త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nosh Pharma | మే డే రోజే విషాదం.. నోష్ ఫార్మాలో పేలిన రియాక్ట‌ర్.. 9 మందికి తీవ్ర గాయాలు

Nosh Pharma | మే డే రోజే విషాదం నెల‌కొంది. మే డే వేడుక‌లు నిర్వ‌హించుకుని త‌మ విధి నిర్వ‌హ‌ణ‌లో నిమ‌గ్న‌మైన కార్మికులు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. న‌ల్ల‌గొండ జిల్లా వెలిమినేడు గ్రామ ప‌రిధిలోని నోష్ ఫార్మాలో రియాక్ట‌ర్ పేల‌డంతో.. 9 మంది కార్మికుల‌కు తీవ్ర గాయాలు కాగా, ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

S

Telangana | Published On May 1, 2026, 3.34 pm IST

Nosh Pharma | మే డే రోజే విషాదం.. నోష్ ఫార్మాలో పేలిన రియాక్ట‌ర్.. 9 మందికి తీవ్ర గాయాలు
Advertisement

Nosh Pharma | త్రినేత్ర‌.న్యూస్ : మే డే రోజే విషాదం నెల‌కొంది. మే డే వేడుక‌లు నిర్వ‌హించుకుని త‌మ విధి నిర్వ‌హ‌ణ‌లో నిమ‌గ్న‌మైన కార్మికులు తీవ్ర గాయాల‌పాల‌య్యారు. న‌ల్ల‌గొండ జిల్లా వెలిమినేడు గ్రామ ప‌రిధిలోని నోష్ ఫార్మాలో రియాక్ట‌ర్ పేల‌డంతో.. 9 మంది కార్మికుల‌కు తీవ్ర గాయాలు కాగా, ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

నోష్ ఫార్మా కంపెనీలోని థ‌ర్డ్ బ్లాక్‌లో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం బ్లాస్ట్ చోటు చేసుకుంది. ఈ పేలుడు కార‌ణంగా.. 9 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. అప్ర‌మ‌త్త‌మైన కంపెనీ సిబ్బంది.. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

అయితే పేలుడు గ‌ల కార‌ణాల‌ను ఫార్మా కంపెనీ ఇంత‌వ‌ర‌కు నిర్ధారించలేదు. స్పందించ‌లేదు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

రెండు వారాల క్రిత‌మే ప్ర‌మాదం..

ఇదే నోష్ ఫార్మా కంపెనీలో రెండు వారాల క్రిత‌మే ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు వ‌ర్క‌ర్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఫార్మా యూనిట్‌లో ప్ర‌మాదాలు త‌రుచుగా జ‌రుగుతున్నాయ‌ని కార్మికులు పేర్కొన్నారు. నెలరోజులు కూడా గడవకుండానే రెండు ప్రమాదాలు జర‌గ‌డంతో కార్మికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

Advertisement
Advertisement