త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fireworks blast | బాణాసంచా గోదాంలో భారీ పేలుడు.. త‌మిళ‌నాడులో ఘ‌ట‌న‌

Fireworks blast | గ‌త ఫిబ్ర‌వ‌రిలో ఏపీలో జరిగిన బాణాసంచా పేలుడు ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే తమిళనాడు(Tamil Nadu)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విరుధ్‌నగర్‌ జిల్లా సాత్తూర్(Sattur) లోని ఓ బాణాసంచా గోదాం(Fireworks)లో సోమవారం ఉదయం భారీ పేలుడు (Blast) సంభవించింది.

S

News | Published On Apr 13, 2026, 12.22 pm IST

Fireworks blast | బాణాసంచా గోదాంలో భారీ పేలుడు.. త‌మిళ‌నాడులో ఘ‌ట‌న‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: గ‌త ఫిబ్ర‌వ‌రిలో ఏపీలో జరిగిన బాణాసంచా పేలుడు ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే తమిళనాడు(Tamil Nadu)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విరుధ్‌నగర్‌ జిల్లా సాత్తూర్(Sattur) లోని ఓ బాణాసంచా గోదాం(Fireworks)లో సోమవారం ఉదయం భారీ పేలుడు (Blast) సంభవించింది. ఈ ప్ర‌మాదంలో సుమారు ఐదు గదులు పూర్తిగా ధ్వంసమ‌య్యాయి. ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న స‌మ‌యంలో గోదాంలో దాదాపు 60 మంది ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చ‌ని అధికారులు భావిస్తున్నారు.

గోదాం లోప‌ల 60 మంది..

కార్మికులు ఉద‌యం నుంచి టపాసులు తయారు చేస్తుండగా అక‌స్మాత్తుగా పేలుడు జ‌రిగిన‌ట్లు ప్రాథమిక సమాచారం. గోదాంలో దాదాపు 60 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాద విష‌యాన్ని తెలుసుకున్న పోలీసు అధికారులు, ఫైర్ ఇంజిన్లు హుటాహుటిన ఘటనా స్థలానికి బ‌య‌లుదేరి వెళ్లారు. వేస‌వి కావ‌డంతో మంట‌లను ఆర్ప‌డానికి ఫైరింజన్లతో తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ప్ర‌మాద స‌మ‌యంలో ఎక్కువ‌ మంది కార్మికులు లోపలే ఉన్నారని సంబంధిత యాజ‌మాన్యం చెబుతోంది. ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

కాగా గ‌త ఫిబ్ర‌వ‌రి చివరిలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా, సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో బాణాసంచా పేలుడు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ పేలుడులో సుమారు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 11 మందికి పైగా గాయపడిన ఈ ఘ‌ట‌న‌ స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ట్యాగ్స్:

Advertisement
Advertisement