Whatsapp | వాట్సాప్‌లో వస్తున్న అద్భుతమైన ఫీచర్.. ఇకపై మెసేజ్‌లను ఓపెన్ చేయకుండానే చదవవచ్చు..
Whatsapp | ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ను తన వినియోగదారులకు అందించనుంది. వాట్సాప్ వినియోగం పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఒక్కో యూజర్ రోజూ వందల కొద్దీ మెసేజ్ లను రిసీవ్ చేసుకుంటున్నారు. దీంతో అన్ని మెసేజ్‌లను చదవడం కష్టంగా మారుతోంది.
Technology | Published On Apr 13, 2026, 12.37 pm IST
Whatsapp | ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ను తన వినియోగదారులకు అందించనుంది. వాట్సాప్ వినియోగం పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఒక్కో యూజర్ రోజూ వందల కొద్దీ మెసేజ్ లను రిసీవ్ చేసుకుంటున్నారు. దీంతో అన్ని మెసేజ్‌లను చదవడం కష్టంగా మారుతోంది. ఈ క్రమంలో చాలా మంది యూజర్లు తమకు వచ్చే మెసేజ్‌లను చదవకుండా వదిలేయడం లేదా గ్రూప్‌లలో ఉండే నోటిఫికేషన్లను మ్యూట్ చేయడం చేస్తున్నారు. దీని వల్ల ముఖ్యమైన మెసేజ్‌లను చదవకుండా మిస్ అవుతున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం కోసం వాట్సాప్ త్వరలో ఓ నూతన ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. అన్‌రెడ్ చాట్ సమ్మరీ అనే కొత్త ఫీచర్‌ను ఆ సంస్థ అభివృద్ధి చేస్తోంది. దీని సహాయంతో యూజర్లు వాట్సాప్‌లో మెసేజ్‌లను ఓపెన్ చేయకుండానే చదవవచ్చు.
మెసేజ్‌లను చదివి చెప్పే ఏఐ..
వాట్సాప్ ఈ ఫీచర్ వల్ల యూజర్లు చదవని మెసేజ్‌లను సంక్షిప్తంగా, సులభంగా అర్థమయ్యే విధానంలో వాటి సారాంశాలను తెలుసుకోవచ్చు. దీంతో మెసేజ్ చదవకుండా మిస్ అవదు. అయితే ఈ మెసేజ్‌ల సారాంశాన్ని చదివి చెప్పేందుకు వాట్సాప్ మాతృసంస్థ మెటాకు చెందిన ఏఐ పనిచేస్తుంది. యూజర్ ముందుగా తాను ఏ గ్రూప్ లేదా ఏ యూజర్ పంపే మెసేజ్‌లను ఏఐ ద్వారా చదవదలచుకున్నాడో వాటికి పర్మిషన్ ఇవ్వాలి. దీంతో ఆయా గ్రూప్‌లు లేదా యూజర్లు పంపే మెసేజ్‌లను చదవని పక్షంలో ఏఐ వాటిని చదివి వాటి సారాంశాన్ని సంక్షిప్తంగా యూజర్‌కు తెలియజేస్తుంది. అయితే కేవలం యూజర్ చదవని మెసేజ్‌లను మాత్రమే ఏఐ యాక్సెస్ చేస్తుంది. చదివిన మెసేజ్‌లను యాక్సెస్ చేయలేదు.
పూర్తి స్థాయిలో సేఫ్టీ..
వాట్సాప్ లో రానున్న ఈ ఫీచర్ వల్ల పెద్ద ఎత్తున రోజూ మెసేజ్‌లను పొందే యూజర్లకు మెసేజ్‌లను చదవడం ఇకపై సులభతరం అవుతుంది. అలాగే గ్రూప్ చాట్‌లను నిర్వహించేవారికి, అందులో ఉండేవారికి కూడా ఈ ఫీచర్ పనిచేస్తుంది. అయితే ఏఐ వినియోగం వల్ల ప్రైవసీకి భంగం కలుగుతుందా, ఏఐ యూజర్ల సందేశాలను చదువుతుంది కదా, అప్పుడు డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఈ ఫీచర్ సురక్షితమేనా.. అని యూజర్లకు సందేహాలు వస్తుంటాయి. అయితే వీటికి మెటా సమాధానం చెప్పింది. యూజర్లకు చెందిన చదవని (Unread) మెసేజ్‌లను మాత్రమే ఏఐ యాక్సెస్ చేస్తుంది. చదివిన మెసేజ్‌లను యాక్సెస్ చేయలేదు. అలాగే ఏఐ ఆ సందేశాలను ప్రైవేట్ ప్రాసెసింగ్ అనే ప్రత్యేక సిస్టమ్ ద్వారా విశ్లేషిస్తుంది. దీని వల్ల అత్యంత సురక్షితమైన వాతావరణంలో యూజర్ల మెసేజ్‌లను ఏఐ చదివి ప్రాసెస్ చేస్తుంది. అలాగే సందేశాల్లో ఉన్న వివరాలను మాత్రమే ప్రాసెస్ చేస్తుంది కానీ మొత్తం సందేశాన్ని స్టోర్ చేయదు. దీని వల్ల యూజర్లకు ప్రైవసీ కూడా ఉంటుందని మెటా తెలిపింది.
బీటా యూజర్లకు అందుబాటులోకి..
వాట్సాప్‌లో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్‌పై యూజర్లకు పూర్తి స్థాయిలో నియంత్రణ ఉంటుంది. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆఫ్ లో ఉంటుంది. యూజర్లు తాము కోరుకున్న చాట్‌లకు మాత్రమే ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక ఈ ఫీచర్‌ను వాట్సాప్ ప్రస్తుతం టెస్ట్ చేస్తుండగా బీటా వెర్షన్‌ను వాడుతున్న యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్లందరికీ ఈ ఫీచర్‌ను అందించనున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






