని ఆరోపించారు.
ఈ ఫిర్యాదు మేరకు బీజేపీ నేత రవి పాటిల్ సహా సుమారు 25 మందిపై మోసం, ఫోర్జరీ, క్రిమినల్ కుట్ర వంటి సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై బీజేపీ నేత కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై సెషన్స్ కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రవి పాటిల్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విచారణ సందర్భంగా తాను ఎలాంటి తప్పూ చేయలేదని రవి పాటిల్ కోర్టుకు విన్నవించారు. ఈ ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధం లేదని వాదించారు. వాదనలు విన్న కోర్టు కేవలం ఫాం 7 సమర్పించినంత మాత్రాన అధికారులు ఓటర్ల పేర్లను తొలగించరని స్పష్టం చేసింది. వాటిని ధృవీకరించిన తర్వాతే అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొంది. ఈ మేరకు బీజేపీ నేతకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు ఈ వ్యవహారంపై కర్ణాటక వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర రాజకీయ వివాదం నెలకొంది. తప్పుడు దరఖాస్తుల ద్వారా మైనారిటీల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. అనర్హులైన ఓటర్లను గుర్తించే హక్కు తమకు ఉందని బీజేపీ వాదిస్తోంది. ప్రస్తుతం ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
Also Read..
సోషల్ మీడియాకు ఆధార్‌ను లింక్ చేయాలి - జాన్వీకపూర్ డీప్‌ఫేక్ వీడియోలపై హీరో రామ్‌పోతినేని పోస్ట్
ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తే.. ఏనుగు చంపేసింది
రాజ్యసభ బరిలో ప్రముఖ నటి.. బీజేపీలో చేరిన గంటల వ్యవధిలోనే
తాజావార్తలు
- ●KP Vivekananda | సీఎం రేవంత్ అవినీతిపై రాష్ట్రపతి తక్షణమే జోక్యం చేసుకోవాలి
- ●Ram Pothineni | సోషల్ మీడియాకు ఆధార్‌ను లింక్ చేయాలి - జాన్వీకపూర్ డీప్‌ఫేక్ వీడియోలపై హీరో రామ్‌పోతినేని పోస్ట్
- ●Stock Markets | మార్కెట్లలో భారీ కరెక్షన్.. 84 శాతం నిఫ్టీ షేర్లు 200 డీఎంఏ దిగువకు..
- ●Telangana Junior Lecturers Sacked | నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు: 35 మంది జూనియర్ లెక్చరర్లపై వేటు
- ●Kishan Reddy | సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250ల బోనస్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- ●Gaddam Vamsi Krishna | ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాకా కల.. యువతకు ఉపాధి కల్పించేలా కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

KP Vivekananda | సీఎం రేవంత్ అవినీతిపై రాష్ట్రపతి తక్షణమే జోక్యం చేసుకోవాలి

Ram Pothineni | సోషల్ మీడియాకు ఆధార్‌ను లింక్ చేయాలి - జాన్వీకపూర్ డీప్‌ఫేక్ వీడియోలపై హీరో రామ్‌పోతినేని పోస్ట్

Stock Markets | మార్కెట్లలో భారీ కరెక్షన్.. 84 శాతం నిఫ్టీ షేర్లు 200 డీఎంఏ దిగువకు..

Telangana Junior Lecturers Sacked | నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు: 35 మంది జూనియర్ లెక్చరర్లపై వేటు






