Amarnath Yatra 2026 | మూడు రోజుల్లో 56 వేల మంది దర్శనం.. 90% కరిగిపోయిన మంచు లింగం..!
Amarnath Yatra 2026 | పవిత్ర అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra)కు భక్తులు పోటెత్తున్నారు. ఈ యాత్ర ప్రారంభమైన మూడు రోజుల్లోనే మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని ఏకంగా 56 వేల మంది దర్శించుకున్నారు. అదే సమయంలో మంచు లింగం వేగంగా కరిగిపోతోంది. 90 శాతం కరిగిపోయింది. మే చివరినాటికి 7 అడుగుల ఎత్తు ఉన్న మంచు లింగం.. ప్రస్తుతం ఒక అడుగుకు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Amarnath Yatra 2026 | పవిత్ర అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra)కు భక్తులు పోటెత్తున్నారు. ఈ యాత్ర ప్రారంభమైన మూడు రోజుల్లోనే మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని ఏకంగా 56 వేల మంది దర్శించుకున్నారు. ఆదివారం ఒక్కరోజే 24,648 మంది భక్తులు అమర్‌నాథ్ గుహను సందర్శించారు. తొలి రోజు 12,168 మంది, రెండో రోజు 19,221 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. దీంతో మూడు రోజుల్లోనే స్వామివారిని దర్శించుకున్న వారి సంఖ్య 56వేల మార్క్‌ను దాటింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 18 శాతం ఎక్కువ అని అధికారులు తెలిపారు. గతేడాది మొదటి మూడు రోజుల్లో 47,972 మంది యాత్రికులు మంచు లింగాన్ని దర్శించుకున్నారు.
దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు అమర్‌నాథ్ యాత్రకు తరలివస్తున్నారు. జమ్ము, బాల్తాల్, నున్వాన్ బేస్ క్యాంపులకు పోటెత్తుతున్నారు. ఫలితంగా ఆ మార్గాల్లో భారీ రద్దీ నెలకొంది. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో జులై 9వరకూ రిజిస్ట్రేషన్ స్లాట్లు పూర్తిగా నిండిపోయినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా యాత్ర చేపట్టాలనుకునే యాత్రికులు తమ యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించారు.
90 శాతం కరిగిపోయిన మంచు లింగం..
ఇదిలా ఉండగా.. జమ్ము-కశ్మీర్ హిమాలయాల్లోని 3,880మీటర్ల ఎత్తులో అమర్‌నాథ్ గుహల్లో ఏటా సహజసిద్ధంగా ఏర్పడే మంచులింగం చాలా వేగంగా కరిగిపోతోంది. లింగం పరిమాణం భారీగా తగ్గిపోయింది. ఏకంగా 90 శాతం కరిగిపోయినట్లు సమాచారం. మే చివరి నాటికి దాదాపు 7 అడుగుల ఎత్తు ఉన్న మంచు లింగం.. ప్రస్తుతం ఒక అడుగుకు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 57 రోజులపాటు కొనసాగే ఈ యాత్ర.. మూడు రోజుల్లోనే మంచు లింగం కరిగిపోతుండటం భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాది మంచు లింగం వేగంగా కరగడానికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, గుహ లోపల పెరిగిన మానవ కార్యకలాపాలే కారణమని నిపుణులు చెబుతున్నారు.
Also Read..
నా వద్ద 10 ఏనుగు దంతాలు, 13 దంతపు విగ్రహాలు ఉన్నాయి: మోహన్ లాల్
మూడు దేశాల పర్యనటకు మోదీ.. కీలక ఒప్పందాలపై చర్చించనున్న ప్రధాని
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bharti Airtel | అమర్‌నాథ్ యాత్ర మార్గాల్లో ఎయిర్టెల్ ఫుల్ సిగ్నల్.. నెట్‌వర్క్‌ను విస్తరించిన సంస్థ..
జులై 3, 2026

Amarnath Yatra 2026 | అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. భారీ వర్షంలోనూ తరలివెళ్తున్న భక్తులు
జులై 3, 2026

Amarnath | మంచు బిందువులే శివలింగంగా..! అమర్‌నాథ్ మంచు శివలింగం వెనుక రహస్యమిదే..!
జులై 2, 2026
తాజావార్తలు
- ●Suicide | నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. భార్యకు వీడియో కాల్లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లిన భర్త
- ●Cristiano Ronaldo | ఇదే నా చివరి ప్రపంచకప్.. ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో
- ●Indian Railways | పిల్లలతో రైలు ప్రయాణం ? ఈ రైల్వే నిబంధన తెలియకపోతే జరిమానా తప్పదు..
- ●Bikers Perform Stunts | రెచ్చిపోయిన ఆకతాయిలు.. అంబులెన్స్‌కు దారివ్వకుండా
- ●Karur Stampede Case | కరూర్ తొక్కిసలాటపై డీఎంకే పిటిషన్.. రేపు విచారణకు ఓకే అన్న సుప్రీం..!
- ●Vinod Kumar | ఇక్కడ.. అక్కడ.. రెండు ఓట్ల సంగతి ఎప్పుడు తేలుస్తరు?

Suicide | నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. భార్యకు వీడియో కాల్లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లిన భర్త

Cristiano Ronaldo | ఇదే నా చివరి ప్రపంచకప్.. ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో

Indian Railways | పిల్లలతో రైలు ప్రయాణం ? ఈ రైల్వే నిబంధన తెలియకపోతే జరిమానా తప్పదు..

Bikers Perform Stunts | రెచ్చిపోయిన ఆకతాయిలు.. అంబులెన్స్‌కు దారివ్వకుండా



