Bhagyashri Borse | నేను హీరోయిన్ కావడం మా అమ్మకు ఇష్టం లేదు – భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్
అమ్మనాన్నలకు ఇష్టం లేకుండా సినిమాల్లోకి రావడంతో ఆరు నెలల పాటు ఇంట్లోవాళ్లు ఎవరూ తనతో మాట్లాడలేదని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అన్నది. వాట్సాప్‌లో తన నంబర్‌ను బ్లాక్ చేశారంటూ చెప్పింది. కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న కష్టాలపై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ బోర్సే ఆసక్తికర కామెంట్స్ చేసింది.
Entertainment | Published On Jul 30, 2026, 4.02 pm IST
Bhagyashri Borse | లెనిన్ మూవీతో కెరీర్‌లో ఫస్ట్ హిట్‌ను అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమాలో అందం, ధైర్యం కలబోసిన పల్లెటూరి అమ్మాయిగా అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. లెనిన్‌కు ముందు ఐరెన్‌లెగ్ అంటూ భాగ్యశ్రీపై చాలా విమర్శలు వచ్చాయి. ఈ బ్యూటీ సినిమా చేసిందంటే డిజాస్టరే అంటూ ట్రోల్ చేశారు. ఆ విమర్శలన్నింటికి లెనిన్‌తో పుల్‌స్టాప్ పెట్టేసింది. ప్రస్తుతం ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది భాగ్యశ్రీ బోర్సే.
ఇష్టం లేకుండా...
ఇటీవల ఇచ్చిన ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న కష్టాలపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను హీరోయిన్ కావడం కుటుంబసభ్యులెవరికి ఇష్టం లేదని అన్నది. అమ్మ తనను వాట్సాప్‌లో బ్లాక్ చేసిందని చెప్పి ఎమోషనల్ అయ్యింది.
పార్ట్‌టైమ్ మోడలింగ్...
"చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం ఉండేది. కానీ అమ్మనాన్నల బలవంతంతో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తిచేశా. పార్ట్‌టైమ్‌గా మోడలింగ్ చేస్తూనే చదువును కొనసాగించా. అదే టైమ్‌లో హిందీ మూవీ యారియన్ 2లో అవకాశం వచ్చింది. మోడలింగ్‌కే అతి కష్టంగా ఓకే చెప్పిన కుటుంబసభ్యులు సినిమాల్లోకి వెళతానంటే అస్సలు అంగీకరించలేదు. యాక్టింగ్ అనే ఆలోచనే మనసులోకి రావద్దంటూ హెచ్చరించారు. అమ్మనాన్నలతో పాటు చివరికి మా అక్క కూడా నాకు సపోర్ట్‌గా నిలవలేదు. అందరూ నా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఇష్టం లేకుండా సినిమాల్లోకి రావడంతో మా అమ్మ నాతో మాట్లాడటం మానేసింది. వాట్సాప్‌లో నా నంబర్‌ను బ్లాక్ చేసింది. ఆరు నెలలు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాకు ఇష్టమైన సినిమా కోసం కష్టాలన్నీ భరించా. నన్ను, నా కలను అందరూ అర్థం చేసుకునే రోజు ఏదో ఒక రోజు వస్తుందని ఆశగా ఎదురుచూశా" అని చెప్పింది.
ఐరెన్ లెగ్ అంటూ ట్రోల్స్...
"ఫ్లాప్‌లు ఎదురవ్వడంతో నాపై చాలానే విమర్శలు వచ్చాయి. ఐరెన్‌లెగ్ అంటూ ట్రోల్ చేయడంతో బాధపడ్డా. అమ్మనాన్నల నిర్ణయాన్ని కాదని సినిమాల్లోకి వచ్చా తప్పుచేశాననిపించింది. ఒక్క సక్సెస్ ఆ బాధను మొత్తం పోగొట్టింది. ఇప్పుడు నన్ను చూసి మా అమ్మనాన్న గర్వపడుతుండటం ఆనందాన్ని కలిగిస్తోంది" అని భాగ్యశ్రీ బోర్సే అన్నది.
సంబంధిత వార్తలు

Krithi Shetty | బేబమ్మ బర్త్‌డే ట్రీట్ – లంగా ఓణీలో కృతిశెట్టి – జనవరి 12 విడుదల ఫస్ట్ లుక్ రిలీజ్
సెప్టెంబర్ 21, 2026

Toxic OTT | ట్రిమ్ వెర్షన్‌తో ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’ – బోల్డ్ సీన్లు కట్!
సెప్టెంబర్ 21, 2026

Nani Interview | మా అమ్మకు యాక్షన్ సినిమాలు నచ్చవు – పుష్పతో కంపేరిజన్స్ – ప్యారడైజ్ సినిమాపై నాని కామెంట్స్
సెప్టెంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Dharmasthala Case | మరోసారి తెరపైకి ధర్మస్థల హత్యాచార కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు
- ●Amazon Great Indian Festival | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు డేట్ ఫిక్స్.. భారీ ఆఫర్లు..
- ●Kerala Film Festival | కేరళ ఫిల్మ్ ఫెస్టివల్.. 31 సినిమాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- ●KTR | సిరిసిల్ల అభివృద్ధిని కొడంగల్‌లో చేసేందుకు వస్తున్నరేమో?
- ●టెసరాక్ట్ వర్సెస్ ఫామ్‌హౌస్‌లు.. ఒకరి ఆరోపణకు మరొకరి ఆస్తులే సమాధానమా?
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లో జోరు.. 564 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

Dharmasthala Case | మరోసారి తెరపైకి ధర్మస్థల హత్యాచార కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు

Amazon Great Indian Festival | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు డేట్ ఫిక్స్.. భారీ ఆఫర్లు..

Kerala Film Festival | కేరళ ఫిల్మ్ ఫెస్టివల్.. 31 సినిమాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

KTR | సిరిసిల్ల అభివృద్ధిని కొడంగల్‌లో చేసేందుకు వస్తున్నరేమో?



