Cristiano Ronaldo | ఇదే నా చివరి ప్రపంచకప్.. ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో
Cristiano Ronaldo | పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం, కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో ఇంటర్నేషనల్ కెరీర్‌కు సంబంధించిన కీలక ప్రకటన చేశాడు. 2026 ఫిఫా ప్రపంచకప్ తన కెరీర్‌లో చివరి ప్రపంచకప్ అని స్పష్టం చేశాడు. ప్రస్తుతం 41 ఏళ్ల వయసులో ఆరో ప్రపంచకప్ ఆడుతున్న రొనాల్డో.. ఈసారి ఎలాగైనా పోర్చుగల్‌కు తొలి ప్రపంచకప్ టైటిల్ అందించాలనే లక్ష్యంతో బరిలోకి దిగినట్లు తెలిపాడు.
Cristiano Ronaldo | పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం, కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో ఇంటర్నేషనల్ కెరీర్‌కు సంబంధించిన కీలక ప్రకటన చేశాడు. 2026 ఫిఫా ప్రపంచకప్ తన కెరీర్‌లో చివరి ప్రపంచకప్ అని స్పష్టం చేశాడు. ప్రస్తుతం 41 ఏళ్ల వయసులో ఆరో ప్రపంచకప్ ఆడుతున్న రొనాల్డో.. ఈసారి ఎలాగైనా పోర్చుగల్‌కు తొలి ప్రపంచకప్ టైటిల్ అందించాలనే లక్ష్యంతో బరిలోకి దిగినట్లు తెలిపాడు. ప్రపంచకప్ రౌండ్ ఆఫ్-16లో స్పెయిన్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో రొనాల్డో మాట్లాడాడు. "అవును.. ఇదే నా చివరి ప్రపంచకప్. ఇప్పుడు ఈ క్షణాలను పూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నాను" అని వెల్లడించాడు.
మీడియాపై అసహనం..
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రొనాల్డో కొంత ఆగ్రహంగా కనిపించాడు. తనను ఇష్టపడని కొందరు జర్నలిస్టులు ఉన్నారని వ్యాఖ్యానించాడు. 41 ఏళ్ల వయసులో ప్రపంచకప్ ఆడడం ఎంతటి సవాల్ అనే ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందించాడు. "మీలో కొందరితో మాట్లాడడమే చాలా కష్టం. ముఖ్యంగా నన్ను ఇష్టపడని వారితో. మీరు కూడా వారిలో ఒకరు. మీ ముఖం ఒక్కసారి చూస్తే చాలు గుర్తుపెట్టుకుంటాను" అంటూ వ్యాఖ్యానించాడు. గ్రూప్ దశలో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో రొనాల్డోను పూర్తి సమయం మైదానంలో ఉంచడంపై మాజీ ఆటగాళ్లు, ఫుట్‌బాల్ విశ్లేషకులు విమర్శలు వ్యక్తం చేశారు. క్రొయేషియాతో జరిగిన రౌండ్ ఆఫ్-32 మ్యాచ్‌లో ఆయనను 81వ నిమిషంలో మార్చారు. ఆ మ్యాచ్‌లో రొనాల్డో పెనాల్టీ ద్వారా ఒక గోల్ చేయగా, పోర్చుగల్ 2-1తో విజయం సాధించి తదుపరి దశకు చేరుకుంది.
భవిష్యత్‌పై తర్వాత నిర్ణయం
క్రొయేషియాపై విజయం అనంతరం తన అంతర్జాతీయ కెరీర్ భవిష్యత్తుపై కూడా రొనాల్డో స్పందించాడు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి ప్రపంచకప్‌పైనే ఉందని చెప్పాడు. "ఇప్పుడే భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. ప్రపంచకప్ ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని తర్వాత ఏం చేయాలనేది నిర్ణయిస్తాను. ఇప్పుడు మాత్రం ఈ క్షణాలను ఆస్వాదించాలనుకుంటున్నాను" అని పేర్కొన్నాడు. క్లబ్ ఫుట్‌బాల్‌లో అత్యంత విజయవంతమైన ప్లేయర్లలో రొనాల్డో ఒకడు. మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్ జట్ల తరఫున ఎన్నో చారిత్రక విజయాలు సాధించాడు. ఆరు సార్లు యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ టైటిల్ గెలిచిన ఘనత కూడా రొనాల్డో సొంతం. అంతర్జాతీయ స్థాయిలో పోర్చుగల్‌కు 2016 యూఈఎఫ్ఏ యూరో కప్‌ను అందించిన రొనాల్డోకు మాత్రం ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. తన కెరీర్‌లో చివరి ప్రపంచకప్‌గా ప్రకటించిన ఈ టోర్నీలో పోర్చుగల్‌ను తొలిసారి విశ్వవిజేతగా నెలబెడతాడా అన్నది చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
- ●Suicide | నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. భార్యకు వీడియో కాల్లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లిన భర్త
- ●Indian Railways | పిల్లలతో రైలు ప్రయాణం ? ఈ రైల్వే నిబంధన తెలియకపోతే జరిమానా తప్పదు..
- ●Bikers Perform Stunts | రెచ్చిపోయిన ఆకతాయిలు.. అంబులెన్స్‌కు దారివ్వకుండా
- ●Karur Stampede Case | కరూర్ తొక్కిసలాటపై డీఎంకే పిటిషన్.. రేపు విచారణకు ఓకే అన్న సుప్రీం..!
- ●Vinod Kumar | ఇక్కడ.. అక్కడ.. రెండు ఓట్ల సంగతి ఎప్పుడు తేలుస్తరు?
- ●Harish Rao | కష్టపడే వారికి వారికి చేయూత అందిస్తా.. : హరీశ్ రావు

Suicide | నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. భార్యకు వీడియో కాల్లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లిన భర్త

Indian Railways | పిల్లలతో రైలు ప్రయాణం ? ఈ రైల్వే నిబంధన తెలియకపోతే జరిమానా తప్పదు..

Bikers Perform Stunts | రెచ్చిపోయిన ఆకతాయిలు.. అంబులెన్స్‌కు దారివ్వకుండా

Karur Stampede Case | కరూర్ తొక్కిసలాటపై డీఎంకే పిటిషన్.. రేపు విచారణకు ఓకే అన్న సుప్రీం..!





