Tamil Nadu | నేడు విజయ్ సర్కార్‌కు బలపరీక్ష.. గట్టెక్కడం సులభమే!
Tamil Nadu | తమిళనాడులో (Tamil Nadu) విజయ్ నేతృత్వంలో టీవీకే (TVK) ప్రభుత్వం కొలువుదీరింది. గవర్నర్ ఆదేశాల మేరకు అసెంబ్లీలో తన బలం (Trust Vote) నిరూపించుకోనుంది.
Tamil Nadu | త్రినేత్ర.న్యూస్: తమిళనాడులో (Tamil Nadu) విజయ్ నేతృత్వంలో టీవీకే (TVK) ప్రభుత్వం కొలువుదీరింది. గవర్నర్ ఆదేశాల మేరకు అసెంబ్లీలో తన బలం (Trust Vote) నిరూపించుకోనుంది. ఇప్పటికే మెజార్టీ మార్కును దాటిన టీవీకేకు అన్నాడీఎంకేకు (AIADMK) చెందిన 30 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. దీంతో ప్రభుత్వం విశ్వాస పరీక్షలో గట్టెక్కడం సులభం కానుంది.
మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో.. టీవీకేకు 108 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే సీఎం విజయ్ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీచేసిన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆర పార్టీకి 107 మందే ఉన్నారు. కాగా, ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందిన టీవీకే తిరుపత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి.. అసెంబ్లీలో జరిగే ఓటింగ్‌లో పాల్గొన రాదని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 106కి తగ్గింది. కాంగ్రెస్ 5, సీపీఐ, సీపీఎం 4, వీసీకే 2, ఐయూఎంల్ 2, ఏఎంఎంకే 1 మద్దతుతో ప్రస్తుతం విజయ్ ప్రభుత్వానికి 120 మంది సభ్యుల మద్దతుంది. 233 మంది ఎమ్మెల్యేలున్న అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 117. అంటే ప్రభుత్వానికి ముగ్గురు సభ్యులు అధికంగా ఉన్నారు.
చీలిన అన్నాడీఎంకే.. మద్దతు విజయ్‌కే
అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి 47 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే విజయ్ ప్రభుత్వానికి మద్దతు విషయంలో ఆ పార్టీ కార్యదర్శి పళనిస్వామి, సీనియర్ నేతలు షణ్ముగం, ఎస్పీ వేలుమణి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి సారథ్యంలో 37 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. చీలిక వర్గం ఎమ్మెల్యేలు 30 మంది విజయ్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో బలపరీక్షలో టీవీకే సర్కార్ గట్టెక్కడం మరింత సులభం కానుంది.
Read Also..
బలపరీక్షకు ముందు టీవీకేకి షాక్.. ఓటింగ్‌లో ఆ ఎమ్మెల్యే పాల్గొనకూడదంటూ ఆదేశం
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



