Tirumala | కాలినడకన తిరుమలకు వచ్చిన 116 ఏళ్ల వృద్ధురాలికి.. వీఐపీ బ్రేక్ దర్శనం
Tirumala | కాలినడకన తిరుమలకు వచ్చిన 116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మకు (116 year old Navaneethamma) తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది.
Tirumala | త్రినేత్ర.న్యూస్ : కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం 116 ఏళ్ల వయసులోనూ కాలినడకన వచ్చిన వృద్ధురాలు నవనీతమ్మకు (116 year old Navaneethamma) తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) ప్రత్యేకంగా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. చైర్మన్ బీఆర్ నాయుడు చొరవతో నవనీతమ్మతోపాటూ ఆమె కుటుంబానికి కూడా స్వామివారి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారు.
సోమవారం ఉదయం వృద్ధురాలిని టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనానికి తీసుకెళ్లారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వృద్ధురాలి వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నవనీతమ్మ కుటుంబం టీటీడీ అధికారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. కాగా, తమిళనాడు రాష్ట్రానికి చెందిన 116 ఏళ్ల నవనీతమ్మ అలిపిర మార్గం గుండా శనివారం తిరుమల వెళ్లారు. వృద్ధురాలు మెట్లమార్గం గుండా వెళ్తున్న వీడియోలను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఆ వీడియోల ఆధారంగా వృద్ధురాలి వివరాలు సేకరించిన టీటీడీ చైర్మన్.. ఆమెకు వీఐపీ దర్శన ఏర్పాట్లు చేశారు.
#WATCH | Tirupati, Andhra Pradesh: Tirumala Tirupati Devasthanam officials arranged a special darshan for 116-year-old Navaneethamma after she walked up to Tirumala on foot. pic.twitter.com/HOiLZwKnFJ
— ANI (@ANI) July 6, 2026
ఈ రోజు 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు శ్రీమతి నవనీతమ్మ గారికి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ప్రత్యేక విఐపీ బ్రేక్ దర్శనం విజయవంతంగా కల్పించాము.
అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు… pic.twitter.com/3Cbu2loCVX
— B R Naidu (@BollineniRNaidu) July 6, 2026
Also Read..
బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
మూడు రోజుల్లో 56 వేల మంది దర్శనం.. 90% కరిగిపోయిన మంచు లింగం..!
తాజావార్తలు
- ●MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్
- ●Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్

MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?

Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం






