Bharti Airtel | అమర్‌నాథ్ యాత్ర మార్గాల్లో ఎయిర్‌టెల్ ఫుల్ సిగ్నల్.. నెట్‌వర్క్‌ను విస్తరించిన సంస్థ..
Bharti Airtel | దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు, భద్రతా బలగాలు, స్థానిక పరిపాలన అధికారులకు మెరుగైన కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు యాత్ర మార్గాల్లో తన మొబైల్ నెట్‌వర్క్ కవరేజీని విస్తరించింది.
Technology | Published On Jul 3, 2026, 3.25 pm IST
Bharti Airtel | దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్ అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు, భద్రతా బలగాలు, స్థానిక పరిపాలన అధికారులకు మెరుగైన కమ్యూనికేషన్ సేవలు అందించేందుకు యాత్ర మార్గాల్లో తన మొబైల్ నెట్‌వర్క్ కవరేజీని విస్తరించింది. ఎయిర్‌టెల్ చందన్‌వారి, పిస్సు టాప్, బీటాబ్ వ్యాలీ ప్రాంతాల్లో కొత్త నెట్‌వర్క్ సైట్లను ఏర్పాటు చేసి, పహల్‌గామ్ మార్గం వెంట కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే బాల్టాల్ ప్రాంతంలో ఉన్న సంస్థ నెట్‌వర్క్‌తో కలిపి, అమర్‌నాథ్ గుహ ఆలయానికి వెళ్లే ప్రధాన యాత్ర మార్గాలన్నింటిలోనూ నెట్‌వర్క్ సేవలను మరింత బలోపేతం చేసింది. సంస్థ ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ అధికారులు, స్థానిక పరిపాలనతో సమన్వయం చేసుకుని ఈ నెట్‌వర్క్ విస్తరణ చేపట్టామని వెల్లడించింది. వార్షిక అమర్‌నాథ్ యాత్ర కాలంలో కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే ఈ చర్య ప్రధాన లక్ష్యమని తెలిపింది.
కమ్యూనికేషన్, డిజిటల్ సేవలు పొందవచ్చు..
విస్తరించిన నెట్‌వర్క్ ద్వారా వాయిస్, డేటా సేవలు అందుబాటులో ఉండటంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో కమ్యూనికేషన్ సౌకర్యాలు, డిజిటల్ సేవలను వినియోగించుకునే అవకాశం యాత్రికులకు లభిస్తుందని భారతి ఎయిర్‌టెల్ తెలిపింది. క్లిష్టమైన భౌగోళిక ప్రాంతాల్లో టెలికాం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ప్రాంతీయ మార్గాల్లో డిజిటల్ కనెక్టివిటీని విస్తరించడం కోసం సంస్థ చేపడుతున్న నిరంతర ప్రయత్నాల్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని అమలు చేసినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా భారతి ఎయిర్‌టెల్ జమ్మూ-కాశ్మీర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విక్రమ్ ఆర్‌ఎస్ మాట్లాడుతూ అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో కూడా ప్రజలను, అత్యవసర సేవలను అనుసంధానించేందుకు ఎయిర్‌టెల్ కట్టుబడి ఉందని తెలిపారు. అమర్‌నాథ్ యాత్ర కోసం పహల్‌గామ్, బాల్టాల్ రెండు మార్గాల్లోనూ నెట్‌వర్క్ విస్తరణ చేపట్టడం జమ్మూ-కాశ్మీర్‌లో సంస్థ చేస్తున్న నిరంతర పెట్టుబడులకు నిదర్శనమని చెప్పారు. యాత్రికులు, భద్రతా సిబ్బంది, ప్రభుత్వ అధికారులు యాత్ర మొత్తం సమయంలో విశ్వసనీయమైన కనెక్టివిటీతో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్
- ●Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్

MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?

Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం






