త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cloudburst | కిష్త్వార్‌లో క్లౌడ్ బ‌ర‌స్ట్‌.. బుర‌ద‌లో కూరుకుపోయిన ప‌లు వాహ‌నాలు.. VIDEO

Cloudburst | జ‌మ్ము క‌శ్మీర్‌లోని కిష్త్వార్ (Kishtwar)లో క్లౌడ్ బ‌ర‌స్ట్ సంభ‌వించింది. 540 మెగావాట్ల క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టు (Kwar Hydroelectric Power Project) వ‌ద్ద‌ క్లౌడ్ బ‌ర‌స్ట్ (Cloudburst) కార‌ణంగా ఒక్క‌సారిగా భారీ ఎత్తున బుర‌ద‌, బండ‌రాళ్లు వ‌ర‌ద‌లా కొట్టుకొచ్చాయి. ప‌లు వాహ‌నాలు బుర‌ద‌లో కూరుకుపోయాయి.

D

National | Published On Jul 6, 2026, 1.01 pm IST

Cloudburst | కిష్త్వార్‌లో క్లౌడ్ బ‌ర‌స్ట్‌.. బుర‌ద‌లో కూరుకుపోయిన ప‌లు వాహ‌నాలు.. VIDEO
Advertisement

Cloudburst | రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో దేశ‌వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. తాజాగా జ‌మ్ము క‌శ్మీర్‌లో రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వ‌ర్షం కార‌ణంగా మెరుపు వ‌ర‌ద‌లు సంభ‌వించాయి. కిష్త్వార్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టు (Kwar Hydroelectric Power Project) వ‌ద్ద‌ క్లౌడ్ బ‌ర‌స్ట్ కార‌ణంగా ఒక్క‌సారిగా భారీ ఎత్తున బుర‌ద‌, బండ‌రాళ్లు వ‌ర‌ద‌లా కొట్టుకొచ్చాయి. దీంతో సైట్ వ‌ద్ద ఉన్న లారీలు, ట్యాంక‌ర్లు బుర‌ద‌లో కూరుకుపోయాయి. అక్క‌డ ఉన్న సిబ్బంది వాహ‌నాలపైకి ఎక్కి ప్ర‌మాదంబారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. స‌మాచారం అందుకున్న అధికారులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఈ ఆక‌స్మిక వ‌ర‌ద‌ల‌కు దోడా-కిష్త్వార్ జాతీయ ర‌హ‌దారి తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ది. పెద్ద పెద్ద బండ‌రాళ్లు, భారీ ఎత్తున బుర‌ద హైవేపైకి కొట్టుకొచ్చింది. దీంతో ర‌హ‌దారిలోని ఒక భాగం తీవ్రంగా దెబ్బ‌తిన‌డంతో వాహ‌న‌రాక‌పోక‌ల‌ను అధికారులు నిలిపివేశారు. ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం సంభ‌వించ‌లేద‌ని అధికారులు తెలిపారు. ఎవ‌రికీ ఎలాంటి గాయాలూ కాలేద‌న్నారు. ప్ర‌స్తుతం అక్క‌డ స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

Also Read..

కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు వ‌చ్చిన‌ 116 ఏళ్ల వృద్ధురాలికి.. వీఐపీ బ్రేక్ ద‌ర్శనం

బెంగాల్ రాజ్య‌స‌భ ఉప ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌

మూడు రోజుల్లో 56 వేల మంది ద‌ర్శ‌నం.. 90% క‌రిగిపోయిన మంచు లింగం..!

Advertisement
Advertisement