త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jammu and Kashmir Terrorism | జీరో కిల్లింగ్స్‌ : 30 ఏళ్ల కశ్మీర్ చరిత్రలో సరికొత్త రికార్డు

జమ్మూ కశ్మీర్ చరిత్రలో 30 ఏళ్ల తర్వాత ఒక అద్భుతం జరిగింది. మే నెలలో ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదు. 4,011 నుంచి కేవలం 12కు పడిపోయిన మరణాలు. అసలేం జరిగిందంటే?

J

National | Published On Jun 1, 2026, 5.30 pm IST

Jammu and Kashmir Terrorism | జీరో కిల్లింగ్స్‌ : 30 ఏళ్ల కశ్మీర్ చరిత్రలో సరికొత్త రికార్డు
Advertisement
  • టెర్రర్ ఫ్రీ మంత్‌గా మే నెల

Jammu and Kashmir Terrorism | త్రినేత్ర.న్యూస్ : జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir) అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కాల్పుల మోత, ఉగ్రవాదుల దాడులు, రక్తపాతం. కానీ మూడు దశాబ్దాల తర్వాత కశ్మీర్ లోయలో ఒక ఊహించని, అద్భుతమైన మార్పు చోటుచేసుకుంది. 30 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా.. గత మే నెలలో ఒక్క ఉగ్రవాద సంబంధిత మరణం (Terror-related killing) కూడా నమోదు కాలేదు. భద్రతా బలగాల ఆపరేషన్స్, నిఘా వర్గాల పక్కా ప్లానింగ్ వల్ల ఈ అసాధ్యం సుసాధ్యమైంది.

అధికారిక లెక్కల ప్రకారం, 2026 మొదటి ఐదు నెలల్లో కేవలం 12 మరణాలు మాత్రమే రికార్డయ్యాయి. ఇందులో 9 మంది ఉగ్రవాదులు (Terrorists) కాగా, ఒకరు భద్రతా సిబ్బంది, ఒక స్థానికుడు, మరొక గుర్తుతెలియని వ్యక్తి ఉన్నారు. అత్యంత సంతోషకరమైన విషయం ఏంటంటే.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఒక్క సాధారణ పౌరుడు (Civilian) కూడా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోలేదు.

ఒకప్పుడు నెత్తురోడిన 'మే' మాసం.. ఇప్పుడు ప్రశాంతం

ఒకప్పుడు కశ్మీర్‌లో మే నెల అంటేనే నెత్తుటేరులు పారేవి. 2000 మే నెలలో 288 మరణాలు సంభవించగా.. అత్యంత హింసాత్మకమైన 2001 మే నెలలో ఏకంగా 300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో పౌరులు, భద్రతా బలగాలు, ఉగ్రవాదులు.. ఇలా ఎక్కడో ఒకచోట రోజూ ప్రాణనష్టం జరుగుతూనే ఉండేది. ఆ తర్వాత క్రమంగా మరణాల సంఖ్య తగ్గుతూ వచ్చినా, 2016 నుంచి 2019 మధ్యలో ఉగ్రవాద కార్యకలాపాలు మళ్లీ కాస్త ఊపందుకున్నాయి. ఆ సమయంలో ప్రతి ఏటా మే నెలలో సగటున 37 మరణాలు నమోదయ్యాయి. కానీ 2026 నాటికి ఈ సంఖ్య పూర్తిగా "జీరో" కి చేరుకోవడం విశేషం.

భద్రతా దళాల మాస్టర్ స్ట్రోక్..

ఈ మార్పు రాత్రికి రాత్రి రాలేదు. దీని వెనుక భద్రతా దళాల (Security Forces) అలుపెరగని శ్రమ ఉంది. నిరంతర 'కౌంటర్-ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ (Counter-insurgency operations)', పక్కా ఇంటెలిజెన్స్ (Intelligence) కోఆర్డినేషన్‌తో ఉగ్ర నెట్‌వర్క్‌ల నడ్డి విరిచారు.

J&K records sharp drop in terror-related death toll; 92 killed in 2025

"ఉగ్రవాద సంస్థలకు స్థానికంగా లభించే మద్దతు పూర్తిగా కనుమరుగైంది. యువత ఉగ్రవాదం వైపు వెళ్లడం (Local recruitment) పూర్తిగా తగ్గింది. మరోవైపు భద్రతా సంస్థలు సమస్యాత్మక ప్రాంతాల్లో తమ ఆపరేషన్స్‌ను మరింత ముమ్మరం చేశాయి" అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక సీనియర్ పోలీసు అధికారి వివరించారు.

చొరబాట్లకు చెక్..

రెండు దశాబ్దాల క్రితం ఉన్న కశ్మీర్ పరిస్థితులకు, ఇప్పటి వాతావరణానికి అసలు పోలికే లేదని ఓ సీనియర్ ఆర్మీ (Army) అధికారి పేర్కొన్నారు. బోర్డర్‌లో చొరబాట్లను (Infiltration) దాదాపుగా అడ్డుకున్నామని, ఉగ్రవాదులు తిరిగి పుంజుకోకుండా బలగాలు అడ్డుకట్ట వేశాయని ఆయన తెలిపారు.

4,011 నుంచి.. సింగిల్ డిజిట్‌కు!

వార్షిక మరణాల లెక్కలను చూస్తే కశ్మీర్‌లో వచ్చిన మార్పు ఎంత భారీగా ఉందో అర్థమవుతుంది. 2001లో ఏకంగా 4,011 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో వెయ్యి మందికి పైగా పౌరులు, 628 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. కానీ ఇప్పుడు పౌరుల మరణాలు సున్నాకి చేరుకోగా.. భద్రతా సిబ్బంది మరణాలు కేవలం ఒకటికి పరిమితమయ్యాయి.

అయితే, రికార్డుల్లో 'జీరో కిల్లింగ్స్' అని ఉన్నప్పటికీ ఉగ్రవాద ముప్పు పూర్తిగా తొలగిపోలేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ లోయలోని కొన్ని ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ (Search operations) కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement