Bikers Perform Stunts | రెచ్చిపోయిన ఆకతాయిలు.. అంబులెన్స్‌కు దారివ్వకుండా
Bikers Perform Stunts | బెంగళూరులో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. బైక్‌పై ప్రమాదకర స్టంట్స్ చేస్తూ (Bikers Perform Stunts) తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్ (Ambulance)కు దారి ఇవ్వకుండా న్యూసెన్స్ సృష్టించారు.
Bikers Perform Stunts | త్రినేత్ర.న్యూస్ : బెంగళూరులో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. బైక్‌పై ప్రమాదకర స్టంట్స్ చేస్తూ (Bikers Perform Stunts) తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్ (Ambulance)కు దారి ఇవ్వకుండా న్యూసెన్స్ సృష్టించారు. అంబులెన్స్‌ను ముందుకు వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా బైక్‌లు నడుపుతూ స్టంట్లు కొనసాగించారు.
గొరగుంటెపాళ్య నుంచి యశ్వంతపూర్ వెళ్లే ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు ఐదు బైకులపై ప్రయాణిస్తూ కొందరు యువకులు రోడ్డుపై ఎలా పడితే అలా ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించారు. ప్రమాదకర స్టంట్స్ ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై ప్రమాదకరంగా ప్రయాణిస్తూ ఇతరులను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. అత్యవసర సేవలకు ఆటంకం కలిగించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు బైకర్లను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
A group of reckless bikers allegedly blocked an ambulance carrying a patient and performed #wheelies despite its siren. The incident occurred around midnight last week between Goraguntepalya and Yeshwanthpur. Cops inform: monitoring CCTV footages, and case to follow. #Bengaluru pic.twitter.com/I2Ht8KSJ8N
— Imran Khan (@KeypadGuerilla) July 6, 2026
తాజావార్తలు
- ●S301 Star | బాప్రే సెకనుకు 25వేల కిలోమీటర్ల వేగం.. అత్యంత వేగంగా దూసుకెళ్తున్న నక్షత్రం !
- ●Cloudscape Observer | మేఘాలను వీడియో తీస్తే రూ.8.5 లక్షల జీతం!
- ●KTR | నేను ఏ మాత్రం నిరాకరించలేని ఆహ్వానం ఇది : కేటీఆర్
- ●Lavu Rathaiah | ప్రభుత్వంలో ఉన్న వారికి బ్రెయిన్ లేదు : లావు రత్తయ్య
- ●CM Revanth Reddy | నా జీవితంలో ఇది గొప్ప క్షణాల్లో ఒకటి : సీఎం రేవంత్ రెడ్డి
- ●Adluri Laxman Kumar | కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. మంత్రి అడ్లూరి డిమాండ్

S301 Star | బాప్రే సెకనుకు 25వేల కిలోమీటర్ల వేగం.. అత్యంత వేగంగా దూసుకెళ్తున్న నక్షత్రం !

Cloudscape Observer | మేఘాలను వీడియో తీస్తే రూ.8.5 లక్షల జీతం!

KTR | నేను ఏ మాత్రం నిరాకరించలేని ఆహ్వానం ఇది : కేటీఆర్

Lavu Rathaiah | ప్రభుత్వంలో ఉన్న వారికి బ్రెయిన్ లేదు : లావు రత్తయ్య





