Suicide | నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లిన భర్త
Suicide | వరంగల్ జిల్లా కాజీపేటలో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నానని తన భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు తీసుకున్నాడు.
త్రినేత్ర.న్యూస్: వరంగల్ జిల్లా కాజీపేటలో ఘోరం జరిగింది. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నానని తన భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలుకు ఎదురెళ్లి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన పలువురిని కలిచివేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
వరంగల్ కు చెందిన రాజేశ్ నాయక్ (45) వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా ఆస్తి విషయంలో భార్య, తల్లిదండ్రుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజేశ్‌కు అతని భార్యతకు మళ్లీ ఆదివారం రాత్రి గొడవ జరిగింది. దీంతో రాజేశ్ ఇంటి నుంచి బయటకు వెళ్లి నేరుగా రైలు పట్టాల మీదకు చేరుకున్నాడు. అక్కడే నిలబడి భార్యకు వీడియో కాల్ చేసి ఎదురుగా వస్తున్న రైలును చూపిస్తూ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు.
అయితే ఈ విషయాన్ని భార్య తేలిగ్గా తీసుకుంది. తనను బెదిరిస్తున్నాడని ఊహించించి. ఫోన్ కట్ అయ్యేలోపే ఈ ఘోరం జరిగిపోవడంతో భార్య కేకలు వేస్తూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. పలువురు సోమవారం ఉదయం రైలు పట్టాలపై మృతదేహం ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. వారు వెళ్లి చూడగా అక్కడ రాజేశ్ మృతదేహం కనిపించింది. ఇది చూసిన అతడి తల్లిదండ్రులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు (GRP) ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి కుమారుడు ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!





