Virat Kohli | ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించడానికి కోహ్లీ రూ.5 కోట్లు తీసుకున్నారా..? క్లారిటీ ఇచ్చిన విరాట్ టీమ్
Virat Kohli | బృందావన్ (Vrindavan)లోని ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని (Premanand Maharaj Ashram) సందర్శించడానికి విరాట్ కోహ్లీ (Virat Kohli) రూ.5 కోట్లు తీసుకున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన టీమ్ ఖండించింది. అవన్నీ తప్పుడు కథనాలేనని కొట్టిపారేసింది.
Virat Kohli | త్రినేత్ర న్యూస్ : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), అనుష్క శర్మ (Anushka Sharma) దంపతులు బృందావన్ (Vrindavan)లోని ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని (Premanand Maharaj Ashram) తరచూ సందర్శిస్తుంటారన్న విషయం తెలిసిందే. ప్రత్యేక సందర్భాలు, సమయం దొరికినప్పుడల్లా ఆశ్రమాన్ని విజిట్ చేస్తుంటారు. అయితే, కోహ్లీ ఆశ్రమాన్ని సందర్శించడంపై వివాదం చెలరేగింది. ఈ ఆశ్రమాన్ని సందర్శించడానికి కోహ్లీ రూ.5 కోట్లు తీసుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ వ్యవహారం ప్రస్తుతం సినీ, రాజకీయ, క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ ప్రచారంపై కోహ్లీ టీమ్ స్పందించింది. ఈ మేరకు మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది. అవన్నీ తప్పుడు కథనాలేనని కొట్టిపారేసింది. ప్రేమానంద్ ఆశ్రమాన్ని విజిట్ చేయడానికి కోహ్లీ ఎలాంటి డబ్బులూ తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. మీడియాలో వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని కొట్టిపారేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కాగా, ప్రేమానంద్ మహారాజ్ తన పాపులారిటీని పెంచుకునేందుకు విరాట్ కోహ్లీకి భారీగా డబ్బులు చెల్లించి ఆశ్రమానికి రప్పిస్తున్నారంటూ శ్రీకృష్ణ జన్మభూమి సంఘర్ష్ న్యాస్ ( Shri Krishna Janmabhoomi Sangharsh Nyas) ఫలహారి మహారాజ్ ఆరోపించిన విషయం తెలిసిందే. కోహ్లీని ఆశ్రమానికి రప్పించడానికి రూ. 5 కోట్లు ముట్టజెప్పినట్లు ఆయన ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై కోహ్లీ టీమ్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. కోహ్లీ.. ప్రేమానంద మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించడం పూర్తిగా వ్యక్తిగతమని, ఆధ్యాత్మిక గురువు పట్ల ఉన్న గౌరవంతోనే వెళ్తున్నట్లు తెలిపింది. విరుష్క జంట 2023 నుంచి ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తున్న విషయం తెలిసిందే.
Also Read..
ధనుష్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఈసీ వద్ద పార్టీ పేరు రిజిస్టర్..?
ఈసీ నియామకాలపై భిన్న తీర్పులు.. పరిశీలిస్తామన్న సీజేఐ ధర్మాసనం
ప్రజల ఆశీర్వాదమే నా బలం.. ప్రతి అనుభవం ఓ పాఠమే : ప్రధాని మోదీ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Virat Kohli | కోహ్లీ మరో చరిత్ర.. వన్డేల్లో 15 వేల పరుగులు.. సచిన్ రికార్డుపైనే కన్ను..!
సెప్టెంబర్ 27, 2026

Ind Vs Wi | వెస్టిండీస్‌తో సిరీస్‌కు రోహిత్–కోహ్లీ సై..
సెప్టెంబర్ 25, 2026

VinayakaChavithi | అత్తింట్లో రష్మిక – కొడుకుతో అల్లు అర్జున్ – స్టార్ హీరోహీరోయిన్ల వినాయక చవితి సెలబ్రేషన్స్
సెప్టెంబర్ 14, 2026
తాజావార్తలు
- ●vivo V80 | వివో వి80 లాంచ్.. 7,200 ఎంఏహెచ్ బ్యాటరీ.. జైస్ కెమెరాతో అదిరిపోయే ఫీచర్లు..
- ●Actor Dhanush | ధనుష్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఈసీ వద్ద పార్టీ పేరు రిజిస్టర్..?
- ●Gold Price | ఆర్బీఐ రేటు పెంపుతో బంగారం మరింత పడుతుందా? కీలక స్థాయిలివే..
- ●Manne Krishank | నాకు చట్టపరంగా బెయిల్ వస్తే.. తెలుగు 360 వెట్సైట్కి ఎందుకంత బాధ: మన్నె క్రిశాంక్
- ●Supreme Court | ఈసీ నియామకాలపై భిన్న తీర్పులు.. పరిశీలిస్తామన్న సీజేఐ ధర్మాసనం
- ●Kiara Advani | రెండోసారి తల్లికాబోతున్న స్టార్ నటి

vivo V80 | వివో వి80 లాంచ్.. 7,200 ఎంఏహెచ్ బ్యాటరీ.. జైస్ కెమెరాతో అదిరిపోయే ఫీచర్లు..

Actor Dhanush | ధనుష్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఈసీ వద్ద పార్టీ పేరు రిజిస్టర్..?

Gold Price | ఆర్బీఐ రేటు పెంపుతో బంగారం మరింత పడుతుందా? కీలక స్థాయిలివే..

Manne Krishank | నాకు చట్టపరంగా బెయిల్ వస్తే.. తెలుగు 360 వెట్సైట్కి ఎందుకంత బాధ: మన్నె క్రిశాంక్



