త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs NZ ODI | ఐదో వన్డేకు టీమిండియాలో మార్పులు.. తుది జట్టులోకి కుల్దీప్‌.. బ్రార్‌ స్థానంలో సిరాజ్‌!

IND Vs NZ ODI | న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం బే ఓవల్‌ వేదికగా చివరి మ్యాచ్‌ జరగనుంది. నాలుగో వన్డేలో 244 పరుగుల భారీ ఓటమిని చవిచూసిన టీమ్‌ఇండియా.. ఆ పరాజయాన్ని మరిపిస్తూ చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను నెగ్గాలనే ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ది. మరోవైపు నాలుగో వన్డేలోనూ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసి సిరీస్‌ను స‌మం చేయాల‌ని కివీస్‌ భావిస్తోంది.

P

Sports | Published On Nov 14, 2026, 3.37 pm IST

IND Vs NZ ODI | ఐదో వన్డేకు టీమిండియాలో మార్పులు.. తుది జట్టులోకి కుల్దీప్‌.. బ్రార్‌ స్థానంలో సిరాజ్‌!
Advertisement

IND Vs NZ ODI | న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం బే ఓవల్‌ వేదికగా చివరి మ్యాచ్‌ జరగనుంది. నాలుగో వన్డేలో 244 పరుగుల భారీ ఓటమిని చవిచూసిన టీమ్‌ఇండియా.. ఆ పరాజయాన్ని మరిపిస్తూ చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను నెగ్గాలనే ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ది. మరోవైపు నాలుగో వన్డేలోనూ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేసి సిరీస్‌ను స‌మం చేయాల‌ని కివీస్‌ భావిస్తోంది. ప్రస్తుతం భారత్‌ 2-1తో ఆధిక్యంలో ఉన్న‌ది. నిర్ణ‌యాత్మ‌క వ‌న్డే కావ‌డంతో మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా సాగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

జట్టులో మార్పులు ఖాయం

ఐదో వన్డేకు ముందు బీసీసీఐ భారత జట్టులో మార్పులు చేసింది. ఫాస్ట్‌ బౌలర్‌ గుర్నూర్‌ బ్రార్‌కు టెస్టు జట్టులో చోటు దక్కడంతో చివరి వన్డేకు అందుబాటులో ఉడ‌డం లేదు. దీంతో టీమ్‌ఇండియా తుది జట్టులో మార్పులు అనివార్యమయ్యాయి. ఇప్పటికే ఈ సిరీస్‌లో 14 మంది ఆటగాళ్లకు భారత్‌ అవకాశం ఇచ్చింది. శుభ్‌మన్‌ గిల్‌, అన్షుల్‌ కాంబోజ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, నితీశ్‌ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఆటగాళ్లకు అవకాశాలు వ‌స్తున్నాయి. ఇక చివరి వన్డేలో స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పర్యటనలో ఇప్పటివరకు పెద్దగా అవకాశాలు దక్కని కుల్దీప్‌.. తన సత్తా చాటాలని భావిస్తున్నాడు. టెస్టు జట్టు నుంచి విడుదలైన అత‌ను న్యూజిలాండ్‌ పర్యటనను ఘనంగా ముగించాలని పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు బ్రార్‌ దూరం కావడంతో మహ్మద్‌ సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. మ్యాచ్‌కు అనుమ‌తి ల‌భిస్తే ఈ సిరీస్‌ను ఇదే తొలి మ్యాచ్ కానుంది.

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులుంటాయా?

నాలుగో వన్డేలో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌ ఖాతా తెరవకుండానే వెనుదిరగడం భారత్‌ను దెబ్బతీసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, అక్షర్‌ పటేల్‌ కూడా బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. దీంతో చివరి వన్డేలో బ్యాటర్లు రాణించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. గిల్‌ స్థానంలో రోహిత్‌తో కలిసి గైక్వాడ్‌ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తున్నాడు. ఐదో వన్డేలోనూ ఇదే ఓపెనింగ్‌ జోడీ కొనసాగే అవకాశాలున్నాయి.

పేసర్లకు అనుకూలంగా పిచ్‌..

బే ఓవల్‌ పిచ్‌ సాధారణంగా ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలిస్తుంది. ముఖ్యంగా తొలి ఓవర్లలో బంతి స్వింగ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్రీజులో కుదురుకుంటే బ్యాటర్లు భారీ స్కోర్లు చేసే వీలుంది. ఆదివారం మౌంట్‌ మాంగనుయ్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. దీంతో పేసర్లకు మరింత సహకారం ల‌భించే ఛాన్స్ ఉంది. అయితే, వర్షం పడే అవకాశాలు మాత్రం దాదాపు లేవు. ఇదిలా ఉండ‌గా.. టీ20 సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్‌.. వన్డే సిరీస్‌ను కాపాడుకోవాలని చూస్తోంది. ఐదో వన్డేలో గెలిస్తే సిరీస్‌ను 2-2తో సమం చేసే అవ‌కాశం ఉన్న‌ది. టెస్టు జట్టులోకి మాట్‌ హెన్రీ, కైల్‌ జేమీసన్‌ వెళ్లడంతో కివీస్‌ తుది జట్టులోనూ మార్పులు జ‌రుగ‌నున్నాయి. ఆ ఇద్ద‌రి స్థానంలో జాకబ్‌ డఫీకి అవకాశం ద‌క్కే అవ‌కాశం ఉంది.

ఇరు జట్ల అంచనా

భారత్‌: రోహిత్‌ శర్మ, రుతురాజ్‌ గైక్వాడ్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), నమన్‌ ధీర్‌, అక్షర్‌ పటేల్‌, ఆకిబ్‌ నబీ, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

న్యూజిలాండ్‌: విల్‌ యంగ్‌, టిమ్‌ సీఫెర్ట్‌ (వికెట్‌ కీపర్‌), నిక్‌ కెల్లీ, డీన్‌ ఫాక్స్‌క్రాఫ్ట్‌, ఫిన్‌ అలెన్‌, మైకేల్‌ బ్రేస్‌వెల్‌, మిచెల్ శాంట్నర్‌ (కెప్టెన్‌), క్రిస్టియన్‌ క్లార్క్‌, మాట్‌ ఫిషర్‌, జాకబ్‌ డఫీ, బ్లెయిర్‌ టిక్నర్‌.

Advertisement
Advertisement