త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Noida | నోయిడాలో హింసాత్మ‌కంగా మారిన‌ కార్మికుల ఆందోళ‌న‌.. వాహ‌నాల‌కు నిప్పు

Noida | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నోయిడాలో (Noida) ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఓ ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌ కార్మికులు (workers) చేప‌ట్టిన ఆందోళ‌న హింసాత్మ‌కంగా మారింది.

D

National | Published On Apr 13, 2026, 12.53 pm IST

Noida | నోయిడాలో హింసాత్మ‌కంగా మారిన‌ కార్మికుల ఆందోళ‌న‌.. వాహ‌నాల‌కు నిప్పు
Advertisement

Noida | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నోయిడాలో (Noida) ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఓ ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌ కార్మికులు (workers) చేప‌ట్టిన ఆందోళ‌న హింసాత్మ‌కంగా మారింది. క‌నీస వేత‌నాలు అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్య‌లో కార్మికులు రోడ్ల‌పైకి వ‌చ్చి నిర‌స‌న చేప‌ట్టారు. నోయిడా ఫేజ్-2లోని ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన వందలాది మంది కార్మికులు జీతాలు పెంచాలంటూ కంపెనీ గేటు వద్ద ఆందోళనకు దిగారు. యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలోనే వారు హింసకు పాల్పడ్డారు. ప‌రిశ్ర‌మ‌పైకి రాళ్లు రువ్వారు. ప‌లు వాహ‌నాల‌కు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు రంగ‌ప్ర‌వేశం చేశారు. ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీఛార్జ్ చేశారు. టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించారు. ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో కార్మికుల‌తోపాటూ ప‌లువురు పోలీసులుసైతం గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం న‌గ‌రంలో ప‌రిస్థితి అదుపులోనే ఉన్న‌ట్లు పోలీసు అధికారి ఒక‌రు తెలిపారు. హింస‌కు పాల్ప‌డిన వారిని గుర్తించి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు స్థానిక పోలీసులను భారీగా మోహరించారు.

Also Read..

వాట్సాప్‌లో వ‌స్తున్న అద్భుత‌మైన ఫీచ‌ర్.. ఇక‌పై మెసేజ్‌ల‌ను ఓపెన్ చేయ‌కుండానే చ‌ద‌వ‌వ‌చ్చు..

బాణాసంచా గోదాంలో భారీ పేలుడు.. త‌మిళ‌నాడులో ఘ‌ట‌న‌

భార‌త్‌కు చేరుకున్న ఇరాన్ ముడిచ‌మురు నౌక‌లు.. ఏడేళ్ల త‌ర్వాత తొలిసారి

Advertisement

తాజావార్తలు

Advertisement