త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Railways | పిల్లలతో రైలు ప్రయాణం ? ఈ రైల్వే నిబంధన తెలియకపోతే జరిమానా తప్పదు..

Indian Railways | రైలులో పిల్ల‌ల‌తో కలిసి ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లయితే, ముందుగా భారతీయ రైల్వేకు సంబంధించిన ఓ ముఖ్యమైన నిబంధన తెలుసుకోవాలి. పిల్లలకు ప్రత్యేక సీటు అవసరం లేకపోతే టికెట్ కూడా అవసరం ఉండదని చాలామంది భావిస్తారు. కానీ ప్రతి సందర్భంలో అది నిజం కాదు.

S

Business | Published On Jul 6, 2026, 1.31 pm IST

Indian Railways | పిల్లలతో రైలు ప్రయాణం ? ఈ రైల్వే నిబంధన తెలియకపోతే జరిమానా తప్పదు..
Advertisement

Indian Railways | రైలులో పిల్ల‌ల‌తో కలిసి ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లయితే, ముందుగా భారతీయ రైల్వేకు సంబంధించిన ఓ ముఖ్యమైన నిబంధన తెలుసుకోవాలి. పిల్లలకు ప్రత్యేక సీటు అవసరం లేకపోతే టికెట్ కూడా అవసరం ఉండదని చాలామంది భావిస్తారు. కానీ ప్రతి సందర్భంలో అది నిజం కాదు. 5 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల కోసం రైల్వేలో ఎన్‌వోఎస్‌బీ (NOSB) అనే ప్రత్యేక టికెట్ నిబంధన ఉంది. ఈ టికెట్‌తో పిల్లలు రైలులో ప్రయాణించవచ్చు, అయితే వారికి ప్రత్యేక సీటును కేటాయించరు. అవసరమైనప్పుడు ఈ టికెట్ తీసుకోకపోతే టికెట్ తనిఖీ సమయంలో జరిమానా చెల్లించాల్సి వ‌స్తుంది. అందుకే టికెట్ బుక్ చేసుకునే ముందు ఈ సులభమైన నిబంధనను తెలుసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.

ఎవ‌రికి అవ‌స‌రం..

పిల్లల వయస్సు 5 నుంచి 11 సంవత్సరాల మధ్య ఉండి, వారికి ప్రత్యేక సీటు అవసరం లేదని భావిస్తే, ఎన్‌వోఎస్‌బీ టికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రత్యేక టికెట్ అవసరం లేదు. వారు టికెట్ లేకుండానే ప్రయాణించవచ్చు. కానీ వారికి కూడా ప్రత్యేక సీటును ఇవ్వరు. ఎన్‌వోఎస్‌బీ టికెట్‌కు సాధారణంగా పూర్తి టికెట్ ధరలో సుమారు సగం వరకు చార్జీ వసూలు చేస్తారు. దీనికి అదనంగా కొన్ని ఇతర చార్జీలు కూడా ఉంటాయి. ఒకవేళ పిల్లలకు ప్రత్యేక సీటు కావాలంటే మాత్రం పూర్తి టికెట్ కొనుగోలు చేసి, పూర్తి చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఎన్‌వోఎస్‌బీ అంటే పిల్లల కోసం ఇచ్చే ప్రత్యేక రకం టికెట్. ఇందులో పిల్లల పేరుతో టికెట్ జారీ అవుతుంది. కానీ ప్రత్యేక సీటును కేటాయించరు. పిల్లలు తమ తల్లిదండ్రులు లేదా కుటుంబంలోని పెద్దలతో అదే సీటులో ప్రయాణించాలి. ఈ టికెట్‌లో సీటు నంబర్ స్థానంలో ఎన్‌వోఎస్‌బీ అని ముద్రిస్తారు. ఈ నిబంధన స్లీపర్, త్రీ ఏసీ, టూ ఏసీ, ఫస్ట్ ఏసీ వంటి నిద్రించే బెర్త్‌లు ఉన్న కోచ్‌లలో మాత్రమే అమల్లో ఉంటుంది. ఛైర్ కార్ లేదా కేవలం సీటింగ్ కోచ్‌లలో ఎన్‌వోఎస్‌బీ ఎంపిక ఉండదు. అలాంటి కోచ్‌లలో పిల్లల కోసం ప్రత్యేక సీటుతో కూడిన పూర్తి టికెట్ ను తప్పనిసరిగా కొనుగోలు చేయాలి.

ఎలా తీసుకోవాలి..

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లో టికెట్ బుక్ చేసే సమయంలో పిల్లల వయస్సు నమోదు చేసిన తర్వాత ప్రత్యేక సీటు లేదా ఎన్‌వోఎస్‌బీ ఎంపిక కనిపిస్తుంది. ఎన్‌వోఎస్‌బీ ఎంపికను ఎంచుకుంటే పిల్లలకు ప్రత్యేక సీటును కేటాయించరు. సీటు ఎంపికను ఎంచుకుంటే మాత్రం పిల్లల పేరుతో ప్రత్యేక సీటు బుక్ అవుతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement