Road Accident | బస్సు బోల్తా.. ఏడుగురు మృతి
Road Accident | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. చంబా (Chamba) జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది.
Road Accident | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. చంబా (Chamba) జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. చంబా జిల్లాలోని చురా సబ్‌డివిజన్‌లోని పర్వతమార్గంలో గల బైరాగఢ్-తిస్సా రహదారిపై మూల మలుపు వద్ద శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపుతప్పి రోడ్డుపై తలకిందలుగా పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. 11 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కుపోయిన ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాగా, రుతుపవనాల సీజన్‌లో జూన్ 30 నుంచి ఆగస్టు 7 వరకూ జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటి వరకూ 78 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read..
బంగారు బోనం ఎత్తిన మెగా డాటర్ నిహారిక కొణిదెల
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్ షాపులు బంద్
మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. పెట్టుబడిదారుల ఉత్సాహం..
సంబంధిత వార్తలు

Road Accident | నియో పోలీస్ వద్ద బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం
ఆగస్టు 8, 2026

Hyderabad biker | హిమాచల్‌లో హైదరాబాద్ బైక్ రైడర్ అదృశ్యం.. రెండు వారాలైనా లభించని ఆచూకీ
ఆగస్టు 2, 2026

Police Staff Support | కన్నీటి ఇంటికి ఖాకీ అండ.. జవాన్ కుటుంబానికి రూ.5.20 లక్షల చేయూత
జులై 28, 2026
తాజావార్తలు
- ●Niharika Konidela | బంగారు బోనం ఎత్తిన మెగా డాటర్ నిహారిక కొణిదెల
- ●Wine Shops | మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్ షాపులు బంద్
- ●Gold And Silver Prices Today | మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. పెట్టుబడిదారుల ఉత్సాహం..
- ●UPI | యూపీఐ ఖర్చులను ఎవరు చెల్లించాలి.. పేమెంట్స్ కౌన్సిల్ ఏం చెప్పింది..?
- ●Road Accident | నియో పోలీస్ వద్ద బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు దుర్మరణం
- ●Google Maps | గూగుల్ మ్యాప్స్‌లో భారీ అప్డేట్.. హిందీలో అడగొచ్చు.. జీమెయిల్‌తో సెక్యూర్ కనెక్షన్..

Niharika Konidela | బంగారు బోనం ఎత్తిన మెగా డాటర్ నిహారిక కొణిదెల

Wine Shops | మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్ షాపులు బంద్

Gold And Silver Prices Today | మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. పెట్టుబడిదారుల ఉత్సాహం..

UPI | యూపీఐ ఖర్చులను ఎవరు చెల్లించాలి.. పేమెంట్స్ కౌన్సిల్ ఏం చెప్పింది..?



