UNGA | జమ్ము కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే.. ఐరాసలో పాక్ తీరును ఎండగట్టిన భారత్
UNGA | ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో (United Nations General Assembly) దాయాది పాకిస్థాన్ (Pakistan) తీరును భారత్ (India) మరోసారి తీవ్రంగా ఎండగట్టింది. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
UNGA | ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో (United Nations General Assembly) దాయాది పాకిస్థాన్ (Pakistan) తీరును భారత్ (India) మరోసారి తీవ్రంగా ఎండగట్టింది. ఐరాసలో పాక్ మరోసారి జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir) అంశాన్ని లేవనెత్తగా.. భారత్ తీవ్రంగా స్పందించింది. భారత్ అంతర్గత వ్యవహారాల్లో ఇస్లామాబాద్ పదేపదే జోక్యం చేసుకుంటోందని మండిపడింది. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
ఐరాస భద్రతా మండలి వార్షిక నివేదికపై జరిగిన చర్చలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి అసీమ్ ఇఫ్తిఖార్ అహ్మద్ జమ్ము కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. వెంటనే స్పందించిన ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ (Parvathaneni Harish).. జమ్ము కశ్మీర్ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. తప్పుడు, పక్షపాతంతో కూడిన కథనాలను ప్రచారం చేయొద్దంటూ ఇస్లామాబాద్‌ను హెచ్చరించారు. జమ్ము కశ్మీర్‌కు సంబంధించిన అన్ని విషయాలూ పూర్తిగా భారత్ అంతర్గత వ్వవహారాలని పునరుద్ఘాటించారు. "జమ్ము కశ్మీర్ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. దీనికి విరుద్ధంగా చేసే ఎలాంటి వాదనలైనా నిరాధారమైనవి. అవి చారిత్రక వాస్తవాలకు పూర్తిగా విరుద్ధం. పాకిస్థాన్ తరచూ చేసే అబద్ధపు ప్రచారాలు, ఆరోపణలు ఈ వాస్తవాన్ని ఏమాత్రం మార్చలేవు" అని హరీశ్ తేల్చిచెప్పారు.
అంతేకాదు పాక్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐరాస వేదికలను ఇస్లామాబాద్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం అలవాటుగా మార్చుకుందని మండిపడ్డారు. భద్రతా మండలిలో సభ్యదేశంగా ఉండటం అంటే ప్రపంచ శాంతి, భద్రత పరిరక్షణలో కీలక పాత్ర పోషించడం అని తెలిపారు. అలాంటి స్థానాన్ని పక్షపాతపూరిత, తప్పుడు ప్రచారాలకు వేదికగా మార్చడం బాధ్యతారాహిత్యం అని పర్వతనేని హరీష్ వ్యాఖ్యానించారు. కాగా, పాకిస్థాన్ ప్రస్తుతం ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
Also Read..
భారత్‌పై ఆంక్షలు పెడితే.. అవతలివారికే నష్టం : పుతిన్
లిక్కర్ వ్యాన్ బోల్తా.. మద్యం సీసాల కోసం ఎగబడ్డ జనం.. వీడియో
శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న భారత్ ఎయిర్ డిఫెన్స్ కోట!
తాజావార్తలు
- ●Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్
- ●Bihar Student Protests | పాట్నాలో రణరంగం: బారికేడ్లు బద్దలుకొట్టి సీఎం ఇంటికి విద్యార్థుల మార్చ్.. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు
- ●Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..
- ●Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం
- ●Rashmika Mandanna | రవితేజ ఇరుముడికి రష్మిక మందన్న ఎమోషనల్ రివ్యూ
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

Minister Ponnam | చదువుకు ఆటంకం కలుగకుండా ఫీజు రీయింబ్స్‌మెంట్

Bihar Student Protests | పాట్నాలో రణరంగం: బారికేడ్లు బద్దలుకొట్టి సీఎం ఇంటికి విద్యార్థుల మార్చ్.. లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసులు

Kuttu Machine Scheme | ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్’ పథకం.. దరఖాస్తు ప్రక్రియ షురూ..

Ponguleti Srinivas Reddy | ఎల్లుండి నుంచి ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా.. ఎంపిక కానివారికి డబ్బులు వాపస్ ఇస్తాం






