Iranian oil | భారత్‌కు చేరుకున్న ఇరాన్ ముడిచమురు నౌకలు.. ఏడేళ్ల తర్వాత తొలిసారి
Iranian oil | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ ముడిచమురుతో (Iranian oil) రెండు నౌకలు భారత్ (India)కు చేరుకున్నాయి. ఓ నౌక ఒడిశాలోని పారాదీప్ ఓడరేవుకు చేరుకోగా.. మరొకటి గుజరాత్‌లోని సిక్కా ఓడరేవులో లంగరు వేసింది.
Iranian oil | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ ముడిచమురుతో (Iranian oil) రెండు నౌకలు భారత్ (India)కు చేరుకున్నాయి. ఓ నౌక ఒడిశాలోని పారాదీప్ ఓడరేవుకు చేరుకోగా.. మరొకటి గుజరాత్‌లోని సిక్కా ఓడరేవులో లంగరు వేసింది. నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీకి చెందిన ఈ రెండు నౌకలు మార్చి తొలివారంలో ఖర్గ్ ద్వీపం నుంచి చమురు లోడ్ చేసుకున్నట్లు షిప్ ట్రాకింగ్ డేటా ద్వారా తెలుస్తోంది. ఈ రెండు నౌకలు దాదాపు 2 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును మోసుకొచ్చినట్లు సమాచారం. దీంతో దాదాపు ఏడేళ్ల బ్రేక్ తర్వాత ఇరాన్ ముడి చమురు మన దేశానికి చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముడిచమురు ధరలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ ముడి చమురు (Iranian crude oil)పై విధించిన ఆంక్షలను అమెరికా ఇటీవలే ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఇరాన్ చమురు కొనుగోలుకు భారతీయ చమురు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో ఏడేళ్ల తర్వాత తొలిసారి ఇరాన్ చమురు భారత్‌కు చేరుకుంది. అయితే, తాజాగా మన పోర్టులకు చేరుకున్న ముడిచమురు నౌకలను ఎవరు కొనుగోలు చేశారన్నదానిపై మాత్రం స్పష్టతలేదు.
2019 మే నెలలో అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇరాన్ చమురు భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. 2018లో భారత్ రోజుకు సుమారు 5,18,000 బ్యారెళ్ల ఇరాన్ చమురును దిగుమతి చేసుకోగా.. మే 2019 నాటికి అది రోజుకు 2,68,000 బ్యారెళ్లకు తగ్గింది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు 350 మిలియన్ డాలర్ల విలువైన 50 లక్షల బ్యారెళ్ల ఇరాన్ చమురును కొనుగోలు చేసినట్లు సమాచారం.
Also Read..
రూ.11 లక్షల మెగా స్పెషల్ పూజ.. చార్‌ధామ్‌లో పెరిగిన పూజా రుసుములు
2 ఏళ్ల లోపు చిన్నారులకు ఇక దగ్గు సిరప్‌లు నిషేధం.. పరిశీలిస్తున్న కేంద్రం..
ఈక్విటీ మార్కెట్ల ప్రభావం.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






