US Senate | భారత్‌పై 100 శాతం టారిఫ్‌లు.. కీలక బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం
US Senate | ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాపై మరింత ఒత్తిడి పెంచేందుకు అమెరికా సిద్ధమైంది. ఇందులో భాగంగానే రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం పేరుతో తీసుకొచ్చిన శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026 బిల్లుకు (Russia Sanctions Bill) యూఎస్ సెనేట్ ఆమోదం తెలిపింది.
US Senate | త్రినేత్ర.న్యూస్ : ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యాపై మరింత ఒత్తిడి పెంచేందుకు అమెరికా సిద్ధమైంది. ఇందులో భాగంగానే రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం పేరుతో తీసుకొచ్చిన శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026 బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు రష్యా నుంచి చమురు (Russian oil), సహజ వాయువును అత్యధికంగా కొనుగోలు చేస్తున్న ప్రపంచంలోని టాప్-5 దేశాలైన చైనా, భారత్, స్లొవేకియా, హంగేరీ, అజర్‌బైజాన్‌పై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించేలా అమెరికా అధ్యక్షుడికి అధికారాలు కల్పిస్తుంది. ఈ బిల్లుకు సెనేట్‌లో ప్రవేశపెట్టగా అనుకూలంగా 80 ఓట్లు, వ్యతిరేకంగా 11 ఓట్లు వచ్చాయి. సెనేట్ ఆమోదం పొందిన ఈ బిల్లు ఈనెల 31న ప్రతినిధుల సభ ముందుకు వెళ్లనుంది. అక్కడ కూడా ఈ బిల్లు ఆమోదం పొందితే అధ్యక్షుడి సంతకంతో చట్టరూపం దాల్చనుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత్‌పై 100 శాతం టారిఫ్ భారం పడనుంది.
భారత్‌పై సుంకాలు.. మనకే నష్టం
అయితే, ఈ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు అమెరికా సెనేటర్లు భారత్‌పై సుంకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సుంకాల నిర్ణయం వల్ల తమకే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో భారత్.. రష్యా, చైనావైపు మళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకోవడం కష్టతరమవుతుందని పేర్కొన్నారు. చైనాతో ఎదురవుతున్న ఖండాంతర, సరిహద్దు సవాళ్ల నేపథ్యంలో భారత్ సహకారం ఎంతో ముఖ్యమని గుర్తు చేశారు. భారత్‌పై 100 శాతం సుంకాల నిర్ణయం అమెరికా ప్రయోజనాలనే దెబ్బతీస్తుందని చెప్పారు.
రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా సవరణ..
ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపే విషయంలో మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకు తీసుకొచ్చిన ఆంక్షల బిల్లుకు అమెరికా సెనేట్ (US Senators) కీలక సవరణలు చేసిన విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై మొదట ప్రతిపాదించిన గరిష్ట 500 శాతం దిగుమతి సుంకాన్ని 100 శాతానికి తగ్గించింది. అమెరికా జాతీయ భద్రత, ప్రయోజనాల దృష్ట్యా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తలుచుకుంటే ఏ దేశానికైనా ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చే అధికారాన్ని బిల్లులో చేర్చారు. అయితే సవరించిన ఈ బిల్లులో అమెరికా ద్వంద్వ వైఖరిని అవలంభించింది.
భారత్, చైనాపై 100 శాతం టారిఫ్‌లు అంటున్న అమెరికా.. ఐరోపాదేశాలకు ఈ బిల్లులో గణనీయమైన మినహాయింపులు ఇచ్చింది. రష్యా నుంచి దిగుమతి చేసుకునే సహజ వాయువు మొత్తం రష్యా ఎగుమతుల్లో 15 శాతం కంటే తక్కువగా ఉండటం, అలాగే ఆ దిగుమతులను తగ్గించేందుకు సంబంధిత దేశాలు స్పష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నిరూపించగలిగితే టారిఫ్‌ల నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంటుందని తెలిపింది. రష్యా సహజ వాయువును దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశాలలో చైనాతోపాటూ ఫ్రాన్స్, జపాన్, హంగరీ, బెల్జియం దేశాలు ఉన్నాయి. అలాగే అంతరిక్ష, అణు రంగాల్లో రష్యాతో అమెరికా జరిపే ప్రాజెక్టులకు కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవని ఈ బిల్లు చెబుతోంది. ఈ బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఇటీవలే మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఈ బిల్లుకు ఆయనపేరును ప్రతిపాదించారు.
మరోవైపు రష్యా చమురు కొనుగోళ్ల విషజ్ఞంలో భారత్ తన స్థిరమైన వైఖరిని కొనసాగిస్తోంది. 140 కోట్ల మంది భారతీయుల ఇంధన అవసరాలను తీర్చడం తమ ప్రాధమిక లక్ష్యం అని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఎక్కడ తక్కువకు దొరికితే అక్కడే ఇంధనం కొనుగోలు చేస్తామని అమెరికాకు తెలియజేసింది.
Also Read..
హైడ్రా రిక్రూట్‌మెంట్‌కు పోటెత్తిన యువత.. సరూర్‌నగర్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
తాజావార్తలు
- ●Amazon Great Freedom Sale 2026 | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ షురూ.. భారీ డిస్కౌంట్ ధరలకు ఫోన్లు..
- ●HYDRAA | హైడ్రా రిక్రూట్‌మెంట్‌కు పోటెత్తిన యువత.. సరూర్‌నగర్ స్టేడియం వద్ద ఉద్రిక్తత
- ●Road Accident | బస్సు బోల్తా.. ఏడుగురు మృతి
- ●Niharika Konidela | బంగారు బోనం ఎత్తిన మెగా డాటర్ నిహారిక కొణిదెల
- ●Wine Shops | మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్ షాపులు బంద్
- ●Gold And Silver Prices Today | మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. పెట్టుబడిదారుల ఉత్సాహం..

Amazon Great Freedom Sale 2026 | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ షురూ.. భారీ డిస్కౌంట్ ధరలకు ఫోన్లు..

HYDRAA | హైడ్రా రిక్రూట్‌మెంట్‌కు పోటెత్తిన యువత.. సరూర్‌నగర్ స్టేడియం వద్ద ఉద్రిక్తత

Road Accident | బస్సు బోల్తా.. ఏడుగురు మృతి

Niharika Konidela | బంగారు బోనం ఎత్తిన మెగా డాటర్ నిహారిక కొణిదెల






