Noida Airport | నోయిడా నుంచి తొలి విమానం నవీ ముంబయికే..! ఈ నెల 10 నుంచి టికెట్ల బుకింగ్..!
Noida Airport | నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి విమానం నవీ ముంబయికి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు పారిశ్రామిక నగరాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపర్చడమే దీని లక్ష్యంగా భావిస్తున్నారు. ఇందుకోసం నోయిడా ఎయిర్‌పోర్ట్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది.
Noida Airport | నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి విమానం నవీ ముంబయికి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు పారిశ్రామిక నగరాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపర్చడమే దీని లక్ష్యంగా భావిస్తున్నారు. ఇందుకోసం నోయిడా ఎయిర్‌పోర్ట్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. సేవలను నిర్వహించే ఇండిగో ఎయిర్‌లైన్స్ మే 10 నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభించే అవకాశముందని సమాచారం. విమానాశ్రయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. చర్చల సమయంలో నవీ ముంబయికి నడిపేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే, బెంగళూరుకు కూడా విమాన సర్వీసులు ప్రారంభించే ప్రణాళిక ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇండిగో సంస్థ ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, గోవా, జైపూర్, లక్నో, కోల్‌కతా నగరాలను నోయిడాతో అనుసంధానించేందుకు సిద్ధమవుతోంది. ఆకాసా ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు సైతం ఇలాంటి ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. అవసరమైన ఏర్పాట్ల కోసం ఈ ఎయిర్‌లైన్స్ యపాల్‌కు ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలుస్తోంది. జూన్ 15 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో సాఫ్ట్ ట్రయల్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ప్రయాణికుల రాకపోకలకు ముందు అక్కడి సిబ్బందికి అన్ని ఏర్పాట్లకు సంబంధించి వివరించేందుకు ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రయాణికులకు సేవలు అందించే సంస్థలు, సిబ్బందికి ఎయిర్‌పోర్ట్ ఎంట్రీ పాస్‌లు జారీ చేస్తున్నారు. జూన్ 15 నాటికి వాణిజ్య కార్యకలాపాలకు విమానాశ్రయాన్ని సిద్ధం చేసేందుకు అధికారులు చర్యలను ముమ్మరం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kayadu Lohar | పొడవాటి జడ.. ట్రెడిషనల్ లుక్.. కయదు అదుర్స్!
సెప్టెంబర్ 6, 2026

Harish Rao | యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలి.. హరీశ్‌రావు డిమాండ్
సెప్టెంబర్ 6, 2026

NTR Movie | ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ మూవీపై క్రేజీ అప్డేట్.. ఇద్దరు భామలతో స్పెషల్ సాంగ్‌కు ప్లాన్!
సెప్టెంబర్ 6, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం
- ●TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి
- ●KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్
- ●Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక
- ●Harish Rao | వార్డు మెంబర్ కూడా కాని.. తిరుపతి రెడ్డికి రూ. 40 కోట్లతో భద్రత అవసరమా..?
- ●Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంతే రాజీనామా చేయాలి

CM Revanth Reddy | నర్సు హత్య ఘటనపై మెజిస్ట్రీయల్ విచారణకు సీఎం ఆదేశం

TRESA | ట్రెసా అధ్యక్షులుగా కే గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎల్ రమణ్ రెడ్డి

KCR | సాగునీటి కోసం మరో యుద్ధానికి సిద్ధం : కేసీఆర్

Ananthika | మార్షల్ ఆర్ట్స్‌తో క్రమశిక్షణ : అనంతిక



